Jai Hanuman
-
వెండితెరపై ఆధ్యాత్మిక శోభ
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేమకథలు, యాక్షన్, థ్రిల్, పొలిటికల్, హారర్... ఇలా అన్నమాట. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆధ్యాత్మిక ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. భక్తి, హిందుత్వం, మైథలాజీ, ధర్మం ఆధారంగా రూపొందుతోన్న చిత్రాలకు ప్రేక్షకాదరణ కూడా బాగా ఉంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వెండితెరపై ప్రేక్షకులకు ఆధ్యాత్మిక శోభ చూపించేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’, రవితేజ ‘ఇరుముడి’, మహేశ్‌బాబు ‘వారణాసి’, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’, నిఖిల్ ‘స్వయంభు’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ సినిమాలతో పాటు ‘మహావతార్ నరసింహా, వాయుపుత్ర’ వంటి యానిమేషన్ మూవీస్ కూడా రూపొందుతున్నాయి. ఆయా సినిమాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం.హనుమంతుడు తోడుగా... ఆంజనేయస్వామికి హీరో చిరంజీవి ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా హనుమంతుడి పట్ల తన భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంటారాయన. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’లోనూ మరోసారి హనుమంతుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉండనున్నాయి. తొలి చిత్రం ‘బింబిసార’తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, పురాణాల నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ కథతో రూపొందిన ‘విశ్వంభర’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ వద్ద 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు మేకర్స్. అక్కడ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ఓ హైలెట్‌గా నిలుస్తాయని టాక్. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తే విలన్లను రఫ్ఫాడిస్తున్న చిరంజీవి వెనక నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ మూవీని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్, సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్. గత ఏడాది తన పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా చిరంజీవి స్వయంగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘‘చందమామ కథలా ‘విశ్వంభర’ ఉంటుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్ని అందించేందుకు సమయం పడుతోంది. 2026 వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అంటూ చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే గ్రాఫిక్స్‌కి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందట. ఈ కారణంగా ఈ మూవీ గురించి ఎలాంటి కొత్త అప్డేట్ ఇవ్వడం లేదట చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్లు ‘విశ్వంభర’ ఈ వేసవి ముగిసేలోపు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే మరోసారి వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ గురించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.అయ్యప్ప మాలధారిగా... వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకెళుతుంటారు రవితేజ. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర చేస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ.‘‘ఇరుముడి’ చిత్రంలో యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ అద్భుతమైన కథ, కాన్సెప్ట్ ఉంటాయి. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. రవితేజ ఇంతకు ముందెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రను ‘ఇరుముడి’లో పోషిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్కు అవసరమైన అన్ని అంశాలను, బలమైన భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ అద్భుతంగా రూపొందిస్తున్నారు శివ నిర్వాణ. ఈ సినిమా కోసం రవితేజ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘ఇరుముడి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’. తేజ సజ్జ, అమృతా అయ్యర్ జోడీగా నటించారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై, పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ సాధించి, అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ‘హనుమాన్’కి కొనసాగింపుగా ‘జై హనుమా న్ ’ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (‘కాంతారా’ మూవీ ఫేమ్) నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రాముడి విగ్రహాన్ని హత్తుకుని ఉన్న హనుమంతుడిగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలున్నాయి. పైగా ‘కాంతారా, కాంతారా చాప్టర్ 2’ మూవీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో టైటిల్ రోల్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ మరింత క్రేజ్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. ‘హనుమాన్’ మూవీలో తనదైన నటనతో మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్‌నగర్ టాక్. శ్రీరాముడు–రుద్ర ‘బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నారు. ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు మహేశ్‌బాబు. వారణాసి నేపథ్యంలో భక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు మునుపెన్నడూ చూడని విధంగా శ్రీరాముడు, రుద్ర అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణని జార్జియాతో పాటు పలు అంతర్జాతీయ ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. అంతేకాదు... ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో వారణాసిని సృష్టించారు. అచ్చం వారణాసిలా తీర్చిదిద్దిన సెట్లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఒక గొప్ప అనుభూతినిచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ విజువల్ వండర్‌ను చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. ఈ చిత్రం అందర్నీ గర్వపడేలా చేస్తుంది’ అని మహేశ్‌బాబు చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి.ఈ మూవీ భారతదేశంలోనే కాకుండా ‘గ్లోబ్‌ట్రోటర్, టైమ్ట్రోటర్’ అనే ట్యాగ్లై న్ లతో అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు, ప్రియాంకా చొప్రా, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని సమాచారం. జూన్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’ విడుదల కానుంది. మహేశ్‌బాబు– రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై గ్లోబల్ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. స్వయంభు కోసం... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల కానుంది. నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రం ‘స్వయంభు’. ఇది పూర్తిగా పురాణ, భారతీయ యోధుల చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని స్టైలిష్, హిస్టారికల్ యాక్షన్ మైథలాజికల్‌గా రూపొందిస్తున్నారు. నిఖిల్ వేషధారణ, యాక్షన్ లుక్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి రేపాయి.తన పాత్ర కోసం నిఖిల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవడంతో పాటు ఇంటె న్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతోందట. ఇండియాలోని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయని తెలిసింది. ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం కావాల్సినంత సమయం తీసుకొని, వరల్డ్ క్లాస్ ఔట్పుట్ అందించేందుకు మేకర్స్ పూర్తి కమిట్మెంట్తో పని చేస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా ‘స్వయంభు’ రూపొందుతోంది.‘‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా విజయం తర్వాత అంతకంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో, భయంతో అన్ని జాగ్రత్తలతో చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ చిత్రం చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా సంతోషపడతారు’’ అని ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో నిఖిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దశావతార ఆలయం నేపథ్యంలో... హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేశ్ చందు నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భక్తి నేపథ్యంలో రూపొందుతోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అతను ఒంటరివాడు కాదు... అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఈ పోస్టర్లో ఇచ్చిన క్యాప్షన్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.అలాగే టైటిల్ టీజర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. శతాబ్దాల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో ఈ కథాంశం యాక్షన్, ఆధ్యాత్మికతలను మేళవిస్తుంది. సర్పదేవత పచ్చబొట్టుతో పాటు పవిత్రమైన విష్ణు నామాలు వంటి చిహ్నాలు కూడా టీజర్లో కనిపిస్తాయి. దుండగుల బారి నుంచి దశావతార ఆలయాన్ని హీరో ఎలా కాపాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న సాలిడ్ థ్రిల్లర్‌గా, భారతీయ ధర్మం, ఆచారాలపై ఆధారపడిన పౌరాణిక యాక్షన్ డ్రామాగా ‘హైందవ’ చిత్ర కథాంశం ఉండనుందట. ఈ మూవీలో ఓ ధార్మిక యోధుడి పాత్రలో కనిపించనున్నారట సాయి శ్రీనివాస్.నాగబంధం ‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. అహ్మద్ షా అబ్దాలి భారతదేశంపై జరిపిన చారిత్రక దాడుల నేపథ్యంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలను మేళవిస్తూ అభిషేక్ నామా తెరకెక్కించారు.మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్‌బాబు ‘నాగబంధం’ టీజర్‌ని విడుదల చేసి, ‘‘టీజర్ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. హిమాలయ శిఖరాల్లో దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం, కాలానికే అందని ఒక పురాతన శక్తి నేపథ్యంలో అల్లుకున్న సస్పె న్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘నాగబంధం’ని రూపొందించారని సమాచారం. ఇందులో విరాట్ కర్ణ శక్తిమంతమైన యోధుడిగా నటించారు. ఈ చిత్రంలో నాగబంధం, శివ తంత్ర విద్య, నాగబంధం ఆలయం వెనక ఉన్న గుప్తనిధులు వంటి అంశాలు కథలో హైలెట్ కానున్నాయట. ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. గదాధారి హనుమాన్... రవి కిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘‘మైథలాజికల్ జానర్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘గదాధారి హనుమాన్’.ఈ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోష న్స్ను అద్భుతంగా పండించాం. ఈ మూవీ గ్లింప్స్, టీజర్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ఫుల్ అన్న దానిపై ఓ సీక్వె న్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని రవికిరణ్ తెలిపారు.యానిమేషన్ కూడా... ఇదిలా ఉంటే... రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటు ‘మహావతార్ నరసింహా’, ‘వాయుపుత్ర’ వంటి యానిమేటెడ్ సినిమాలు కూడా రానున్నాయి. అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహా’ యానిమేటెడ్ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. 2037 వరకు ఏడు భాగాలుగా ఈ సినిమాను తీసుకురానున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే ప్రకటించింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న యానిమేటెడ్ ఫిల్మ్ ‘వాయుపుత్ర’ పైనా మంచి అంచనాలున్నాయి.రామాయణం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్షణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్ మాన్స్టర్మైండ్ క్రియేష న్న్స్ సహకారంతో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, పరశురాముడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి.– డేరంగుల జగన్ మోహన్ -
హనుమాన్ సీక్వెల్.. “జై హనుమాన్” మొదలైంది.. పూజా కార్యక్రమంలో రిషబ్ శెట్టి
-
అంజనాద్రి బెట్టలో 'జై హనుమాన్' ప్రారంభం.. అక్కడే ఎందుకో తెలుసా?
హనుమాన్ మూవీ సీక్వెల్ 'జై హనుమాన్' ప్రారంభమైంది. చారిత్రాత్మక పట్టణం హంపిలో పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు నటుడు రిషభ్‌శెట్టి తన సతీమణి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి బెట్టలో లాంఛనంగా మూవీ పనులు మొదలయ్యాయి. 2024లో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని రూ. 300 కోట్లు రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్లో ఆంజనేయుడి పాత్రలో రిషభ్‌శెట్టి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. రామాయణంతో ముడిపడిన ఈ మైథలాజికల్ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిసింది.అంజనాద్రి బెట్టలోనే పూజా కార్యక్రమం ఎందుకో తెలుసా..'జై హనుమాన్' సినిమా పూర్తిగా ఆంజనేయుడి స్వామి చుట్టే తిరుగుతుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. అందుకే సెంటిమెంట్‌గా అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమంతో మూవీ చిత్రీకరణను ప్రారంభించారు. మన పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని హనుమంతుడి జన్మస్థలంగా నమ్ముతారు. హనుమంతుడు అంజనా దేవికి జన్మించారు. అందుకే ఈ ప్రాంతాన్ని అంజనాద్రి బెట్ట అని ఇప్పటికీ పిలుస్తారు. కొండ పైభాగంలో విశాలమైన హనుమాన్ ఆలయం ఉంది. దాదాపు 575 మెట్లు దాటుకుని పైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో రాతితో చెక్కబడిన హనుమంతుడి విగ్రహం, కొద్ది సమీపంలో రాముడు, సీత మందిరాలు ఉన్నాయి. అక్కడే అంజనా దేవి ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశం పురాణాలలో కిష్కిందగా పిలువబడింది. ఈ కొండ హంపికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మీరు రాతి రథం, హనుమాన్ ఆలయం, యంత్ర హనుమాన్ ఆలయంతో పాటు రాముడు, హనుమంతుడు మొదటిసారి కలిసిన ప్రదేశం ఇలా ఎన్నో మరెన్నో చూడవచ్చు. #rishabshetty #tejasajja at #JaiHanuman Pooja Ceremony 🎬 pic.twitter.com/eYdAg45iM5— Rajesh Manne (@rajeshmanne1) February 22, 2026 -
హిస్టారికల్ ప్రదేశంలో 'జై హనుమాన్' మొదటి అడుగు
హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2024లో కాసుల వర్షం కురిపించింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని రూ. 300 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌ను తీసుకొస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే.తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్నదే ‘జై హనుమాన్’. ఈ మూవీ ఫిబ్రవరి 22న చారిత్రాత్మక పట్టణం హంపిలో పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నట్లు సమాచారం. సీక్వెల్ ‘హనుమాన్’కి మించి ఉంటుందని దర్శకుడు ప్రకటించడంతో భారీ బజ్ క్రియేట్ అయింది. ఆంజనేయస్వామి పాత్రను స్టార్ హీరో రిషభ్‌శెట్టి పోషిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. జై హనుమాన్ షూటింగ్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ రెండు చిత్రాలూ ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగమే అని తెలిసిందే. -
మూడు పాన్ ఇండియా సినిమాలను ప్రకటించిన 'తేజా సజ్జా'
మిరాయ్ సినిమాతో తేజ సజ్జా మరో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించారు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ. 112 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మిరాయ్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న తేజ సజ్జా తన తర్వాతి సినిమాలను ప్రకటించాడు. అయితే, అవన్నీ కూడా సీక్వెల్స్ కావడం విశేషం. మిరాయ్ సినిమా తర్వాత తేజ సజ్జా నుంచి రానున్న చిత్రాల గురించి రివీల్ చేశాడు. మూడు సినిమాల సీక్వెల్స్ ను ఆయన ప్రకటించాడు. మిరాయ్, జై హనుమాన్, జాంబీరెడ్డి 2 సీక్వెల్స్ చిత్రాలు ఉంటాయని తేజ సజ్జా పంచుకున్నాడు. మిరాయ్ సెకండ్ పార్ట్ కోసం కొన్ని ఐడియాలు సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు ఇప్పటికే చెప్పారు. 'హను-మాన్' సీక్వెల్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే, పార్ట్-1కు మించి వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్’ ఉంటుందని ఆయన అన్నారు. కానీ, సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదని క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్లో అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడని చెప్పారు. అయితే, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి అని ట్విస్ట్ ఇచ్చారు. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఇప్పటికే ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీస్ నిర్మిస్తుంది.జైహనుమాన్ తర్వాతే మిరాయ్2 తేజ సజ్జా , దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన తొలి హిట్ మూవీ 'జాంబిరెడ్డి'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుంది. అయితే, సుమారు నాలుగేళ్ల తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా 'జాంబిరెడ్డి 2'ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి అయినట్లు సమాచారం. అయితే, ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథను మాత్రమే అందిస్తారని దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని చర్చ జరుగుతుంది. తేజ సజ్జా నుంచి తర్వాతి సినిమా జైహనుమాన్ (2026) విడుదల కానుంది. అదే ఏడాది చివరిలో మిరాయ్2 ఉండోచ్చని టాక్.. 'జాంబిరెడ్డి 2' కోసం మాత్రం మరో రెండేళ్లు ఆగాల్సిందే.#TejaSajja Emerging as the most prominent star of Tollywood. What a lineups👌📈#JaiHanuman - Alongside RishabhShetty playing LordHanuman✡️#Mirai2 - Alongside RanaDaggubati playing prominent role⚔️#ZombieRedd2 - Comedy entertainer With Alien Vs Zombie🧟♂️ pic.twitter.com/9kep3K4cQY— AmuthaBharathi (@CinemaWithAB) September 18, 2025 -
జై హనుమాన్, వాడవాడలా హనుమజ్జయంతి వేడుకలు
చంపాపేట: చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ లావణ్య పర్యవేక్షణలో సింధూర అభిషేకం, ఆకుపూజ, అర్యనలు తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మన్సూరాబాద్‌లో.. మన్సూరాబాద్: మన్సూరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. మోహన్‌నగర్‌లో.. నాగోలు: హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్‌లో హనుమాన్ యువసేన అధ్యక్షుడు యశ్పాల్గౌడ్ ఆధ్వర్యంలో హోమం, హనుమంతుడికి అభిõÙకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మధుసూదన్‌రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, నాయకులు భరత్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, మహిపాల్ రెడ్డి, బొక్కబాల్ రెడ్డి, లింగాల నాగేశ్వరరావు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఐఎస్‌సదన్, సైదాబాద్ డివిజన్లలో.. సైదాబాద్: ఐఎస్‌సదన్, సైదాబాద్ డివిజన్ల పరిధిలోని పలు ఆలయాలు ఆధ్యాతి్మక శోభతో వెల్లివిరిసాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సైదాబాద్ శంకేశ్వరబజార్లోని శివాలయంలో నిర్వహించిన హోమంలో ఐఎస్‌సదన్ డివిజన్ కార్పొరేటర్ దంపతులు జంగం శ్వేతామధుకర్‌రెడ్డి పాల్గొన్నారు. సైదాబాద్ పూజలబస్తీలోని శ్రీశివాంజనేయ స్వామి దేవాలయంలో సుభాష్చందర్జీ పూజల్లో పాల్గొన్నారు. రామకృష్ణపురం డివిజన్లో.. దిల్సుఖ్నగర్: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన పూజల్లో ఆర్కేపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ దేప సురేఖ భాస్కర్‌రెడ్డి పాల్గొని మాలధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, పున్న నిర్మల గణేష్ బండి మధుసూదన్ రావు, తలాటి రమేష్ నేత, సురేష్ పాల్గొన్నారు. ఘనంగా హనుమాన్ జయంతి గోల్కొండ: హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. షేక్‌పేట్‌లోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా గోల్కొండ రిసాలబజార్‌లోని హనుమాన్ ఆలయంలో మహంకాళి ఆలయ పూజారి బి.సురేష్‌చారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి నిర్వహించారు. పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన... చాంద్రాయణగుట్ట: రాజన్నబావి ప్రాంతంలోని భవానీ శంకర ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో గురువారం 21 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా సర్వధర్మ సనాతన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్టించారు. శ్రీమఠం నరసింహాచార్య కాకునూరి రవి నారాయణ శర్మ, శ్రీ కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారికి వాయుస్తుతి పునశ్చరణతో అభిషేకం, 108 కలశాలతో పంచుముఖ ఆంజనేయ స్వామి వారికి కుంభాభిషేకం, అష్టోత్తర శతనామావళి, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె.వెంకటేష్‌లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అధ్యక్షుడు మధుసూదన్ రావు, ఫ్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రాజు ముదిరాజ్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఘనంగా తమలపాకు పూజ.. హనుమాన్ జయంతి సందర్భంగా లాల్‌దర్వాజా పూల్‌బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సంకట మోచన హనుమాన్ స్వామికి అభిషేకం తమలపాకు పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాశెట్టి లెనిన్‌బాబు దంపతులు, ట్రస్టీ వెంకటేశ్వర రావు, ప్రధాన అర్చకులు మోహనాచార్యులుతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోషామహల్లో.. అబిడ్స్: హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సంతోష్ గుప్తా పాల్గొని పూజలు చేశారు. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. గోషామహల్, జాంబాగ్, ఆగాపురా, ఆసిఫ్‌నగర్, బేగంబజార్, ధూల్‌పేట్ తదితర ప్రాంతాల్లోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఛత్రపతి శివాజీగా పాన్ ఇండియా హీరో.. పోస్టర్ విడుదల
కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రానున్న చిత్రం 'ఛత్రపతి శివాజీ మహారాజ్'. భారీ బడ్జెట్ తెరకెక్కను ఈ చిత్రాన్ని ఒక పోస్టర్‌తో తాజాగా రిషబ్ ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి నటించనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను దర్శకుడు సందీప్ సింగ్ షేర్ చేశారు. 'ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధున్ని గౌరవించటానికి నిర్మిస్తున్నాం. యుద్ధ రంగంలో శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటన స్ఫూర్తిని, స్వపరిపాలన కోసం పోరాడిన మరాఠ యోధుడు శివాజీ. అతని జీవితం, వారసత్వం భారతీయ చరిత్రలో చెరగని ముద్రను మిగిల్చాయి' అని ఆయన గుర్తుచేసుకున్నారు. శివాజీ అన్‌టోల్డ్ స్టోరీతో ప్రేక్షకులకు తాము చూపించబోతున్నట్లు ఆయన అన్నారు.కాంతార సినిమా తర్వాత రిషబ్ శెట్టి మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి. కాంతార ప్రీక్వెల్తో పాటు జై హనుమాన్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' వంటి బిగ్ ప్రాజెక్ట్‌లో ఆయన భాగమైనందుకు ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. 2025,2026,2027 ఇలా వరుసగా రిషబ్ శెట్టి సినిమాలు విడుదల కానున్నాయి.Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharajThis isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q— Rishab Shetty (@shetty_rishab) December 3, 2024 -
రాముడిగా మహేష్.. రావణుడిగా రానా ..!
-
ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్‌గా నటించిన నటులెవరో తెలుసా?
హనుమాన్ను కేవలం దైవంగానే కాదు.. పిల్లల దృష్టిలో సూపర్ హీరోగానూ వెండి తెర ఆవిష్కరించింది. ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ చిత్రంలో కన్నడ నటుడు, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ లుక్ రివీల్ చేశారు. అయితే..గతంలోనూ కొందరు నటులు వెండి తెరపై హనుమంతుడి అవతారంలో ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నమూ చేశారు. వాళ్లెవరంటే..దేవ్‌దత్తా నాగేఆదిపురుష్(2023).. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాముడి(రాఘవ)గా చూపించిన ప్రయత్నం. అయితే ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే.. హనుమంతుడి(భజరంగ్) పాత్రలో నటించాడు. కానీ, ఆ క్యారెక్టర్ కూడా ఇంటర్నెట్లో నవ్వులపాలవ్వడంతో ఆయన కష్టం వృథా అయ్యింది.ఏ. జనార్ధన రావుతెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్‌గా ఈయన్ని చూపిస్తుంటారు. ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారాయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు.. 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. కమలాకర కామేశ్వర రావు తీసిన వీరాంజనేయ (1968)చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు. అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. అలా.. శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్‌మేన్.. చిత్రాలు ఈనాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. రాజనాలతెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.. బహుశా ఇంటి పేరునే స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న తొలి నటుడు కూడా ఈయనేనేమో!(రాజనాల కాళేశ్వర రావు). అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల.. హనుమాన్‌గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’(1972). కానీ, ఆ పాత్రలో మరిచిపోలేని అభినయం కనబర్చారాయన.దారా సింగ్మల్లు యోధుడిగానే కాదు.. ఇటు నటుడిగా, దర్శకుడిగా.. అటు రాజకీయాల్లోనూ రాణించారీయన. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్.. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు. భజరంగబలి(1976) చిత్రంలో తొలిసారి హనుమాన్‌గా అలరించి.. ఆ తర్వాత రామానంద సాగర్ ‘రామాయణ్’లో హనుమాన్ క్యారెక్టర్లో జీవించి.. భారతీయ బుల్లితెర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారాయాన. చిరంజీవిఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఓ ఫైట్ పోర్షన్లో హనుమాన్‌గా అలరించారాయన. అంతేకాదు.. హనుమాన్(2005) యానిమేటెడ్ చిత్రంలో ఆ పాత్రకు తెలుగు వెర్షన్లో వాయిస్ ఓవర్ కూడా అందించారు.నిర్భయ్ వాద్వాతెలుగులో జనార్ధన రావుకు ఎలాగైతే హనుమాన్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చి పెట్టాయో.. హిందీ టీవీ సీరియల్స్‌లో ఈ యువ నటుడికి అదే విధంగా ఆ పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. సంకట మోచన్ మహాబలి హనుమాన్(2015-17)లో తొలిసారి హనుమంతుడి పాత్రలో నటించిన నిర్భయ్‌కు.. ఆ తర్వాత మరో రెండు సీరియల్స్‌లోనూ ఆ రోల్ దక్కింది. ఈ ఏడాది ప్రారంభమైన శ్రీమద్ రామాయణ్‌లోనూ ఆయన హనుమాన్ రోల్లోనే నటిస్తున్నారు.ప్రశాంత్ శెట్టిప్రశాంత్ శెట్టి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. రిషబ్ శెట్టిగా అప్పటిదాకా కన్నడ ఆడియొన్స్‌ను మాత్రమే అలరిస్తూ వచ్చిన ఈ మల్టీ టాలెంట్ పర్సన్(నటుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్).. కాంతారతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో కాంతారను తీసి.. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులనూ దక్కించుకున్నాడు. బహుశా ఆ గుర్తింపే ఆయనకు జై హనుమాన్‌లో హనుమాన్ క్యారెక్టర్ దక్కడానికి ఓ కారణం అయ్యి ఉండొచ్చు కూడా!.ಕನ್ನಡ ನೆಲದ ವರಸುತ ಆಂಜನೇಯನ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಭಾರತ ಇತಿಹಾಸದ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಭಾವವೊಂದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ತರಲಿದ್ದೇವೆ.ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ ಬೆಂಬಲ ಆಶೀರ್ವಾದ ಎಂದಿನಂತೆ ಸದಾ ಇರಲಿ - ಜೈ ಹನುಮಾನ್A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga🙏We bring forth an epic of loyalty, courage and… pic.twitter.com/Zvgnt1tGnl— Rishab Shetty (@shetty_rishab) October 30, 2024ఇంకా ఎవరైనా నటీనటులను మరిచిపోయి ఉంటే.. వాళ్లు ఏ భాషకు చెందిన వాళ్లైనా సరే కామెంట్ సెక్షన్లో వాళ్ల పేర్లను మీరు తెలియజేయొచ్చు. -
రిషబ్ శెట్టి 'జై హనుమాన్'.. దీపావళి అప్డేట్ వచ్చేసింది!
హనుమాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే జై హనుమాన్‌లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని పరిచయం చేశారు. హనుమంతుని పాత్రలో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా జై హనుమాన్ థీమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'యుగయుగముల యోగమిది దాశరథి' అంటూ సాగే భక్తి సాంగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. సింగర్ రేవంత్ ఆలపించారు. ఈ సాంగ్‌కు ఓజెస్ సంగీతమందించారు. కాగా.. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. -
'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్
సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 'జై హనుమాన్' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు. 30న అంటే బుధవారం లుక్ బయటపెడతారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ)ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. చివర్లో సీక్వెల్ 'జై హనుమాన్' ఉంటుందని ప్రకటించారు. కానీ దానికి సంబంధించిన పనులేం జరిగినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడేమో ఫస్ట్ లుక్ అని చెప్పి షాకిచ్చారు.తొలి భాగంలో హనుమంతుడు పాత్రధారి ఎవరనేది రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా చూపిస్తారు. అయితే 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి.. హనుమంతుడిగా కనిపిస్తాడని అంటున్నారు. తొలి భాగాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించగా.. 'జై హనుమాన్'ని మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. పూర్తి వివరాలు రేపు తెలుస్తాయేమో?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా.. ఇప్పట్లో సాధ్యమేనా?
హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. వీరి కాంబినేషన్లో ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో సినిమా రానుందని, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని, ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ చిత్రం భాగం కావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. (చదవండి: జపాన్‌లో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రీ రిలీజ్ కూడా)అయితే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ వర్మ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్స్ పేరిట మహాకాళి, అధీరా లాంటి క్రేజీ ప్రాజెక్టులను ఇతర దర్శకులతో తీయిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ డేట్స్ కూడా కొన్నాళ్ల పాటు దొరకడం కష్టమే. (చదవండి: డ్యాన్స్ మాస్టర్‌తో పాటు అతడి భార్యపైనా కేసు)ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొంటాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. ఇవ్వన్ని పూర్తవ్వాలంటే కనీసం మూడున్నరేళ్లయినా పడుతుంది. ఆ తర్వాత కానీ ప్రభాస్ డేట్స్ ఖాలీగా ఉండవు. ఒకవేళ ప్రశాంత్ వర్మతో సినిమా ఉన్నా..ఇప్పట్లో అయితే ప్రారంభం అయ్యే చాన్స్ లేదు. మరి... ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా రూమర్‌గానే మిగిలిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
జై హనుమాన్‌లో ‘కాంతార’ హీరో!
‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘జై హనుమాన్’ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. (చదవండి: నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్)చిరంజీవి, రామ్‌చరణ్ వంటి స్టార్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చైతన్య చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమాలో కన్నడ హీరో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. మరి... ‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించనున్నారనే వార్త నిజమేనా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
ప్రశాంత్ - రణవీర్ సినిమా స్టార్ట్! జై హనుమాన్ కంటే ముందుగానే..!
-
'మాటిస్తున్నా.. అంతకుమించి'.. హనుమాన్ డైరెక్టర్ ట్వీట్!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీ పడి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాని సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్‌గా వస్తోన్న జై హనుమాన్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. "वचनं धर्मस्य रक्षणं" 🙏 Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️ On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06 — Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024 -
అంజనాద్రి 2.0.. 'జై హనుమాన్' వీడియో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి కొనసాగింపుగా 'జై హనుమాన్' రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సీక్వెల్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ తాజాగా స్పెషల్ మ్యూజిక్ థీమ్‌ను షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియోలో అందమైన కొండల మధ్యలో పెద్ద నది ఉంది. పార్ట్ -1 మాదిరి ఈ వీడియోలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించిన ప్రశాంత్.. 'వెల్కమ్ టు అంజనాద్రి 2.0' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆపై టైటిల్ నేమ్ అయిన #Jai Hanuman హ్యాష్ట్యాను కూడా దానికి జత చేశారు. ఫైనల్‌గా ఈ వీడియోకు 'హనుమాన్' నుంచి 'రఘునందన' పాటను అటాచ్ చేయడం విశేషం. హనుమాన్ సినిమా ముగింపులోనే పార్ట్2 ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగా 'జై హనుమాన్' తెరకెక్కుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా పోస్టర్ విడుదల కావచ్చు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికే జై హనుమాన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్రను ఒక స్టార్ హీరో చేస్తారని చెప్పిన ప్రశాంత్ వర్మ.. మరీ ఆ స్టార్ హీరో ఎవరో ఇంకా ఫైనల్ చేయలేదు. ఇకపోతే హనుమాన్ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
'జై హనుమాన్' ప్రాజెక్ట్‌ను పక్కనపెడుతున్న ప్రశాంత్ వర్మ.. కారణం ఇదేనా?
భారీ సినిమాలతో పోటీ పడి ఈ సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా 'జై హనుమాన్' ఉంటుందని.. అది 2025లో విడుదల అవుతుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. 'హనుమాన్' సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ ఇప్పుడు 'జై హనుమాన్' అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన తీయబోయే సినిమా 'జై హనుమాన్' ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం అది కాదని తెలుస్తోంది. జై హనుమాన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆయన అనుకున్న నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో మరికొంత సమయం పడుతుందని సమాచారం. దీంతో ఆయన డైరెక్ట్ చేసి పెండింగ్‌లో ఉన్న మరో ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించాలని ఉన్నారట. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న 'ఆక్టోపస్' సినిమాపై ఆయన ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్‌తో తెరకెక్కనుందని టాక్. ఇందులో ఐదుగురు మహిళా క్యారెక్టర్ల చుట్టూ కథ నడుస్తుందని గతంలో ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇండిస్ట్రీలో ప్రచారం జరుగుతున్నట్లు జై హనుమాన్ ప్రాజెక్ట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి 'ఆక్టోపస్' చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం ఎవరికీ తెలియదు. అనుపమ కూడా గతంలో లేడి ఓరియెంటెడ్ చిత్రమైన బటర్ ఫ్లై ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.. త్వరలో ఆమె డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే లైన్లో ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ చిత్రం కూడా త్వరగా పూర్తి చేసుకుని థియేటర్లోకి వస్తే ఈ బ్యూటీకి మరో కొన్ని ప్రాజెక్ట్‌లు వచ్చే ఛాన్స్ ఉంది. -
జై హనుమాన్తో ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాను
‘‘చిత్ర పరిశ్రమలో 50 రోజుల పండగ చూసి చాలా కాలమైంది. అది మా ‘హనుమాన్’ సినిమాకి జరగడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ వర్క్ ఆరంభమైంది. ‘హనుమాన్’కి ప్రేక్షకులు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని ‘జై హనుమాన్’తో వారి రుణం తీర్చుకుంటాను’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హనుమాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై, 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ ‘హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్’ని హైదరాబాద్‌లో నిర్వహించింది. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్.. ఇలా చాలామంది జీవితాలను ఒక సక్సెస్ఫుల్ సినిమా మారుస్తుంది. అది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘హనుమాన్’ లాంటి సినిమా 150 థియేటర్స్‌లో 50 రోజులు ఆడిందనే విషయం చాలామందికి మంచి సినిమాపై నమ్మకాన్ని కలిగిస్తుంది.. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. ఈ సినిమాని త్వరలో అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయనున్నాం. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా గొప్పతనం చాటనుంది. దీనికి కారణం మా నిర్మాత నిరంజన్‌గారి విజన్’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు తేజ సజ్జా. ‘‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సినిమానే (హనుమాన్) ఇంత పెద్ద విజయం సాధించడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
'హనుమాన్' రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్
ఈ సంవత్సరం సంక్రాంతి హిట్‌గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తక్కువ బడ్జెట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. హనుమాన్ విజువల్స్ చూస్తే అందుకు అయిన ఖర్చు రూ. 100 కోట్లు ఉంటుందేమో అని ఎవరైనా చెప్తారు. కానీ కేవలం రూ. 50 కోట్లతో ఈ సినిమాను క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కోసం నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా తన వంతుగా ఎంత చేయాలో అంత చేశారని గతంలో ప్రశాంత్ కూడా తెలిపారు. కొద్దిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం చక్కర్లు కొడుతోంది. సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టడంతో నిర్మాత, దర్శకుడి మధ్య గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. హనుమాన్కు వచ్చిన లాభాల్లో వాటా కావాలని నిర్మాతతో ప్రశాంత్ గొడవ పడ్డారని పలు వెబ్‌సైట్స్‌లలో ప్రచారం జరిగింది. రూ.30 కోట్లు తనకు షేర్‌గా ఇవ్వాలని నిర్మాతపై ఆయన ఒత్తిడి తెస్తున్నారంటూ పుకార్లు వచ్చాయి. (ఇదీ చదవండి : సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్) అంతే కాకుండా ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న 'జై హనుమాన్'కు సంబంధించి కొంత అడ్వాన్స్‌తో పాటుగా లాభాల్లో వాటా కావాలని ముందే ఆయన అడిగినట్లుగా వైరల్ అయింది. తన షరతులను ఒప్పుకోకపోతే సీక్వెల్ కోసం పనిచేయనని ప్రశాంత్ వర్మ చెప్పినట్లు పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. నిర్మాత నిరంజన్ రెడ్డితో ప్రశాంత్ కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఫోన్ చూసుకుంటూ సరదాగా ఉన్నారు. తమపై వస్తున్న నెగెటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నట్లు అందులో రాసుకొచ్చారు. తాము హనుమాన్ స్పిరిట్‌ను కొనసాగిస్తున్నామని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఒక్క పోస్ట్‌తో తమ మధ్య గొడవలు ఉన్నాయని వస్తున్న పుకార్లకు ఆయన చెక్ పెట్టేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంత చక్కగా ఉన్న వీరిద్దరి మధ్య ఇలాంటి వార్తలో చిచ్చు పెట్టాలని ఎవరు ప్రయత్నం చేశారో తెలియాల్సి ఉంది. Browsing off the negativity with a smile and the unbreakable spirit of #HanuMan ✨@Niran_Reddy pic.twitter.com/2O5J6BqwPH — Prasanth Varma (@PrasanthVarma) February 8, 2024 -
జై హనుమాన్ కోసం చిరంజీవి మహేష్ ?
-
జై హనుమాన్ లో రామ్ చరణ్ పాత్ర అదేనా..?
-
జై హనుమాన్ లో రామ్ చరణ్ రోల్ ఏంటంటే..!
-
జై హనుమాన్...
నగరంలో ఘనంగా హనుమజ్జయంతి వైభవంగా సాగిన శోభాయాత్ర అబిడ్స్/కలెక్టరేట్: జై హనుమాన్..జై శ్రీరాం...జై భజరంగబళి నినాదాలతో నగరం హోరెత్తింది. హనుమాన్ జయంతిని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. నగరం నలుమూలలా హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. వేలాది మంది భక్తజనం పాల్గొన్నారు. గౌలిగూడ రాంమందిర్‌లో ముందుగా భజరంగ్‌దళ్ తెలంగాణ అధ్యక్షులు వై.భానుప్రకాష్ హనుమాన్‌జీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రను వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ కార్యదర్శి సురేంద్రకుమార్ జైన్, తెలంగాణ ప్రాంత అధ్యక్షులు మూసాపేట రామరాజు, కార్యాధ్యక్షులు సురేందర్‌రెడ్డి, భాగ్యనగర్ వీహెచ్‌పీ అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్, బెంగుళూరు క్షేత్ర భజరంగ్‌దళ్ సంయోజకులు సూర్యనారాయణ ముఖ్యఅతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. శోభాయాత్రకు జంట నగరాల నుంచి వేలాదిమంది హనుమాన్ భక్తులు ర్యాలీగా తరలివచ్చారు. జంటనగరాలకు చెందిన హిందీనగర్, వివేకానందనగర్, ఆర్యనగర్, విద్యానగర్, మహంకాళినగర్, అణుశక్తి, విశ్వకర్మనగర్, వాయుపుత్రనగర్ జిల్లాలతో పాటు పాతబస్తీలోని ధూల్‌పేట్, బేగంబజార్, మంగళ్‌హాట్, జియాగూడ, పురానాపూల్, షాలిబండ, చార్మినార్, బహదూర్‌పురా, అత్తాపూర్, జాంబాగ్, గన్‌ఫౌండ్రీ, సుల్తాన్‌బజార్, కోఠి, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది హనుమాన్ భక్తులు ర్యాలీలో పాల్గొని జైశ్రీరామ్ నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గౌలిగూడ రాంమందిర్ ప్రధాన రహదారి నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా మీదుగా సుల్తాన్‌బజార్, కాచిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి నుంచి తాడ్బంద్ హనుమాన్ ఆలయానికి తరలివెళ్లింది. పాల్గొన్న ప్రముఖులు హనుమాన్ శోభాయాత్రలో భజరంగ్ దళ్ నగర అధ్యక్షులు వీరేశలింగం, మాజీ ఎమ్మెల్యే పి.రామస్వామి, భజరంగ్సేన రాష్ట్ర అధ్యక్షులు ఠాకూర్ యమన్‌సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు గోవింద్‌రాఠి, వై. కృష్ణ, గొడుగు శ్రీనివాస్‌యాదవ్, బంగారు సుధీర్‌కుమార్, కార్పొరేటర్ జి. శంకర్‌యాదవ్, బీజేపీ నగర కార్యవర్గ సభ్యులు గుండెవోని శ్రీనివాస్‌యాదవ్, మీరంపల్లి కృష్ణ, రమేష్‌లతో పాటు టీఆర్ఎస్ గన్‌ఫౌండ్రి నాయకులు సంతోష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రకు సెంట్రల్, ఈస్ట్‌జోన్ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. డీసీపీ కమల్‌హాసన్‌రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాధ్, అడిషనల్ డీసీపీ సుంకరి సత్యనారాయణ, ఏసీపీ రావుల గిరిధర్, ఇన్స్పెక్టర్లు అంజయ్య, శివశంకర్, ఇతర అధికారులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. -
నిండుకుండ వంటిది నిరాడంబరత
హైందవం నిరాడంబరత అనేది దేహ బాహ్య స్వరూపానికి సంబంధించింది కాదు. అది అంతర్గతమైన లక్షణం. నిరాడంబరత అంటే ఏమీ తెలియని ఒక నిర్లిప్త స్థితి కాదు, అన్నీ తెలిసిన సంపూర్ణ స్థితి. శివుడు, ఆంజనేయుడు, షిర్డీసాయిల నిరాడంబర అభివ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మహాదేవుడు: నివాసం శ్మశానం. కంఠహారం సర్పం. ఆయుధం త్రిశూలం. ఆసనం పులిచర్మం. ఇదీ శివుడి నిరాడంబర బాహ్యరూపం. కానీ, దీని అంతరార్థం వేరు. శివుడు ధరించిన త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు సంకేతం. శరీరంపై సర్పాలు జీవాత్మలు. భస్మం పరిశుద్ధతకు ప్రతీక. ఆసనమైన పులిచర్మం కోరికలను త్యజించమనే సూచిక. వినయ హనుమ: అతి బలవంతుడు హనుమంతుడి జీవన విధానం కూడా ఎంతో నిరాడంబరమైంది. ఎంత శక్తి సంపన్నుడైనా ఎంతో నిరాడంబరంగా ఉన్నాడు. సుగ్రీవుడు, జాంబవంతుల ముందు కూడా వినయంతోనే మెలిగాడు. ‘జై హనుమాన్’ అని ఎక్కడా తనకు జేజేలు కొట్టించుకోలేదు. ‘జై శ్రీరామ్’ అంటూ తన నిరాడంబరతను ప్రకటించుకున్నాడు. బాబా ప్రేమ తత్వం: షిర్డీ సాయిబాబా అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. ఒక జుబ్బా, కఫనీ, సట్కా, తంబరి మాత్రమే ఆయన ఆస్తులు. భక్తులు ఇచ్చిన కానుకలను కూడా తిరిగి వారికే అత్యంత ప్రేమగా పంచేసేవారు. బాబాని దర్శించుకునేందుకు నిత్యం వందలమంది భక్తులు వచ్చేవారు. అయినా, పనులన్నీ సొంతంగానే చేసుకునేవారు. భిక్షాటన చేసి భోజనం చేసేవారు. లెండి బావి నుంచి స్వయంగా నీళ్లు తోడి మొక్కలను పెంచేవారు. ఎక్కడికి ప్రయాణమైనా కాలినడకే తప్ప, ఎలాంటి వాహనాలనూ ఉపయోగించలేదు. ఫకీరులా కనిపించే బాబాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కరతలామలకం. తన ముందు నిలబడ్డవాడు భక్తుడా మూర్ఖుడా అనే తేడా లేకుండా అందరికీ ప్రేమతత్వాన్ని పంచారు బాబా. సాయి నిరాడంబర జీవన సందేశం కూడా అదే. నిండుకుండ తొణకదు అంటారు. నిరాడంబరత కూడా నిండు కుండలాంటిదే. విజ్ఞానమూ, బలమూ పెరుగుతున్న కొద్దీ మనిషి నిండుకుండలా మారిపోవాలి. నిరాడంబరత అలవర్చుకోవాలి. - సురేష్‌బాబా


