కరీంనగర్: సైదాపూర్ మండలం శివరాంపల్లిలో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిందని, పదవ తరగతి చదివే విద్యార్థినిని బలవంతంగా పురుగుల మందు తాగించి గొంతు నులిమి తల్లిదండ్రులే హత్య చేశారు. ఆ తరువాత కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన గత నెల 14న జరిగింది. పోలీసుల విచారణ అనంతరం తల్లిదండ్రులే హత్య చేశారని నిర్థారించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హుజూరాబాద్ ఏసీపీ మాధవి వెల్లడించారు.


