మనోజ్ బాజ్‌పేయీ సినిమాకు సుప్రీం షాక్‌.. పేరు మార్చాల్సిందే! | Supreme Court Fires On Manoj Bajpayee Ghooskhor Pandit Movie | Sakshi
Sakshi News home page

Ghooskhor Pandit: వివాదంలో మనోజ్ బాజ్‌పేయీ సినిమా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Feb 12 2026 2:55 PM | Updated on Feb 12 2026 2:59 PM

Supreme Court Fires On Manoj Bajpayee Ghooskhor Pandit Movie

మనోజ్‌ బాజ్‌పేయీ తాజా చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’  వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పేరు మార్చనిదే విడుదలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. నీరజ్‌ పాండే, రితేశ్‌ షా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదల కానుంది. ఇందులో మనోజ్‌.. అజయ్‌ దీక్షిత్‌ అనే అవినీతీ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. 

అయితే ఈ సినిమా పేరు, మనోజ్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై బ్రహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలను నిలిపిపివేయాలంటూ  కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు.. టైటిల్‌ మార్చిన తర్వాత విడుదల చేయాలని నిర్మాతలను ఆదేశించింది. 

‘సినిమాలకు ఇలాంటి పేర్లు పెట్టి ఓ వర్గం ప్రజలను తక్కువ చేసి చూపే అధికారం ఎవరీకీ లేదు. వెంటనే పేరు మార్చాలి. కొత్త టైటిల్‌ని కోర్టుకు తెలిపిన తర్వాత విడుదల చేయాలకు అనుమతి ఇస్తాం’ అని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పాటు చిత్రంలో ఏ వర్గాన్నీ కించపరచడం లేదని హామీ ఇస్తూ నిర్మాతలు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో  చిత్ర బృందం టైటిల్‌ను మార్చే యోచనలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement