టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా వస్తున్న మహాకాళి పోస్టర్ను విడుదల చేశారు. మహాకాళి పాత్రలో కనిపించనున్న కన్నడ నటి ‘భూమి శెట్టి’ ఫస్ట్ లుక్‌ను తన సోషల్మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ‘మహాకాళి’ ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా రానుంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు.
పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వస్తున్న మహాకాళి.. బెంగాల్ ప్రాంతంలో జరిగే కథగా ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ మూవీకి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించబోతున్నాడు. కన్నడకు చెందిన భూమి శెట్టికి తెలుగులో ఇది రెండో సినిమా.. కింగ్డమ్‌లో సత్యదేవ్ సతీమణి గౌరి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియాలో పాపులర్ అయిన ఆమెకు ఈ మూవీ ఛాన్స్ రావడానికి ప్రధాన కారణం ఆమె స్కిన్ టోన్ అని తెలుపుతున్నారు. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ‘మహాకాళి’ కోసం తీసుకున్నారట.
From the cosmic womb of creation awakens the most FEROCIOUS SUPERHERO of the universe!
Introducing #BhoomiShetty as MAHA ❤️🔥 #Mahakali 🔱 @RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/MSyyW1oUK2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2025


