మరో 19 మంది మావోయిస్టుల లొంగుబాటు | 19 Maoists Surrender in Odisha | Sakshi
Sakshi News home page

మరో 19 మంది మావోయిస్టుల లొంగుబాటు

Feb 6 2026 9:43 PM | Updated on Feb 6 2026 9:45 PM

19 Maoists Surrender in Odisha

భువనేశ్వర్‌:  మావోయిస్టులు లొంగిపోవడానికి కేంద్రం విధించిన గడువు దగ్గర పడటంతో వారు లొంగుబాట పడుతున్నారు. తాజాగా మరో 19 మంది మావోయిస్టులు లొంగిప్యోఆరు. ఒడిశాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.  ఒడిశా డీజీఏపీ ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల పేరిట రూ. 1.1 కోట్ల రివార్డ్‌ ఉంది. 

కాగా, మార్చి నెల మావోయిస్టుల లొంగిపోవడానికి కేంద్రం విధించిన గడువు. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మరికొంతమంది ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. ఆపరేషన్‌ కగార్‌ వంటి ఆపరేషన్లతో కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోతున్నారు. అడవుల్లో మావోయిస్టులు.. వాటిని వదిలి జనావాసంలోకి వస్తున్నారు.  పలువురు మాత్రం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ వంటి చర్యలకు ఎదురెళ్లి ప్రాణాలు సైతం కోల్పోయిన వారు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement