రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతికి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ది రాజాసాబ్‌తో రెడీ అయిపోయారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌పై అంచనాలు పెంచేశాయి. ఈ సందర్భంగా ది రాజాసాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది.
ఈవెంట్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ది రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన పనిచేసిన వారిపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిచ్చారు. మీతో పని చేసిన దర్శకుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారు? అని సుమ ప్రశ్నించింది.
దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. నాగ్ అశ్విన్‌కు స్ట్రాంగ్ అని.. ప్రశాంత్ నీల్‌కు బ్యూటీఫుల్ పర్సన్‌గా.. ఎస్ఎస్ రాజమౌళిని జీనియర్ గారు..మారుతి అయితే క్యూట్ అని అన్నారు. అలాగే హనురాఘవపూడి వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని.. సుజీత్ ఫుల్ స్మార్ట్ అని.. పూరి జగన్నాధ్‌ను జీనియస్‌గా అభివర్ణించారు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కల్ట్ అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు.
కాగా.. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డివంగాతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి స్పిరిట్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ కనిపించనుంది. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


