కరీంనగర్ మేయర్‌పై వీడిన సస్పెన్స్?.. చక్రం తిప్పిన నేతలు | Congress holds talks over Karimnagar mayor | Sakshi
Sakshi News home page

కరీంనగర్ మేయర్‌పై వీడిన సస్పెన్స్?.. చక్రం తిప్పిన నేతలు

Feb 15 2026 5:26 PM | Updated on Feb 15 2026 6:01 PM

Congress holds talks over Karimnagar mayor

సాక్షి, కరీంనగర్: నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలో  సంచలనం జరగుబోతుందా అంటే దాదాపు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరీంనగర్‌ మేయర్‌ స్థానం చేజిక్కించుకోవడం కోసం సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీనికోసం తమ ప్రధాన ప్రత్యర్థైన బీఆర్‌ఎస్‌ కార్పోరేటర్ల మద్ధతు మంత్రి కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో సహా పలువురు  ఇండిపెండెంట్ల తో కలిసి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

కరీంనగర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మెుత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు కోఆఫ్షన్ మెంబర్స్‌తో కలిసి మెుత్తం ఆసంఖ్య 69 స్థానాలకు చేరుకుంది. అయితే మేయర్ పీఠానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 35 స్థానాలు. ఇందులో బీజేపీ 30 స్థానాలు గెలువగా, కాంగ్రెస్ 14 సీట్లు సాధించింది. దీంతో బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత‍్రులతో కలిసి కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్ అందుకునేలా  ప్లాన్ వేసింది. దీనికి గానూ  ఒక్కో కార్పోరేటర్ సీటుకు రూ.1.5 కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకూ బేరసారాలు జరిగినట్లు తెలుస్తోంది. 

అదే విధంగా మేయర్ పదవికోసం కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు ఆశావాహులుగా ఉండగా  మరో  ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేయర్ పీఠం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు డిప్యూటీ మేయర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపు ఫిబ్రవరి 16న జరగనుంది. దీంతో మేయర్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి:
ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’

Advertisement
 
Advertisement
Advertisement