జై హనుమాన్‌తో ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాను | Director Prasanth Varma Revealed Hanu Man Sequel Jai HanuMan Will Be Announced Very Soon, Deets Inside - Sakshi
Sakshi News home page

జై హనుమాన్‌తో ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాను

Published Sun, Mar 3 2024 6:16 AM

Director Prasanth Varma revealed Hanu Man sequel Jai HanuMan will be announced very soon - Sakshi

డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ 

‘‘చిత్ర పరిశ్రమలో 50 రోజుల పండగ చూసి చాలా కాలమైంది. అది మా ‘హనుమాన్‌’ సినిమాకి జరగడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్‌’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ వర్క్‌ ఆరంభమైంది. ‘హనుమాన్‌’కి ప్రేక్షకులు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని ‘జై హనుమాన్‌’తో వారి రుణం తీర్చుకుంటాను’’ అని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్‌ జంటగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హనుమాన్‌’.  కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై, 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్‌ ‘హిస్టారిక్‌ 50 డేస్‌ సెలబ్రేషన్స్‌’ని హైదరాబాద్‌లో నిర్వహించింది.

ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్‌.. ఇలా చాలామంది జీవితాలను ఒక సక్సెస్‌ఫుల్‌ సినిమా మారుస్తుంది. అది సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘హనుమాన్‌’ లాంటి సినిమా 150 థియేటర్స్‌లో 50 రోజులు ఆడిందనే విషయం చాలామందికి మంచి సినిమాపై నమ్మకాన్ని కలిగిస్తుంది.. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. ఈ సినిమాని త్వరలో అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్‌ చేయనున్నాం. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా గొప్పతనం చాటనుంది. దీనికి కారణం మా నిర్మాత నిరంజన్‌గారి విజన్‌’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు తేజ సజ్జా. ‘‘ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వచ్చిన మొదటి సినిమానే (హనుమాన్‌) ఇంత పెద్ద విజయం సాధించడం హ్యాపీగా ఉంది. ‘హనుమాన్‌’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిరంజన్‌ రెడ్డి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement