అగ్నిపరీక్షలో కల్యాణ్ అందరికీ నచ్చాడు. కానీ బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రారంభంలో ఎవరికీ నచ్చలేదు. కారణం.. ఆట పక్కనపెట్టి అమ్మాయిలపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. నాగార్జున కూడా అతడి తీరును ఎండగట్టాడు. ఇక ప్రియ, శ్రీజ ఎలిమినేషన్ తర్వాత కల్యాణ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌లా మారి అన్నీ చూసుకుంది తనూజ. అతడి కోసం గేమ్స్‌లో కలబడింది, నిలబడింది.
కల్యాణ్ కోసం నిలబడ్డ తనూజ
టికెట్ టు ఫినాలేలో ఇమ్మాన్యుయేల్‌ను పక్కనపెట్టి కల్యాణ్‌కే సపోర్ట్ చేసింది. అతడినెవరైనా టార్గెట్ చేస్తే వాళ్లను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి మరీ కల్యాణ్ కోసం టవర్ గేమ్‌లో చేయి నొప్పిని లెక్కచేయకుండా కష్టపడి ఆడింది. చాలా గేమ్స్‌లో అతడికే ప్రాధాన్యత ఇచ్చింది. కేవలం టాస్కులపరంగానే కాకుండా మాటలతోనూ సపోర్ట్ చేసింది. అతడి గెలుపును తన విజయంలా భావించి ఎన్నోసార్లు సంతోషించింది.
చివరి ప్రాధాన్యత
బిగ్‌బాస్ ఫినాలే స్టేజీపై కూడా కల్యాణ్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ముందుగా ప్రియ, శ్రీజకు ప్రాధాన్యం ఇచ్చాడు. చివరగా తనూజ గురించి మాట్లాడుతూ.. కల్యాణ్‌గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించిందే తనూజ అని ఒప్పుకుంటున్నా అని అందరిముందు చెప్పాడు. కానీ, బిగ్‌బాస్ బజ్‌లో, బయట ఇంటర్వ్యూలలో మాత్రం మాట మార్చాడు.
టాప్ 2లో ఇమ్మూ..
బజ్‌లో మాట్లాడుతూ.. ఫైనల్స్‌లో స్టేజీపై నా పక్కన ఇమ్మూ అన్న ఉంటాడనుకున్నాను. తనకు ఎక్కువ ఓట్లు వస్తాయనుకున్నా.. అయినా ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారన్నది మనకు తెలిదు. తను నాలా ఆలోచిస్తాడు, నాకు, ఇమ్మూ అన్నకు మధ్య బాండింగ్ బాగుంటుంది. మళ్లీ తనూజ, నాకు మధ్య ఆ బాండింగ్ లేదు అన్నాడు. మరో ఇంటర్వ్యూలో.. తనూజ గేమ్ పరంగా సపోర్ట్ ఇవ్వలేదు, ఉట్టి మాటలతోనే సపోర్ట్ చేసిందన్నాడు.
బాగానే డ్రామాలు చేస్తున్నావ్..
ఇది చూసిన తనూజ అభిమానులు కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తనూజ నీ పక్కన లేకపోతే స్క్రీన్‌స్పేస్ కూడా దక్కేది కాదంటున్నారు. ఫ్రెండ్స్‌ను, నాన్న(భరణి)ని పక్కనపెట్టి మరీ నీకు కెప్టెన్సీ, టికెట్ టు ఫినాలేలో సపోర్ట్ చేస్తే కనీస కృతజ్ఞత లేదంటూ తిట్టిపోస్తున్నారు. క్రెడిట్ తనూజకు ఇవ్వొద్దని శ్రీజ ఏమైనా చెప్పిందా? అందుకే ఇలా మాట మార్చేశావా? అని అడుగుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన కల్యాణ్.. వెంటనే మెట్టు దిగొచ్చాడు. టికెట్ టు ఫినాలేలో తనూజ తనకోసం ఆడిందని చెప్పాడు. అయినప్పటికీ తనూజ ఫ్యాన్స్ శాంతించలేదు. ఒక్కోదగ్గర ఒక్కో మాట మాట్లాడుతూ బాగానే డ్రామాలు చేస్తున్నావ్.. అని మండిపడుతున్నారు.


