79 పాఠశాలలకు ఆమోదం..76 పాఠశాలలకు టెండర్లు
ఈ పాఠశాలలన్నీ మూడేళ్లలోపూర్తి చేయాలని నిర్ణయం
రూ.11,500 కోట్లకు అదనంగామరో రూ.1,000 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: యంగ్ ఇండియా ఇంటర్నే షనల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (వైఐఐఆర్‌ఎస్) నిర్మా ణ కాంట్రాక్టులను దక్కించుకున్న వారంతా ఎక్సెస్ కు టెండర్లు కోట్ చేయగా, వాటిని ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజ కవర్గాల పరిధిలో రానున్న మూడేళ్లలో 105 పాఠశాలలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 79 పాఠశాలలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, అందులో 76 పాఠశాలలకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది.
మరో మూడింటికి స్థలం లేకపోవడం వల్ల టెండర్ల ప్రక్రియ వరకు రాలేకపోయాయి. ఒక్కో రెసిడెన్షియల్ పాఠశాలకు మొదట్లో రూ.125 కోట్లుగా అంచనా వేసినా.. ఆ తర్వాత మరిన్ని హంగులు కల్పించడం ద్వారా ఆ పాఠశాల పూర్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని రూ.200 కోట్లుగా ఫైనల్ చేశారు. ఈ పాఠశాలల నిర్మాణానికి రూ.11,500 కోట్లు అవుతాయని అంచనా వేశారు. సాధారణంగా టెండర్ ప్రక్రియలో అంచనా వ్యయం కంటే ఐదు శాతం అదనంగా వేసుకునే వెసులుబాటు ఉండడాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న కాంట్రాక్టు సంస్థలు 4.5 శాతం నుంచి 4.95 శాతం అదనంగా కోట్ చేసి టెండర్లను దక్కించుకున్నాయి.
తద్వారా టెండర్ దశలోనే ఒక్కో పాఠశాలపై అదనంగా రూ.9 కోట్ల నుంచి 10 కోట్లు అధికంగా వ్యయం కానుంది. అంటే మొత్తం 105 పాఠశాలల నిర్మాణానికి ఎంతలేదన్నా.. సుమారు రూ.1,000 కోట్లు అద నంగా వ్యయం కానున్నట్టు అంచనా. ఈ టెండర్లలోనూ మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థనే 16 పాఠశాలలను చేజిక్కించుకుంది. బీఎస్‌ఆర్ 9 పాఠశాలలు, బీపీ ఆర్ సంస్థ రెండు పాఠశాలలను దక్కించుకున్నట్టు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 285 కోట్ల మేరకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను జారీ చేసినా.. ఇంకా నిధులు విడుదల కాలేదని తెలిసింది.
76 పాఠశాలలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయినా, కేవలం 12 చోట్ల మాత్రమే నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతు న్నాయి. 2027 విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి కనీసం 15 వైఐఐఆర్‌ఎస్‌లలో విద్యా భ్యాసం ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అయితే అందుకు తగ్గట్టుగా నిర్మాణాలలో వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. శేరిలింగంపల్లి, చాంద్రాయణగుట్టలో ఈ రెసిడెన్షి యల్ పాఠశాలలు మంజూరు అయినా, అక్కడ భూమి అందుబాటులో లేనందున టెండర్లు పిలవ లేదని అధికారవర్గాలు తెలిపాయి.


