రాష్ట్ర పునర్నిర్మాణంలో మీపాత్ర మరవలేనిది: రేవంత్ రెడ్డి | Revanth Reddy participated in Sant Sevalal Jayanti celebrations | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పునర్నిర్మాణంలో మీపాత్ర మరవలేనిది: రేవంత్ రెడ్డి

Feb 15 2026 2:53 PM | Updated on Feb 15 2026 3:33 PM

 Revanth Reddy participated in Sant Sevalal Jayanti celebrations

సాక్షి, హైదరాబాద్: బంజారాభవన్‌లోసంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మానవ జాతి శాంతి మార్గం లో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తి ని నిప్పారని రేవంత్ రెడ్డి కొనియాడారు. అందుకే దేశంలోని  15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా ఆయన నిలిచారన్నారు. సేవాలాల్ జయంతి అధికారికం గా జరపడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో లంబాడీలు కీలక పాత్ర పోషించారని రాష్ట్రం కోసం సురేష్ నాయక్, కవిత నాయక్ ఆత్మ బలిదానం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో లంబాడీల పాత్ర మరవలేనిదన్నారు. అందుకే తండాలలో రోడ్డు లేకుండా ఏ తండా ఉండకూడదని అన్ని తండాలకు బీటీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.అదే విధంగా ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

తాను zptc  అభ్యర్థి గా పోటీ చేసినప్పుడు తండా ల్లో ఉన్న యువకులు తన విజయం లో క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం తెలిపారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో ప్రతి సందర్భంలో లంబాడా సోదరులు తనకు అండగా నిలిచారన్నారు. పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం రేషన్ కార్డని సీఎం తెలిపారు. కార్డు ఉన్నవారందరికి  సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల  ఇళ్ళకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని 50 లక్షల పేదల ఇళ్ల లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం అన్నారు. గడిచిన 2 ఏళ్లలో  ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం రూ.9,000 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టిందన్నారు.

ఇటీవల జరిగిన గ్రూప్‌-1పై అక్రమ కేసులు వేస్తే పోరాడి ఉద్యోగాలు ప్రకటించామన్నారు. గ్రూప్-1లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. దీనిపైన ఎవరికైనా అనుమానం ఉంటే లెక్కపెట్టుకోవాలని సీఎం సవాల్ విసిరారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎస్టీ లకు రిజర్వేషన్లు ఇచ్చారని, అసైన్డ్ పట్టాల రూపం లో గిరిజనులకు భూములు పంచారన్నారు. తమ ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని అందుకే నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి గొప్పస్థానాలకు ఎదగాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement