హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కొట్టడంతో భార్య మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన రారాజు, విజయలక్ష్మి
దంపతులు నగరానికి వచ్చి గోకుల్ ప్లాట్స్‌లో ఉంటున్నారు. రారాజు స్థానికంగా ఇసుక, ఇటుక వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా రారాజు మద్యానికి బానిస కావడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన రారాజు భార్య విజయలక్ష్మి మొఖంపై రారాజు బలంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు.


