breaking news
ande sri
-
సహజకవి అందెశ్రీకి మరణం లేదు
సహజ కవిత్వం, మాటపాటలతో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన అందెశ్రీకి మరణం లేదని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) కెనడా అభిప్రాయపడింది. టొరెంటోలో స్థిరపడిన తెలంగాణ వాసులు అందెశ్రీ సంస్మరణ సభను నిర్వహించారు. స్థానిక తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై అందెశ్రీకి నివాళులు అర్పించారు.ఉద్యమానికి ముందూ, తర్వాత కూడా తెలంగాణ ఆత్మలా అందెశ్రీ (Ande Sri) నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ భావజాల వ్యాప్తిలో ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులను కలుసుకొని తన మాట, పాటలతో జనాన్ని జాగృతం చేశారని అన్నారు. 2014లో కెనడాలో పర్యటించిన ఆయన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవటంతోపాటు, ఆయన ఇంటి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కెనడా ఎన్.ఆర్.ఐలు (Canada NRIs) కోరారు. అలాగే అందెశ్రీ రచనలు, కవితలు, పాటలు డిజిటలైజేషన్ చేసి భవిష్యత్ తరాలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి పోలు, సురేందర్ పెద్ది, శ్రీకాంత్ నెరవెట్ల, కృష్ణారెడ్డి చాడ, రవీందర్, అమిత పినకేసి, సుమన్ ముప్పిడి, మహేందర్ రెడ్డి, రవీందర్ కొండం, అర్షద్, ఇతర టీడీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇండియాకు ఎన్నారై జంట -
అందెశ్రీ నాకు అత్యంత ఆప్తుడు: సీఎం రేవంత్
హైదరాబాద్: ఇటీవల కన్నుమూసి ప్రజాకవి అందెశ్రీ తనకు అత్యంత ఆప్తుడని, తన మనసుకు దగ్గరి వాడని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఈరోజు(శనివారం, నవంబర్ 22వ తేదీ) అందెశ్రీ సంస్మరణ సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. ఎంత అమాయకంగా కనిపించినా అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారు. నిజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి బండెనక బండి కట్టి అని గళం విప్పితే సర్కార్ పీఠం కదిలింది..సమైక్యవాదాలకు వ్యతిరేకంగా గద్దర్, గూడా అంజన్న, అందెశ్రీ, గోరేటి వెంకన్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారు.. బడి మొహం ఎరుగని అందెశ్రీ జయ జయ హే తెలంగాణ పాట రాసి స్పూర్తిని నింపారు. ప్రతి తెలంగాణ గుండెకు జయ జయహే తెలంగాణ పాటను అందెశ్రీ చేర్చారు. జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం నా బాధ్యత. తెలంగాణలో ప్రజా పాలన రావాలని గద్దర్, అందెశ్రీ కోరుకున్నారు. అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం.. ఆయన స్మృతి వనాన్ని నిర్మిస్తున్నాం, ఆయన పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. -
బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయం
అందెశ్రీ సహజ కవి, ప్రజాకవి. కాళి దాసుది మేఘ సందేశం, అందెశ్రీది నది సందేశం. ‘నది నడిచి పోతున్నది, నావనై నను రమ్మన్నది’ అంటూ దేశ దేశాలను సందర్శించి ప్రపంచ నదులెన్నో చూసి పరవశించాడు. కవిత్వం కోసం ప్రపంచంలోని నదుల వెంట నడిచిన కవి ప్రపంచంలో అందెశ్రీ ఒక్కడే! అత్యంత పేదరికం నుండి ఆశు కవిగా, ప్రకృతి కవిగా పరిణతి చెందాడు.అందెశ్రీది వాక్శుద్ధి గల కవిత్వం. ఆయన పలికింది సత్యమై కూర్చుంటుంది. అలనాటి పోతులూరి వీరబ్రహ్మం గురించి విన్నాము. పోతులూరి సమాజానికి తిరుగుబాటు నేర్పాడు. రాజులను మార్చాడో లేదో తెలియదు గానీ అందెశ్రీ ప్రభుత్వాలను మార్చుతాను అన్నాడు. ‘వాడెంత’ అన్నవాడిని కుర్చీ నుండి దించే దాక హృదయంలో అగ్నిగుండమై రగిలాడు. అదే ‘నిప్పుల వాగు’ పాటల, కవితల సంకలనం. అది ఆరేండ్ల కృషి. ఆనాడు అవమానించబడిన చాణక్యుడు నంద రాజ్యాన్ని కూల్చి మౌర్య చంద్రగుప్తునికి పట్టాభిషేకం చేసినట్లు... నేటి చాణక్యుడిగా నిలిచి, ‘ఇంటర్వ్యూ నువ్వు చెయ్యాలి. నేను జవాబులు చెప్పాలి’ అని భవిష్యత్ తెలిసిన అందెశ్రీ... రేవంత్‌రెడ్డిని ఇంటర్వ్యూ చేయమన్నాడు. ‘ఆ చదువు రానివాడు నాలుగు నుడుగులు నేర్వగానే ఇంత పొగరా!’ అని అనుకున్న వారు ఉన్నారు. అతడు అంద రినీ ప్రేమించాడు. అతడికి కులం లేదు, ధనం లేదు. అందెశ్రీలో ఎంత పొగరున్నదో, ఎంత విద్వత్తున్నదో అంత వినయ సంపన్నుడు. అది ఆయన గురువుగా గౌరవించే శ్రీరాం సర్‌కు తెలుసు. నాకు తెలుసు. ఆయన వాక్శుద్ధిని గమనించిన సంస్కృతపండితులూ, వయోవృద్ధులూ ఆయనకు తలలు వంచి నమస్కరించారు. అందెశ్రీని ఒక్క మాటలో చెప్పాలంటే... ఆధునిక ఋషి. 1995లో ‘ప్రవహించే పాట: ఆంధ్రప్రదేశ్ దళిత పాటలు’ అనే పాటల పుస్తకం కోసం... అన్ని ప్రాంతాలనుండి వందలాది కవుల పాటలను సేకరిస్తున్న కాలంలో అందెశ్రీ వెలువరించిన రెండు పాటల పుస్తకాలు అందించాడు. అవి అన్నీ ప్రకృతి, పల్లె జీవితం, మానవీయత గురించిన పాటలు. 1992లో ప్రారంభించిన ‘దరకమే’ ఐక్యవేదికలో చేరలేదు. పాట కవుల వేదిక, అలాగే ‘కథకుల వేదిక’ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్న ప్రకారం... గూడ అంజయ్య పాట కవుల వేదికను ప్రారంభించాడు. అందెశ్రీ దానితో కలిసి కొన్ని పాటలు రాశాడు. ఆ పాట కవుల వేదికే ‘తెలంగాణ ధూం ధాం’కు బీజం వేసింది. కామారెడ్డి సభతో తన రూపం తీసుకుంది. పాట కవులు, కళాకారులు తప్ప ఎవరూ వేదికపై ఉండరాదనే నియమంతో ‘తెలంగాణ ధూం ధాం’ బయల్దేరింది. పాట కవుల వేదికను ‘తెలంగాణ ధూం ధాం’గా మలచడంలో అందెశ్రీది కీలక పాత్ర. మారోజు వీరన్న కృషి అంత ర్లీనంగా ఉండింది. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను ‘తెలంగాణ ధూం ధాం’ నిర్మాత అందెశ్రీనే అని! ఈ విషయాన్ని ‘నడుస్తున్న చరిత్ర తెలంగాణ’ సిరీస్ 2వ పుస్తకంలోనే ఇరవై యేళ్ళ క్రితం నమోదు చేశాను. ‘రసమయి’ బాలకిషన్ కళాకారుడిగా తెలంగాణ ధూం ధాంకు ఐకా¯Œ గా నిలిస్తే దాని రూపురేఖలను తీర్చిదిద్ది సాహిత్యాన్ని అందించినది అందెశ్రీ. అంతడుపుల నాగరాజు కళాబంధం దాన్ని రసమయం చేసింది. అందెశ్రీ బడిలో చదవలేకపోయాడు. లోకమే విశ్వవిద్యాలయంగా చదివినవాడు. అతడు పశువులను కాశాడు. సుతారి పని చేశాడు. నిజామాబాద్‌లో శృంగేరీ పీఠానికి చెందిన శంకర్ మహరాజ్ గురూజీ ఆయనకు జ్ఞానబోధ చేశాడు. బిరుదురాజు రామరాజు కన్నబిడ్డగా చూసుకున్నాడు. బాసర వాక్కులమ్మ స్ఫూర్తితో ఎది గాడు. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవిగా నిలిచాడు. వర్తమానంలో సాహిత్యం మీద బతికిన మహాకవి అందెశ్రీ. ఏ నిర్మాణంలో ఇమడలేనని చెప్పి స్వతంత్రుడుగా జీవించిన కవి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతడి పాడె మోసి ముందుకు నడిచాడు. అమరుడైనాక కూడ ఆయన కోరుకున్నట్టు ‘పద్మ భూషణ్’, ‘పద్మవిభూషణ్’ తప్పక వరిస్తాయి. అమరుడా...అందెశ్రీ! నీకు జోహార్లు.-బి.ఎస్. రాములు తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ -
Ande Sri Final Rites: పాడె మోసిన సీఎం రేవంత్
-
అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,అమరావతి: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది విషాదకరమైన విషయం అన్న ఆయన, తెలంగాణ మాండలిక సాహిత్యంలో అందెశ్రీ తన ప్రత్యేకత చాటారని అన్నారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేసిన అందెశ్రీ ఎలాంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు. అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని అభివర్ణించిన వైఎస్ జగన్ అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. -
పూడ్చలేని లోటు... అందెశ్రీ అస్తమయంపై మోదీ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ఐకానిక్ గీతం "జయ జయ హే తెలంగాణ" రచయిత, ప్రఖ్యాత కవి అందె శ్రీ (Ande Sri )ఆకస్మిక మరణంపై ప్రధానమంత్ర నరేంద్ర మోదీ ( Narendra Modi) సంతాపం వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.‘‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ ట్వీట్ చేశారు. (Ande Sri: చివరి కోరిక తీరకుండానే.. వెళ్లిపోయావా ఎల్లన్నా!)అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే…— Narendra Modi (@narendramodi) November 10, 2025 కాగా సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో అనారోగ్యానికి గురైన అందెశ్రీని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తెలంగాణకు ఇది విచారకరమైన రోజు అంటూ పలువురు సాహిత్య, సంగీత అభిమానులు సంతాపం తెలిపారు. శక్తివంతమైన మాటల ద్వారా తెలంగాణకు ఆత్మీయ స్వరాన్ని అందించిన కవి అందేశ్రీ మరణం పట్లపై పలువురురాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన రచనలు తరతరాలుగా స్ఫూర్తినిస్తాయంటూ అందెశ్రీ కుటుంబానికి, అభిమానులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు. -
చివరి కోరిక తీరకుండానే.. వెళ్లిపోయావా ఎల్లన్నా
‘పాడితే కంఠనాళం తెగి పడాలి..పల్లవితో అంటుకునే అగ్ని కావాలి' అని చెప్పడమే కాదు, ఆ పాటతోనే ఉద్యమాన్ని రగిలించిన ప్రముఖ రచయిత, కవి, గాయకుడు అందెశ్రీ (64) ఇకలేన్న వార్త యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజల్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. తన పదునైన గీతాలతో అగ్గి రగిలించిన అందెశ్రీ, ‘పరుగెత్తు నా పాట ప్రజల నోట’ అని గర్జిస్తూనే ఆమాటల్ని అక్షర సత్యం చేసుకున్న కారణ జన్ముడు అందె శ్రీ అంటే అతిశయోక్తి కాదు. సహజకవికోకిల, తెలంగాణా ఆత్మగౌరవ ప్రతీక ఎల్లన్నకు వేనవేల వందనాలు అంటూ తెలంగాణా సమాజం ఆయనకు అశ్రు నివాళులర్పిస్తోంది.1961, జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అదెశ్రీగా ప్రఖ్యాతి పొందిన అందె ఎల్లయ్య. గొర్రల కాపరిగా, తాపీమేస్త్రీగా కష్టాలను మర్చిపోయేందుకు పాడిన పాటలే ఆయనను ప్రజాకవిగా, గాయకుడిగా తీర్చదిద్దాయి. పోరాట పంథాను నేర్పాయి. ప్రశ్నించే తత్వాన్ని ఒంట బట్టించాయి. “పల్లెనీకు వందానాలమ్మో”, ‘'సూడా సక్కాని తల్లీ.. చుక్కల్లో జాబిల్లి‘' 'కొమ్మచెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా'’ “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు” లాంటి మహత్తరమైన గీతాలు ఆసువుగా ఆయన గళం నుంచి జాలువారాయి. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ”ను రచించేదాకా ఆయన ప్రస్థానం ముక్కోటి జనాలు జనకేతనంగా మారింది.తాపి మేస్త్రీగా అందెశ్రీ అనుభవం తెలంగాణా రాష్ట్రానికి ఇటుకలు పేర్చింది. పశువుల కాపరిగా దారి తప్పిన మందను అదిలించి జూలు విదిల్చేలా చేసింది. ఫలింగా తానే అందరినోటా పాటై పరవశిస్తున్నాడు. దగా పడిన తెలంగాణాకోసం కవిగా, కళాకారుడిగా తెలంగాణా పోరాటంలో అలుపెరుగని పోరు సల్పి తెలంగాణా పల్లెపల్లెలోనూ పల్లవించిన ఆయన మాటకు , పాటకు మరణంలేదు. ఈ ప్రపంచంలోని మిసిసిపి, మిజోరి, అమేజాన్, నైలు వంటి మహానదుల వెంట గాలిలో గీతమై సాగిపోయాడు. ఇంగ్లీషు భాష పరిచయం లేకపోతేనేం పాటతోనే దేశాలు చుట్టొచ్చారు. ప్రపంచ నదులు ప్రవాహంలో, సంగమాలను ప్రేమించిన మట్టి మనిషి కదూ అందెశ్రీ. అమెజాన్ నదీ జన్మస్థలం, మిసిసిపి, నైలు, కాంగో, జాంబేజీ నదులను స్పృశించి తరించాడు. ‘‘నది నడిచిపోతున్నదమ్మ.. నన్ను నావనై రమ్మన్నదమ్మ గొంతెత్తడం ఆయనకు మాత్రం సాటి.చివరి కోరిక తీరకుండానేజయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అందెశ్రీకి ఆయనకు కోటి రూపాయల నజరానా అందించింది. అలాగే ఇంటి నిర్మాణానికి 348 గజాల స్థలాన్ని కూడా కేటాయించింది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్లో కొత్త ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నారు. ఇంటినిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఆయన కలల సౌధాన్నిచూసుకోకముందే కన్నుముశారంటూ అందెశ్రీ బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయావా మల్లన్నా అంటూ సన్నిహితులు కంట తడి పెడుతున్నారు. అందెశ్రీని వరించిన పురస్కారాలుఇతనికి కాకతీయ యూనివర్శిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.'ప్రకృతే నా పాఠశాల, వల్లే నా పంతులు' తెలిపినాడు.గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణ కంకణం పొందాడు.2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారం లభించింది.2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్.2015లో దాశరథి సాహితీ పురస్కారం 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారంలోక్ నాయక్ పురస్కారంకాగా నవంబరు 10, కార్తీక సోమవారం ఉదయం 64 ఏళ్ల అందెశ్రీ తుదిశ్వాస వదిలారు. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
నా సినిమాల విజయంలో అందెశ్రీ..: నారాయణ మూర్తి
ప్రముఖ రచయిత అందెశ్రీ (Ande Sri) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయన్ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. అందెశ్రీ మరణంపై దర్శకనటుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy) స్పందించారు.తీరని లోటుప్రజాకవి అందెశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు, యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. నా సినిమాలైన ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కలకు అమోఘమైన పాటలు ఇచ్చి చిత్ర విజయాలకు అందెశ్రీ ఎంతో దోహదం చేశారు. ఎర్ర సముద్రంలో మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది. అది ఆ పాట గొప్పతనం..జన్మ ధన్యంఊరు మనదిరా మూవీలోని చూడా చక్కని తల్లి.. చుక్కల్లో జాబిల్లి అనే పాట తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించడమే కాదు నాటికి, నేటికి, ఏ నాటికైనా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట కూడా అంతే బాగుంటుంది. అన్నింటినీ మించి జయ జయహే తెలంగాణ.. పాటతో ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి, గౌరవించి తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఇలాంటి గొప్ప పాటలు అందించిన ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి అని ప్రార్థిస్తున్నాను అని నారాయణమూర్తి పేర్కొన్నారు.చదవండి: ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం -
Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)
-
అక్షరాలు దిద్దలేదు.. బడికి వెళ్ళలేదు.. అందెశ్రీ గొప్పతనం ఇదే..
-
Ande Sri: అందెశ్రీ మృతికి అదే కారణం: గాంధీ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి అందెశ్రీ మరణంపై గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ట్ స్ట్రోక్‌తో అందేశ్రీ చనిపోయారని తెలిపారు. నెల రోజులుగా ఆయన బీపీ మందులు వాడటం లేదు. మూడు రోజలుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ వైద్యులను సంప్రదించలేదని వెల్లడించారు.గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ సునీల్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని ఉదయం 6:20 గంటలకు నేలపై పడిపోయి ఉండగా కుటుంబ సభ్యులు ఆయనను చూశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. 7:20 గంటలకి ఆయన చనిపోయారు. గాంధీ ఆసుపత్రిలో బ్రాట్ డెడ్‌గా డిక్లేర్ చేశారు. హార్ట్ స్ట్రోక్‌తో అందేశ్రీ చనిపోయారు. ఛాతిలో అసౌకర్యంతో రెండు రోజులుగా బాధపడుతున్నారు. కానీ వైద్యులను సంప్రదించలేదు. (Ande Sri Death)గత 5 ఏళ్లుగా ఆయనకు హైపర్ టెన్షన్ ఉంది. ఒక నెల రోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదు. ఆరోగ్యం విషయంలో అందెశ్రీ నిర్లక్క్ష్యంగా ఉన్నారు. రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారు. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదు. ఉదయమే ఆయనను కుటుంబ సభ్యులు గమనించారు. ఆయన చనిపోయి ఐదు గంటలు అయి ఉండవచ్చు’ అని తెలిపారు. -
ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం
ఆయన పదాలు కడితే పాటతల్లి పులకరిస్తుంది. ఆ పాట వింటుంటే హృదయాలు పరవశిస్తాయి. ఆయన పాటలెప్పుడూ ప్రకృతి, జనంతో మమేకమై ఉంటాయి. ఉత్తేజం, ఉక్రోషం, ఆవేదన, నిరసన.. ఇలా అన్నీ ఆయన పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమంలో పాటనే ఆయుధంగా చేసుకున్నారు. ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ముందుకు నడిపించారు. ఆయనే తెలంగాణ రాష్ట్ర గీతకర్త, పాటల రచయిత అందెశ్రీ. సోమవారం (నవంబర్ 10) నాడు అందెశ్రీ ఇక సెలవంటూ వీడ్కోలు తీసుకున్నారు. ఆయన గురించి ఈ ప్రత్యేక కథనం..అందెశ్రీ పేరెలా వచ్చింది?అందెశ్రీ (Ande Sri).. 1961 జూలై 18న జన్మించారు. ఈయన అసలు పేరు ఎల్లయ్య. అతడి 16వ ఏట శృంగేరీ పీఠానికి చెందిన స్వాములు శంకర్ మహారాజ్.. ‘బిడ్డా.. కాళిదాసు, తెనాలి రామకృష్ణను కనికరించిన అమ్మవారు నీలో ఉంది. నీ సాహిత్యంలో ఆమె అందె విన్పిస్తోంది. నీవు నేటి నుంచి అందె శ్రీవి' అని ఆశీర్వదించారు. అలా ఆయనకు ఈ పేరు వచ్చింది.పుస్తకాల్లోకెక్కిన పాటపేరుకు తగ్గట్లుగానే ఆయన కలం నుంచి వచ్చే కవిత్వం, పాటలు కూడా ఎంతో గొప్పగా ఉండేవి. బడి ముఖం చూడకపోయినా సమాజాన్ని, ప్రకృతిని అందరికంటే ఎక్కువ చదివేశారు. ఎర్ర సముద్రం సినిమాలో 'మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు..' పాటతో హృదయాలు మెలిపెట్టేశారు. తర్వాత ఈ పాట పాఠ్యాంశంగానూ మారడం విశేషం! గంగ సినిమాలో 'వెళ్లిపోతున్నావా..' పాటకుగానూ ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు తీసుకున్నారు. మనకంటూ పాట లేదా?తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అందెశ్రీకి ఓసారి స్టేజీ ఎక్కినప్పుడు మొదట ఏ పాట పాడాలో అర్థం కాలేదు. అప్పుడే మనకంటూ ఓ పాట లేదా? అన్న ప్రశ్న మనసును తొలిచేసింది. అలా 'జయ జయహే తెలంగాణ పాట' పురుడు పోసుకుంది. ఈ పాట స్టేజీపై పాడిన తొలిసారే.. వెనకనుంచి ఎవరో ఇది తెలంగాణ జాతీయగీతం అన్నారు. వెక్కిరిస్తున్నారేమో అని అందెశ్రీ భయపడ్డారు. కానీ, తర్వాత అదే తెలంగాణ రాష్ట్ర గీతంగా కీర్తికెక్కింది.పాటకు ప్రాణం'పల్లె నీకు వందనాలమ్మో..', 'కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా' అంటూ ప్రకృతికి, మన జీవన విధానానికి చేతులెత్తి మొక్కుతారాయన. 'జన జాతరలో మన గీతం.. జయకేతనమై ఎగరాలి.. ఝంఝా మారుత జననినాదమై జేగంటలు మోగించాలి..' అంటూ జైబోలో తెలంగాణలో రాసిన పాట అందరు పిడికిలి బిగించి మరింత గట్టిగా, ధైర్యంగా జై తెలంగాణ అనేలా చేసింది. ఒకటే జననం, ఒకటే మరణం.. ఈ మధ్యలో ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా తెలంగాణ సాధించడం ఒక్కటే మన కర్తవ్యం అంటూ పాటతోనే జనాన్ని ముందుకు నడిపించారు. ఎవరు రాయగలరు ఇంతకంటే గొప్ప గీతం అనిపించేలా పాటలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి! చదవండి: అందెశ్రీ కన్నుమూత -
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
-
రేపు అందెశ్రీ అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం రేవంత్
ప్రజాకవి అందెశ్రీ ఇక లేరు. అస్వస్థతకు గురైన తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. -
Ande Sri: అందెశ్రీ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) తుదిశ్వాస విడిచారు (Ande Sri Death). ఆదివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోమవారం ఉదయం 7:25 గంటలకు అందెశ్రీ చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలోని రేబర్తిలో జూలై 18, 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీకి ముగ్గరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నగదు పురస్కారం అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తెలంగాణ, ప్రకృతి వంటి అంశాలపై అందెశ్రీ గేయరచన చేశారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచనలు ప్రజలలో చైతన్యం నింపాయి. ఆయన రచనలు, పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో నకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి అందెశ్రీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఉదయం 9.30 గంటల సమయంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నివాళులు అర్పించారు. 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అధికారిక గేయంగా ఖరారు చేసిన అందెశ్రీ రచన ‘జయ జయహే తెలంగాణ..’సంక్షిప్త రూపాన్ని ఆవిష్కరించారు. ఈ గేయాన్ని వినిపిస్తున్న సమయంలో కవి అందెశ్రీ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవడం కనిపించింది. కేసీఆర్ కోసం ప్రత్కేకంగా సోఫా..: రాష్ట్ర ఆవి ర్భావ వేడుకలకు రావాలంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వనం పంపిన విషయం తెలిసిందే. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ సభలో ముందు వరసలో కేసీఆర్ కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పా టు చేశారు. కేసీఆర్‌కు కేటాయించిన స్థానం అంటూ కాగితంపై రాసి ఉంచారు.సోనియాగాంధీ వీడియో సందేశం వేడుకలకు ముఖ్య అతి థిగా సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించినా.. అనివార్య కారణాలతో రాలేకపోయారు. అయితే తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోనియా ఒక వీడియో సందేశం పంపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఎల్రక్టానిక్ తెరలపై ఈ సందేశం వీడియోను ప్రదర్శించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో అమరవీరుల త్యాగఫలం. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నాను.తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి 2004 లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాను. అది సొంత పార్టీలో అసమ్మతి స్వరాలకు కారణమైంది. కొందరు నేతలు మా నిర్ణయంతో విభేదించారు. అయినా మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఏర్పాటు చేశాం. ఇప్పుడు రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నాం. సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ హామీలు నెరవేరుస్తుంది. ప్రజలకు శుభం జరగాలి. జైహింద్.. జై తెలంగాణ’’అని వీడియో సందేశంలో సోనియా పేర్కొన్నారు. -
చిహ్నం విషయంలో చర్చ జరగాలి!
ఐదు దశాబ్దాల పైగా అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణకు జనగీతం ఏది? పదేళ్ల క్రితం ‘మా రాష్ట్రం’ అని చెప్పుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కింది. ఒక రాష్ట్రంగా చిహ్నం, విగ్రహం రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ అవతరణ పదేళ్ల తరువాత, కాంగ్రెస్ పార్టీవారి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా మార్చి కొత్త చిహ్నాన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా రకరకాల చర్చలు మొదలయ్యాయి.దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లే రాష్ట్రానికి ఓ రాష్ట్ర గీతం ఉండాలని కోరుకోవడం సహజమే. రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తరువాత ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.జాతీయ గీతంలాగే రాష్ట్ర గీతం...జాతీయ గీతం ‘జన గణ మన’, జాతీయ గేయం ‘వందేమాతరం’... రెండింటినీ సమానంగా గౌరవించాలని మన రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యంగ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి భారతీయులు ఆ యా గీతాలను అత్యంత గౌరవంతో ఆలాపిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాలను నిర్వహించే సమయంలో చిన్నా పెద్ద, అధికారి, అనధికారి అనే భేదం లేకుండా అందరూ గౌరవంగా నిలబడాలనేది ఒక నియమం. కనీసం జాతీయ గీతాలాపన సమయంలో మౌనంగా ఉండి తమ గౌరవాన్ని వ్యక్తం చేయాలి. అయితే అలా గౌరవించనివారూ ఉంటారు. అందుకు శిక్షలు ఉండవు. కాని, అవమానిస్తే మాత్రం నేరమే. రెండు జాతీయ గీతాలకూ, జాతీయ చిహ్నానికీ, జాతీయ పతాకానికీ సంబంధించి ఒక చట్టం కూడా చేసుకున్నాం.దేశ సౌభాగ్యాన్నీ, సంస్కృతీ వారసత్వాలూ, గొప్పదనాన్నీ ప్రతిబింబించే మన జాతీయ గీతాలను గర్వంగా భారతీయులమంతా ఎలా ఆలపిస్తున్నామో... అంతే గర్వంగా రాష్ట్రాల ప్రజలు తమ తమ రాష్ట్ర గీతాలను ఆలపించడం సహజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లయినా ఇంతవరకూ రాష్ట్ర గీతం అంటూ ఏదీ లేకపోవడాన్ని కొందరు చర్చిస్తూ వచ్చారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వాల పేర సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో చాలామంది స్వాగతించారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణలో ఉన్న పాత జిల్లాల అన్నింటి ప్రత్యేకతలనూ, వైశిష్ట్యాన్నీ అద్భుతంగా ఆవిష్కరించింది కనుక. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఒక ఊపు ఊపింది కనుక. అలాగే దీని రచయిత అందెశ్రీ తెలంగాణ మట్టిమనిషి, ఉద్యమకారుడు. తన కలం, గళం ద్వారా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినవారు. అందుకే చాలామంది రాష్ట్ర గీత ప్రకటనను స్వాగతిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ కొత్త చిహ్నం..గత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అమలులో పెట్టిన ప్రభుత్వ చిహ్నాన్ని పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం మరో నమూనాను రూపొందిస్తున్నది. ఇప్పటికే దానిపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి వంటి రాజకీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ నమూనా చాలా బాగుందని కొందరూ, బాగులేదనీ మరికొందరూ అంటున్నారు.అసలు ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర గీతం అంటూ ఒక గీతాన్ని ప్రకటించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోనీ వాటిని నిర్ణయించేటప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించాలి కదా? దాన్నీ ఈ ప్రక్రియలో భాగం చేయలేదనేది ప్రధానమైన విమర్శ. ఇది సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించి ఏమార్చడానికే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.విధానం, సంవిధానం? దేశానికి కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి కానీ ఒక ప్రత్యేక నిర్ణయ విధానం (పాలసీ) అంటూ ఒకటి ఉండాలి. ప్రజలందరికీ సంబంధించిన కొన్ని అంశాలపై నిర్ణయాలను కేవలం ‘మంత్రివర్గం’ తీసుకుంటే సరిపోదు. విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. సభలు, సదస్సులు, జిల్లా స్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వివిధ వర్గాలవారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలూ, అసెంబ్లీ సమావేశాల్లో చేసిన చర్చలూ, నిర్ణయాలను అందరికీ అందుబాటులో ఉండేలా వైబ్సైట్లో పెట్టాలి. మొత్తంమీద రాష్ట్ర గీత ప్రకటన, ప్రభుత్వ చిహ్నం మార్పు వంటి అంశాల్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం. – వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీఅభిప్రాయం: మాడభూషి శ్రీధర్ -
13 నిమిషాలు యథాతథం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖకవి అందెశ్రీ రచించిన ’జయజయహే తెలంగా ణ’ ను యథాతథంగా ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 13 నిమిషాల నిడివి గల ఆ పాట సాహిత్యం, ప్రతి చరణం అలాగే కొనసాగించాలని స్పష్టం చేశారు. ’జయజయహే తెలంగాణ గేయానికి బాణీలు, సంగీతకూర్పుపై ఆదివారం ఓ స్టూడియోలో గేయ రచయిత అందెశ్రీ, సంగీత ద ర్శకుడు కీరవాణి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డిలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ భేటీలో అందెశ్రీ, కీరవాణిలకు ఆయ న పలు సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా మార్పుల అనంతరం మరోమారు సమావేశమై గేయానికి తుది రూపం ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 13 నిమిషాలు గేయం ఆలపించడం అతిథులకు ఇబ్బంది కలిగిస్తుందేమో ననే అభిప్రాయంతో షార్ట్ వర్షన్ రూపొందించాలనే అభిప్రాయం చర్చకు వచి్చందని, ఈ షార్ట్ వర్షన్ బాధ్యత అందెశ్రీకి అప్పగించారని తెలుస్తోంది. -
ఘనంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నాలుగో వార్షికోత్సవం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. కె. పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు.తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖంతో శుభాకాంక్షలు, ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవని, ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం అయితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, ‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’ డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవిశ్రీ గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. -
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజా గేయ రచయిత అందెశ్రీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం(మే21) భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’పాటను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విషయమై సీఎం వీరితో చర్చించారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో త్వరలో జయజయహే పాట సరికొత్త బాణీతో అలరించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ప్రజాకవి, ప్రకృతి కవిగా డాక్టర్ అందెశ్రీకి పేరుంది. ‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ను అందెశ్రీ రచించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో చాలా పాపులర్ అయింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విద్యాసంస్థల్లో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో ప్రార్థనా గీతంగా ఈ పాటను పాడుకుంటారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక జయజయహే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
అందెశ్రీకి కాళోజీ ఫౌండేషన్ పురస్కారం
కేయూ క్యాంపస్ : కాళోజీ ఫౌండేషన్ పురస్కారాన్ని 2016 సంవత్సరానికిగానూ ప్రముఖ కవి అందెశ్రీకి ప్రదానం చేయనున్నట్లు కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి తెలిపారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘కాళోజీ ఎండోమెంట్ లెక్చర్’ సెమినార్లో ప్రసంగిస్తూ ఆయన ఈవిషయాన్ని వెల్లడించారు.కాళోజీ వర్ధంతిని పురస్కరించుకొని నవంబర్ 13న అందెశ్రీకి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితి భిన్నంగా ఉంది


