అంజనాద్రి 2.0.. 'జై హనుమాన్‌' వీడియో పోస్ట్‌ చేసిన ప్రశాంత్‌ వర్మ | Jai Hanuman Movie Anjanadri 2.0 Video Released By Prashanth Varma, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

అంజనాద్రి 2.0 అంటూ.. 'జై హనుమాన్‌' వీడియో పోస్ట్‌ చేసిన ప్రశాంత్‌ వర్మ

Mar 31 2024 10:50 AM | Updated on Mar 31 2024 12:46 PM

Jai Hanuman Movie Video Released By Prashanth Varma - Sakshi

యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా  వండర్స్ క్రియేట్ చేసింది.  తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద రూ. 300 కోట్లకు పైగానే కలెక్ట్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  దీనికి కొనసాగింపుగా 'జై హనుమాన్‌' రానుందని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సీక్వెల్‌ అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ వర్మ తాజాగా  స్పెషల్ మ్యూజిక్‌ థీమ్‌ను షేర్‌ చేశారు. 

ప్రశాంత్‌ వర్మ షేర్‌ చేసిన వీడియోలో అందమైన కొండల మధ్యలో పెద్ద నది ఉంది. పార్ట్‌ -1 మాదిరి ఈ వీడియోలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించిన ప్రశాంత్‌..  'వెల్‌కమ్‌ టు అంజనాద్రి 2.0' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆపై టైటిల్‌ నేమ్‌ అయిన #Jai Hanuman హ్యాష్‌ట్యాను కూడా దానికి‌ జత చేశారు. ఫైనల్‌గా ఈ వీడియోకు 'హనుమాన్‌' నుంచి 'రఘునందన' పాటను అటాచ్‌ చేయడం విశేషం.

హనుమాన్‌ సినిమా ముగింపులోనే పార్ట్‌2 ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగా 'జై హనుమాన్‌' తెరకెక్కుతుంది. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా పోస్టర్‌ విడుదల కావచ్చు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికే జై హనుమాన్‌ విడుదల అయ్యే ఛాన్స్‌ ఉంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్రను ఒక స్టార్‌ హీరో చేస్తారని చెప్పిన ప్రశాంత్‌ వర్మ.. మరీ ఆ స్టార్‌ హీరో ఎవరో ఇంకా ఫైనల్‌ చేయలేదు. ఇకపోతే హనుమాన్‌ సినిమా జీ5లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement