Hyderabad: కార్పొరేటర్‌ దేదీప్యరావుపై కేసు నమోదు | Case Registration On GHMC Corporator Dedeepya Rao | Sakshi
Sakshi News home page

Hyderabad: కార్పొరేటర్‌ దేదీప్యరావుపై కేసు నమోదు

Feb 10 2026 12:26 PM | Updated on Feb 10 2026 12:33 PM

Case Registration On GHMC Corporator Dedeepya Rao

హైదరాబాద్: వెంగళరావునగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ దేదీప్యరావుపై మధురానగర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 6న కృష్ణాకాంత్‌పార్కు సమీపంలోని సాయిబాబా దేవాలయం వద్ద కొందరు వ్యక్తులు గొడవపడటంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. 

అనంతరం ఒక గ్రూపులో బి.రూప, సత్యం యాదవ్, నర్సింగ్‌ యాదవ్, నాగ యాదవ్, మరికొందరు ఉన్నారు. మరో గ్రూపులో వెంగళరావునగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ దేదీప్యరావు, సత్యనారాయణ, ఇమ్రాన్, బబ్లూ తదితరులు ఉన్నట్టుగా గుర్తించారు. సీసీ ఫుటేజీలు, ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు సుమోటాగా స్వీకరించి ఇరువర్గాల వారిపై కేసును నమోదు చేశారు.   

 

 

Advertisement
 
Advertisement
Advertisement