51 మంది మావోయిస్టుల లొంగుబాటు | 51 Maoists surrendered in Bijapur districts on Saturday | Sakshi
Sakshi News home page

51 మంది మావోయిస్టుల లొంగుబాటు

Feb 8 2026 3:12 AM | Updated on Feb 8 2026 3:12 AM

51 Maoists surrendered in Bijapur districts on Saturday

వారిపై రూ.1.61 కోట్ల రివార్డు 

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్‌ జిల్లాల్లో శని వారం 51 మంది మావో యిస్టులు లొంగిపోయా రు. సుకుమాలో 21 మంది, బీజాపూర్‌లో 30 మంది మావోయిస్టులు లొంగిపోగా వారి పై రూ.1.61 కోట్ల మేర రివార్డు ఉంది. సుకుమాలో లొంగిపోయిన వారిలో ముగ్గురు డీవీసీఎం కేడర్, ఐదుగురు ఏసీఎం కేడర్‌ నేతలతో పాటు 13 మంది పార్టీ సభ్యులు ఉండగా ఏకే–47, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్, బీజీఎల్‌ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. 

బీజాపూర్‌ జిల్లాలో లొంగిపోయిన 30 మంది కూడా తమ ఆయుధాలను సర్కారుకు అందజేశారు. ఈ సందర్భంగా బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ మాట్లాడుతూ మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారు భవిష్యత్తులో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement