మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం | Bigg Boss 9 Telugu: Ramu Rathod Parents Background | Sakshi
Sakshi News home page

Bigg Boss 9: నా భర్త నన్ను కొట్టేవాడు.. మేము ఉప్పర్‌ పనికెళ్తే పిల్లలు సారా అమ్మి..

Nov 9 2025 11:57 AM | Updated on Nov 9 2025 12:58 PM

Bigg Boss 9 Telugu: Ramu Rathod Parents Background

రాను బొంబాయికి రాను.., సొమ్మసిల్లి పోతున్నవే.. పాటలతో యూట్యూబ్‌లో సెన్సేషన్‌ అయ్యాడు సింగర్‌, డ్యాన్సర్‌ రాము రాథోడ్‌. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్‌ ఛాన్స్‌ తెచ్చుకున్నాడు. తొమ్మిది వారాలు హౌస్‌లో ఉన్న రాము అమ్మపై బెంగ పెట్టుకుని లోలోపలే కుమిలిపోయాడు. చిన్నప్పుడు అమ్మనాన్నకు దూరంగా ఉన్నా.. ఇప్పుడు బిగ్‌బాస్‌కు వచ్చి వాళ్లకు దూరంగా ఉండటం తన వల్ల కావడం లేదంటూ స్వతాహాగా బయటకు వచ్చేశాడు. అసలు రాము పేరెంట్స్‌ ఏం చేసేవారు? ఎందుకు రాముకు దూరంగా ఉన్నారో వారి మాటల్లోనే చూద్దాం..

మేస్త్రీ పనికి..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాము (Ramu Rathod) పేరెత్తగానే అతడి తల్లి.. నా కొడుకును రోజూ చూస్తున్నా, కానీ మాట్లాడలేకపోతున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత తమాయించుకుని ఆమె మాట్లాడుతూ.. నాకు ఐదుగురు సంతానం. పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి మేము ముంబై, పుణె వెళ్లి ఉప్పర్‌ (మేస్త్రీ) పని చేసేవాళ్లం. పొద్దున 4 గంటలకు పోతే రాత్రి 7 గంటలకు వచ్చేవాళ్లం. మొదట్లో నాకు రూ.30, నా భర్తకు రూ.60 ఇచ్చేవారు. నూకలతో వండిన అన్నం పెట్టేవాళ్లు. అందులో పురుగులు ఏరేసుకుని తినేవాళ్లం. 

నూకల బియ్యమే ఆహారం
ఊర్లో నా పిల్లలు సారా అమ్మేవాళ్లు. ఆ డబ్బుతోనే పుస్తకాలు కొనుక్కునేవాళ్లు. నేను కట్టెల మోపు అమ్మగా వచ్చిన డబ్బుతో నూకలు తెచ్చుకుని కుటుంబమంతా తినేవాళ్లం. కరోనా సమయంలో నా ఇంట్లోని నలుగురికి కరోనా వచ్చింది. అప్పుడు నేను, రాము కలిసి ఊరూరు తిరిగి కూరగాయలు అమ్మాం. ఒకప్పుడు మమ్మల్ని చాలా చిన్నచూపు చూసేవాళ్లు. అలా అవమానాలు పడ్డప్పుడు బతకాలనిపించలేదు. రేపు మా గతేంది? అని ఎంతో బాధపడ్డా.. కానీ, నా చిన్నకొడుకు దేవుడిచ్చిన వరం. కుటుంబ బాధ్యతను అతడే చూసుకుంటున్నాడు.

నా భర్త కొట్టేవాడు
నాకు తన సంపాదనతో మొదటగా బంగారు కమ్మలు, మాటీలు కొనిచ్చాడు. అలాగే రూ.10 వేల చీర తెచ్చాడు. అందరూ మనవాళ్లే అంటారు. అన్నల కోసం, అక్క, చెల్లి కోసం చాలా ఖర్చు పెడతాడు. నాకు 6 తులాల బంగారం ఇస్తే, వాడి అక్కకు రూ.3 లక్షలు, చెల్లికి రూ.4 లక్షలు, అన్నకు రూ.16 లక్షలతో బస్‌ ఇప్పించాడు. అందరం ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్తుంటాడు అని ఎమోషనలైంది. భార్యాభర్తలు గొడవపడేవారా? అన్న ప్రశ్నకు నా భర్త నన్ను కొట్టేవాడు.. కానీ, ఎప్పుడు కొట్లాడుకున్నా వెంటనే కలిసిపోయేవాళ్లం అని చెప్పుకొచ్చింది.

చదవండి: రాము ఔట్‌.. ఇమ్మూ స్వార్థం! టాప్‌ 6 వీళ్లే..!
'రాము రాథోడ్‌' సెల్ఫ్‌ ఎలిమినేట్‌.. ఎంత సంపాదించాడంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement