సాక్షి,హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి. వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని అవమానించాయని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ (VHP) సహా పలు హిందూ సంస్థలు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావినూతల శ్రీధర్ రాజమౌళిపై మండిపడ్డారు. ‘ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందూ భావాలను దెబ్బతీశాయి. రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేదంటే లంకా దహనం సన్నివేశాలు ప్రదర్శిస్తాం’అని హెచ్చరించారు. జిహాదీ నిధులతో సినిమాలు తీసి హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని రావినూతన శ్రీధర్ ఆరోపించారు.


