చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం | Maoist Ganesh Uike Among 4 Killed In Odish ,Home minister Amit Shah tweet | Sakshi
Sakshi News home page

చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం

Dec 25 2025 3:13 PM | Updated on Dec 25 2025 3:48 PM

Maoist Ganesh Uike Among 4 Killed In Odish ,Home minister Amit Shah tweet

సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత మావోయిస్ట్‌ పార్టీకి  భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన  భారీ ఎన్‌ కౌంటర్‌లో ఒడిశా ఇన్‌ఛార్జ్ గణేష్ ఉయికే (69) సహా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం కంధమాల్-గంజాం జిల్లా సరిహద్దులోని దట్టమైన రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్)లతో కూడిన ఉమ్మడి భద్రతా దళంతో జరిగిన ఎన్‌కౌంటర్‌గణేష్ ఉయికేతో పాటు ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. గణేష్‌ ఉయికే  మృతిని ధృవీకరించిరిన అమిత్‌షా  2026 మార్చి 31 నాటికి  నక్సలిజాన్ని నిర్మూలిస్తాం అంటూ హోం మంత్రి ట్వీట్‌ చేశారు.  ‘‘నక్సల్ రహిత భారత్ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి"గా  హోంమంత్రి అభివర్ణించారు. అటు ఇది మన దళాలకు చారిత్రాత్మక విజయం. రూ. 1.1 కోట్ల రివార్డు ఉన్న నాయకుడి నిర్మూలనతో ఈ ప్రాంతంలోని మావోయిస్టుల నడ్డి విరిచినట్టేనని ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ ఆపరేషన్ భారత ప్రభుత్వాన్ని మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశాన్ని చేయాలనే తన లక్ష్యానికి దగ్గరి చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో జనరల్ సెక్రటరీ బసవరాజ్,నవంబర్‌లో కమాండర్  హిడ్మాలను  మట్టు బెట్టడంతో కేంద్ర కమిటీ కుప్పకూలింది. అటు అగ్ర మావోయిస్టు నాయకులతోపాటు లొంగిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది.

జిరామ్ ఘాటి మాస్టర్‌ మైండ్‌ 
2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జిరామ్ ఘాటి మారణకాండ వెనుక గణేష్ ఉయికే  ప్రధాన సూత్రధారి.  ఈ ఘటనలో అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరణించారు. అంతేకాదు  అనేక హై ప్రొఫైల్ మావోయిస్టు దాడులలో  ఆయనదే కీలక పాత్రం నమ్ముతారు. గతమూడేళ్లుగా గణేష్‌ ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, గెరిల్లా కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, మావోయిస్టు నెట్‌వర్క్‌లను బలోపేతం చేస్తున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement