సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి అందెశ్రీ మరణంపై గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ట్ స్ట్రోక్‌తో అందేశ్రీ చనిపోయారని తెలిపారు. నెల రోజులుగా ఆయన బీసీ మందులు వాడటం లేదు. మూడు రోజలుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ వైద్యులను సంప్రదించలేదని వెల్లడించారు.
గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ సునీల్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీని ఉదయం 6:20 గంటలకు నేలపై పడిపోయి ఉండగా కుటుంబ సభ్యులు ఆయనను చూశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. 7:20 గంటలకి ఆయన చనిపోయారు. గాంధీ ఆసుపత్రిలో బ్రాట్ డెడ్‌గా డిక్లేర్ చేశారు. హార్ట్ స్ట్రోక్‌తో అందేశ్రీ చనిపోయారు. ఛాతిలో అసౌకర్యంతో రెండు రోజులుగా బాధపడుతున్నారు. కానీ వైద్యులను సంప్రదించలేదు. (Ande Sri Death)
గత 5 ఏళ్లుగా ఆయనకు హైపర్ టెన్షన్ ఉంది. ఒక నెల రోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదు. ఆరోగ్యం విషయంలో అందెశ్రీ నిర్లక్క్ష్యంగా ఉన్నారు. రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారు. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదు. ఉదయమే ఆయనను కుటుంబ సభ్యులు గమనించారు. ఆయన చనిపోయి ఐదు గంటలు అయి ఉండవచ్చు’ అని తెలిపారు.


