breaking news
banjara bhavan
-
గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా దక్కాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో గిరిజనులు ఎస్టీలుగా, బీసీలుగా, ఓసీలుగా ఉంటున్నారని.. అలా కాకుండా వారందరికీ సమాన హోదా దక్కే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమురంభీం ఆదివాసీ భవన్లను సీఎం శనివారం ప్రారంభించి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు అత్యంత ఖరీదైన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఎస్టీలకు గజంజాగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు గిరిజనులు, ఆదివాసీలు తలెత్తుకునేలా ఆధునిక హంగులతో రెండు భవనాలను నిర్మించాం. ఈ రెండు భవనాలు దేశంలోని గిరిజన సమాజానికి స్పూర్తిగా నిలవాలి. ఇక్కడ పెళ్లుళ్లు, పేరంటాలు వంటివి కాకుండా గిరిజనులను ఉన్నతీకరించే ఆలోచనలకు కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని కేసీఆర్ సూచించారు. ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా కుమురం భీం విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పోడు భూముల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. పోడు సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, అవన్నీ సమర్థంగా పనిచేసేలా గిరిజన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. గిరిజన భవన్, ఆదివాసీ భవన్లను చక్కటి సమావేశాలు నిర్వహించుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. ‘ఏ తండాలో ఏ సమస్యలున్నాయి? వాటిని ఎలా రూపుమాపాలి? ఏ విధంగా ప్రభుత్వ సేవలు అందిపుచ్చుకోవాలి? అనే కోణంలో సదస్సుల నిర్వహణకు ఈ భవనాలు వేదిక కావాలి. ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా వెళ్లి రక్షణగా నిలవాలి. అప్పుడే ఈ భవనాలకు సార్థకత లభిస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కాగా సీఎం కార్యక్రమ సమయంలో.. ఎస్టీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 12 శాతానికి పెంచాలంటూ బంజారా, ఆదివాసీ భవన్ల వద్ద కొందరు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త! -
ఆ రెండు భవన్లపై యథాతథ స్థితి
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాజధానిలో నిర్మించతలపెట్టిన బంజారాభవన్, కొమురం భీం భవనాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్కో) కొనసాగించాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ప్రభుత్వ భూమిలో బంజారా భవన్, కొమురం భీం భవనాల నిర్మాణం కోసం భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవోలు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన రమేష్ పరశురాం మలానీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఆయా భవనాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి ఎవాక్యూ ప్రాపర్టీ అని, దానిని నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని పిటిషనర్ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులిచ్చింది. -
కేసీఆర్ ”భవన్స్” పాలిటిక్స్
-
గిరిజనుల అభివృద్ధికి ఇదే వేదిక కావాలి..!