రాజకీయాల్లోకి అర్జున్‌.. యాక్షన్‌ కింగ్‌ ఏమన్నారంటే..? | Arjun Sarja Gives Clarity On Political Entry | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి అర్జున్‌.. యాక్షన్‌ కింగ్‌ ఏమన్నారంటే..?

Feb 12 2026 1:51 PM | Updated on Feb 12 2026 2:00 PM

Arjun Sarja Gives Clarity On Political Entry

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్‌తో సహా పలువురు హీరోలు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు. కొత్తగా తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కుడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ హీరో అర్జున్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై అర్జున్‌ స్పందించారు. రాజకీయాలపై ఆసక్తి లేదని.. అంత జ్ఞానం కూడా తనకు లేదన్నాడు. 

(చదవండి: విశ్వక్‌ సేన్‌తో సినిమా తీస్తారా?.. అర్జున్‌ ఆన్సర్‌ ఇదే!)

అర్జున్‌ దర్శకత్వంలో ఆయన కూతురు హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన అర్జున్‌.. ‘రాజకీయ ఎంట్రీ’పై స్పందింస్తూ... ‘నాకు మంచి పని చేయాలని ఉంది కానీ..దాని కోసం రాజకీయాల్లోకి రావాలని లేదు. నాకు అంత జ్ఞానం కూడా లేదు. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను. ఒకవైపు నటిస్తూనే..మరోవైపు కొన్ని కథలను రాసుకుంటున్నాను. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే నాకు లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. మంచి చేయాలనుకునేవాళ్లు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటారు. విజయ్‌ ఇప్పుడే వచ్చాడు. ఆయన పని తీరు ఎలా ఉంటుందో తెలియదు. అందరిలాగే తాను కూడా విజయ్‌ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement