breaking news
agni-3
-
అగ్ని–3 పరీక్ష విజయవంతం
బాలాసోర్ (ఒడిస్సా): బారత సాయుధ దళాల అమ్ములపొది మరింత బలోపేతమైంది. శుక్రవారం జరిపిన అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన అత్యాధునిక అగ్ని–3 ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమైంది. 3,000 కిలోమీటర్ల పై చిలుకు దూరంలోని లక్ష్యాలను ఛేదించగల 17 మీటర్ల పొడవైన ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణిని ఒడిస్సా తీర సమీపంలోని చందీపూర్‌లోని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ సందర్భంగా క్షిపణి తాలూకు వ్యవస్థలన్నీ పూర్తిస్థాయిలో అంచనాల మేరకు పని చేసినట్టు అధికారులు వెల్లడించారు. ‘‘రెండు దశలతో కూడిన ద్రవ ఇంధన ఆధారిత క్షిపణి ఆద్యంతం నిర్దేశించిన మార్గంలో దూసుకెళ్లింది. బంగాళాఖాతంలో లక్ష్యాన్ని కచి్చతత్వంతో గమ్యాన్ని ఛేదించింది’’అని తెలిపారు. ప్రయోగం ద్వారా ఉద్దేశించిన లక్ష్యాలన్నింటినీ పూర్తిస్థాయిలో సాధించినట్టు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) వర్గాలు వెల్లడించాయి. అత్యాధునిక రాడార్ వ్యవస్థల ద్వారా క్షిపణి గమనాన్ని అనుక్షణం గమనిస్తూ వచి్చనట్టు వివరించాయి. అగ్ని–3 ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరింది. ఏకంగా 1,500 కిలోలకు మించిన పేలోడ్‌తో 3,000 కి.మీ. పై చిలుకు దూరంలోని లక్ష్యాలను అలవోకగా ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. -
దూసుకెళ్లిన అగ్ని-3
-
దూసుకెళ్లిన అగ్ని-3
భువనేశ్వర్: భారత అమ్ముల పొదిలోని విలువైన అణు అస్త్రం అగ్ని క్షిఫణి మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. సాధారణ పరీక్షల్లో భాగంగా డీఆర్డీవో గురువారం ఒడిశాతీరంలోని వీలర్ ఐలాండ్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నాలుగో ప్రయోగ క్షేత్రం నుంచి ఉదయం 9.55గంటలకు అగ్ని క్షిపణి-3ని పరీక్షించగా విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మేరకు డీఆర్డీవో అధికారులు వివరాలు వెల్లడించారు. ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించిన ఈ క్షిపణి దాదాపు 3వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించే సామర్ధ్యం కలది. ఈ సందర్భంగా టెస్ట్ రేంజ్ డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ అగ్ని-3క్షిపణి 1.5 టన్నుల సాంప్రదాయ, అణు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని చెప్పారు. ఇక ఈ క్షిపణి 16 మీటర్ల పొడవును కలిగిఉండి దాదాపు 48 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో రెండు దశల సాంధ్ర ఇంధనం నింపి ఉంటుంది. వాతావరణంతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ క్షిపణిని ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. మరోపక్క, అగ్ని మిస్సైల్‌కు పోటీగా పాకిస్థాన్ గురువారమే ఘోరీ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించింది.


