అగ్ని–3 పరీక్ష విజయవంతం  | India Intermediate Range Ballistic Missile Agni-3 successfully | Sakshi
Sakshi News home page

అగ్ని–3 పరీక్ష విజయవంతం 

Feb 7 2026 5:04 AM | Updated on Feb 7 2026 5:04 AM

India Intermediate Range Ballistic Missile Agni-3 successfully

బాలాసోర్‌ (ఒడిస్సా): బారత సాయుధ దళాల అమ్ములపొది మరింత బలోపేతమైంది. శుక్రవారం జరిపిన అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన అత్యాధునిక అగ్ని–3 ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమైంది. 3,000 కిలోమీటర్ల పై చిలుకు దూరంలోని లక్ష్యాలను ఛేదించగల 17 మీటర్ల పొడవైన ఈ సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ క్షిపణిని ఒడిస్సా తీర సమీపంలోని చందీపూర్‌లోని స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ కేంద్రం నుంచి ప్రయోగించారు. 

ఈ సందర్భంగా క్షిపణి తాలూకు వ్యవస్థలన్నీ పూర్తిస్థాయిలో అంచనాల మేరకు పని చేసినట్టు అధికారులు వెల్లడించారు. ‘‘రెండు దశలతో కూడిన ద్రవ ఇంధన ఆధారిత క్షిపణి ఆద్యంతం నిర్దేశించిన మార్గంలో దూసుకెళ్లింది. బంగాళాఖాతంలో లక్ష్యాన్ని కచి్చతత్వంతో గమ్యాన్ని ఛేదించింది’’అని తెలిపారు. 

ప్రయోగం ద్వారా ఉద్దేశించిన లక్ష్యాలన్నింటినీ పూర్తిస్థాయిలో సాధించినట్టు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) వర్గాలు వెల్లడించాయి. అత్యాధునిక రాడార్‌ వ్యవస్థల ద్వారా క్షిపణి గమనాన్ని అనుక్షణం గమనిస్తూ వచి్చనట్టు వివరించాయి. అగ్ని–3 ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరింది. ఏకంగా 1,500 కిలోలకు మించిన పేలోడ్‌తో 3,000 కి.మీ. పై చిలుకు దూరంలోని లక్ష్యాలను అలవోకగా ఛేదించగల సామర్థ్యం దీని సొంతం.  
 

Advertisement
 
Advertisement
Advertisement