సాహితీ ఇన్‌ఫ్రా కేసులో 17 ఛార్జ్‌షీట్లు దాఖలు | chargesheet filed against sahiti infra case | Sakshi
Sakshi News home page

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో 17 ఛార్జ్‌షీట్లు దాఖలు

Jan 5 2026 7:47 PM | Updated on Jan 5 2026 8:44 PM

chargesheet filed against sahiti infra case

సాక్షి,హైదరాబాద్‌: సాహితీ స్కాంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ స్కాం మొత్తం రూ.3000 కోట్లుగా తేల్చినట్లు అధికారులు వెల్లడించారు.

నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన అనంతరం సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా.. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసుల్లో మొత్తం 64 కేసులు..  అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించి 17ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.500 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు గుర్తించారు.

వసూలు చేసిన డబ్బులను సాహితీ లక్ష్మీనారాయణ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. సాహితీ స్కాంపై మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement