ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళికి ప్రతి డైరెక్టర్ రుణపడి ఉన్నామని తెలిపారు. ఇవాళ చాలామంది పాన్ ఇండియా అని కాల్ ఎగరేసుకుని తిరుగుతున్నామంటే కారణం ఆయనే అన్నారు. నిజంగా టాలీవుడ్‌కు ఇది స్వర్ణయుగమని తెలిపారు.
నా లాంటి మిడ్ రేంజ్ సినిమాలు తీసే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టారని మారుతి తెలిపారు. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి ఒక పెద్ద కటౌట్ అందించారని అన్నారు. ఒక సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎంతోమంది స్టార్స్‌ను తయారు చేసిన ఘనత ఆయనదేనన్నారు.
అంతేకాకుండా హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ మారుతి. ఆయన ఒక శక్తి అని కొనియాడారు. నా వెనకాల ఉన్నది మామూలు శక్తి కాదు.. ఆయన కేవలం యాక్టింగ్ చేసి వెళ్లిపోవడం కాదు.. తన లైఫ్ పెట్టేశారని అన్నారు. సినిమాతో ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేమన్నారు. ఆ ప్రతి రూపమే ఇవాళ మన ఎదురుగా కూర్చుందని ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
Emotional Moment ♥️😭#Prabhas𓃵 #Maruthi pic.twitter.com/HcS6TB1Gmc
— Addicted To Memes (@Addictedtomemez) December 27, 2025
టాలీవుడ్‌కు ఇది స్వర్ణయుగం.
టాలీవుడ్ డైరెక్టర్లంతా @ssrajamouli కి రుణపడి ఉన్నాము.. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి మాకు ఇచ్చినందుకు – డైరెక్టర్ #Maruthi #Prabhas𓃵 #RajaSaab pic.twitter.com/0HPAVKG6CZ— greatandhra (@greatandhranews) December 27, 2025


