గడియారం వెనక్కి... | Upcoming Movie Updates on Period Drama Films in Tollywood | Sakshi
Sakshi News home page

గడియారం వెనక్కి...

Jan 4 2026 12:37 AM | Updated on Jan 4 2026 12:37 AM

Upcoming Movie Updates on Period Drama Films in Tollywood

పీరియాడికల్‌ కథలపై ఆసక్తి చూపిస్తున్న తెలుగు హీరోలు

కాలం ముందుకు వెళ్తుంది. 2026కి కూడా వెల్‌కమ్‌ చెప్పాం. కానీ తెలుగుతెరపై సినిమా కథలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. వెండితెరపై గడియారాన్ని వెనక్కి తిప్పి, కొన్ని కథలను ఆడియన్స్  ముందుకు తీసుకువస్తున్నారు హీరోలు. ఇలా ఆడియన్స్ ను ఎంటర్‌టైన్స్  చేసేందుకు గడియారాన్ని వెనక్కి మళ్లించిన కొంతమంది హీరోల గురించి ఓ లుక్‌ వేయండి.

టైమ్‌ ట్రోటర్‌
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్స్ లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో మహేశ్‌బాబు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారు. ప్రధానంగా రుద్ర పాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తే, కొన్ని సన్నివేశాల్లో రాముడు పాత్రలో కనిపిస్తారు. మరికొన్ని సన్నివేశాల్లో శివుడుగా కూడా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే కథ రీత్యా ఈ సినిమా కథనం విభిన్న మైన కాలమానాల్లో సాగుతుంది.

భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి టైమ్‌ ట్రోటర్, గ్లోబ్‌ ట్రోటర్‌ అనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్స్ , ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ వారణాసి చిత్రం 2027 వేసవిలో రిలీజ్‌ కానుంది.

పుట్టకతోనే యోధుడు
‘‘పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువులేని ఏకలవ్యుడు.. పుట్టుకతోనే అతనో యోధుడు..’’.. ‘ఫౌజి’ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్టరైజేషన్స్  గురించే ఇదంతా. ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్‌. 1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం.. వంటి అంశాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడికల్‌ యాక్షన్స్  డ్రామా సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

జయప్రద, అనుపమ్‌ఖేర్, మిథున్స్  చక్రవర్తి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్‌ కానుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్స్ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ‘ఫౌజి’ సినిమాకు ప్రీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల ఓ సందర్భంగా పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్స్ లోని ‘సలార్‌’ ఫ్రాంచైజీ సినిమా సెమీ పీరియాడికల్‌ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇంకా నాగ్‌ అశ్విన్స్  డైరెక్షన్స్ లో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకూ టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ్రపారంభం కానుందని తెలిసింది.

డ్రాగన్స్  రాక ఈ ఏడాదేనా..
ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌ నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పీరియాడికల్‌ స్టోరీ. 1960 సమయంలో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్‌ మాఫియా, సరిహద్దుల్లో అక్రమ రవాణా వంటి అంశాల నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ చిత్రం కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో కథ రీత్యా ఎన్టీఆర్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారు. తాజాగా చిత్రీకరిస్తున్న సన్నివేశాల కోసం ఎన్టీఆర్‌ బరువు తగ్గారు.

ఇక ఈ చిత్రంలో రుక్మిణీ  వసంత్‌ హీరోయిన్స్ గా నటి స్తున్నారు. మలయాళ యువ నటుడు టోవినో థామస్, బాలీవుడ్‌ సీనియర్‌ యాక్టర్స్‌ కాజోల్, అనిల్‌ కపూర్‌ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నందమూరి కల్యాణ్‌ రామ్, నవీన్స్  ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్స్ ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరి 10న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో ఈ ఏడాది జూన్స్  26న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఈ విడుదల తేదీలో కూడా మార్చు ఉండొచ్చనే ఊహాగానాలు ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్‌ మాత్రం ‘ఎన్టీఆర్‌నీల్‌’ సినిమాను  ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. మరి..‘ఎన్టీఆర్‌నీల్‌’ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

పెద్ది ఆట
రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మల్టీస్పోర్ట్స్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామాలో జాన్వీకపూర్‌ హీరోయిన్స్ గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్‌ కుమార్, దివ్వేందు శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

కథ రీత్యా ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగుతుంది. 1980 టైమ్‌లైన్స్ తో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ ‘పెద్ది’ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఢిల్లీలో రామ్‌చరణ్‌ పాల్గొనగా, ఓ కీలక షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్‌. మరోవైపు పోస్ట్‌ ప్రోడక్షన్స్  పనులు కూడా జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ సినిమా మార్చి 27న రిలీజ్‌ కానుంది.

బ్రిటీషర్లపైపోరాటం
మంచు మనోజ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘డేవిడ్‌రెడ్డి’. ఈ హిస్టారికల్‌ యాక్షన్స్  డ్రామా కథనం 1897–1922 నేపథ్యంతో సాగుతుంది. బ్రిటీషర్లకు ఎదురుతిరిగిన రెబల్‌ డేవిడ్‌రెడ్డి పాత్రలో మంచు మనోజ్‌ కనిపిస్తారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన డేవిడ్‌రెడ్డి బ్రిటీషర్లకు ఎలా ఎదురు నిలిచాడు? అనేది సినిమాలో చూడొచ్చని మేకర్స్‌ చెబుతున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలోని డేవిడ్‌ పాత్ర ఫిక్షనల్‌ క్యారెక్టర్‌ అని  ఈ చిత్ర దర్శకుడు హనుమరెడ్డి పేర్కొన్నారు. భరత్, నల్లగంగుళ వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఉత్తర తెలంగాణలో భోగి
శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. 1960 నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్‌ యాక్షన్స్  డ్రామాకు సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్స్ , డింపుల్‌ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను క్రియేట్‌ చేశారు మేకర్స్‌. కేకే రాధామోహన్స్  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే శర్వానంద్‌ హీరోగా నటించిన మరో సినిమా ‘బైకర్‌’. మూడు తరాల నేపథ్యంతో సాగే ఈ స్పోర్ట్స్‌ డ్రామా కథనం 1990, 2000 టైమ్‌ పీరియడ్‌లో సాగుతుంది.

ఈ సెమీ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో శర్వానంద్‌ రేసర్‌ విక్రమ్‌ పాత్రలో నటించారు. రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్‌ హీరోయిన్స్ గా నటించారు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్‌ సమర్పణలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరులోనే విడుదల కావాల్సింది. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని, ఆడియన్స్ కు మరింత థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. త్వరలోనే ఈ ‘బైకర్‌’ సినిమా కొత్త విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది.

జడల్‌ జమానా
‘దసరా’ పీరియాడికల్‌ రూరల్‌ యాక్షన్స్  డ్రామా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్స్ లో వస్తున్న తాజా సినిమా ‘ది ΄్యారడైజ్‌’.  1980 నేపథ్యంతో సాగే పీరియాడికల్‌ యాక్షన్స్  డ్రామా ఇది. ఈ చిత్రంలో సికింద్రాబాద్‌ కుర్రాడు జడల్‌ పాత్రలో నాని నటిస్తున్నారు. మోహన్స్ బాబు, రాఘవ్‌ జుయల్, సంపూర్ణేష్‌బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కయాదు లోహర్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఓ  వర్గం కోసం ఓ నాయకుడు చేసే వీరోచితపోరాటం నేపథ్యంతో ఈ మూవీ స్టోరీ సాగుతుందని తెలిసింది. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 26న రిలీజ్‌ కానుంది.

రౌడీ జనార్ధన
‘కలింగపట్నంలో ఇంటొకకడు రౌడీనని చెప్పుకు తిరుగుతాడు.. కానీ ఇంటి పేర్నే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన’’ అంటూ గంభీరంగా చెబుతూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు విజయ్‌ దేవరకొండ. మరి.. ఈ రౌడీ జనార్ధన స్టోరీని ఈ ఏడాది డిసెంబరులో థియేటర్స్‌లో చూడొచ్చు. విజయ్‌ దేవరకొండ టైటిల్‌ రోల్‌ చేస్తున్న తాజా సినిమా ‘రౌడీ జనార్ధన’. కీర్తీసురేష్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈస్ట్‌ గోదావరి నేపథ్యంతో 1980 కాలమానంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ గోదావరి యాసలో మాట్లాడతారు. ఈ రూరల్‌ పీరియాడికల్‌ యాక్షన్స్  డ్రామా చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌ రవికిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్నారు.

‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేయగా, ఈ ‘రౌడీ జనార్ధన’ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్‌ చేయనున్నట్లుగా విజయ్‌ దేవరకొండ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మరోవైపు ‘టాక్సీ వాలా’ వంటి సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్స్  కాంబినేషన్స్ లో మరో సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్స్  వర్క్స్‌ జరుగుతున్నాయి. హిస్టారికల్‌ పీరియాడిక్‌ డ్రామా రాయలసీమ నేపథ్యంతో సాగుతుంది.

ఈ సినిమా ప్రధాన కథాంశం 1854–1878 నేపథ్యంతో సాగుతుంది. ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్‌ దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తారని, రష్మికా మందన్నా హీరోయిన్స్ గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ్రపారంభం కానుంది. మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్స్  ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించనున్నారు.

ఆకాశంలో ఒకతార
‘మహానటి, సీతారామం, కాంత’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్‌సల్మాన్స్ . ఎంతలా అంటే ఆయన ఏ భాషలో సినిమా చేసినా, ఆ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యేంతలా. తాజాగా దుల్కర్‌సల్మాన్స్  హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒకతార’. పవన్స్  సాధినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

గీతా ఆర్ట్స్, స్వ΄్నా సినిమాస్‌ల సమర్పణలో లైట్‌బాక్స్‌ మీడియా పతాకంపై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ పీరియాడికల్‌ యాక్షన్స్  డ్రామా కథనం ప్రధానంగా ఓ పల్లెటూరి నేపథ్యంతో సాగుతుందని, ఇందులో దుల్కర్‌ సల్మాన్స్  ఓ రైతు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు మేకర్స్‌.

స్వాతంత్య్రానికి పూర్వం..
నిఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా హౌస్‌’. ఈ సినిమా ప్రధాన కథాంశం 1905 టైమ్‌లో జరుగుతుందని తెలిసింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం లండన్స్  ఉన్న కొందరు భారతీయులు ఎలాంటి వ్యూహరచన చేశారు? అనే పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో నిఖిల్, మరో కీలక పాత్రలో అనుపమ్‌ఖేర్‌ నటిస్తున్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌సవార్కర్‌ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సినిమాలో చూపిస్తారట మేకర్స్‌. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఆ మధ్య సెట్స్‌లో చిన్న ప్రమాదం జరిగింది. దీంతో అప్పట్లో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అధికా రికంగా మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది. రామ్‌చరణ్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఈ కోవలో పీరియాడికల్‌ ఫిల్మ్స్‌ చేస్తున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement