హిస్టారికల్‌ ప్రదేశంలో 'జై హనుమాన్‌' మొదటి అడుగు | Jai Hanuman Movie will start on this date and venue | Sakshi
Sakshi News home page

హిస్టారికల్‌ ప్రదేశంలో 'జై హనుమాన్‌' మొదటి అడుగు

Feb 12 2026 11:02 AM | Updated on Feb 12 2026 11:10 AM

Jai Hanuman Movie will start on this date and venue

హనుమాన్‌ సీక్వెల్‌ 'జై హనుమాన్‌' ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద 2024లో కాసుల వర్షం కురిపించింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని రూ. 300 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌ను తీసుకొస్తున్నట్లు దర్శకుడు  ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

తేజ సజ్జా (Teja Sajja) హీరోగా  ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్నదే ‘జై హనుమాన్‌’. ఈ మూవీ ఫిబ్రవరి 22న చారిత్రాత్మక పట్టణం హంపిలో పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నట్లు సమాచారం. సీక్వెల్‌ ‘హనుమాన్‌’కి మించి ఉంటుందని దర్శకుడు ప్రకటించడంతో భారీ బజ్‌ క్రియేట్‌ అయింది. ఆంజనేయస్వామి పాత్రను స్టార్ హీరో రిషభ్‌శెట్టి  పోషిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. జై హనుమాన్ షూటింగ్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ రెండు చిత్రాలూ ‘ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగమే అని తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement