సాక్షి,అమరావతి: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇది విషాదకరమైన విషయం అన్న ఆయన, తెలంగాణ మాండలిక సాహిత్యంలో అందెశ్రీ తన ప్రత్యేకత చాటారని అన్నారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేసిన అందెశ్రీ ఎలాంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు. అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని అభివర్ణించిన వైఎస్ జగన్ అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.


