2026 నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన పోలీసులు.. బుధవారం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు డిసెంబర్ 31 వరకు కొనసాగనున్నాయి.
పోలీసులు నిర్వహించిన స్పెషల్ తనిఖీలలో తొలిరోజే.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 304 మంది పట్టుబడ్డారు. ఇందులో ఓ మైనర్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించినవారి వాహనాలు స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా.. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్యం మత్తులో వాహనాలను నడిపి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచిస్తూ.. వాహదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఉద్దేశ్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.


