
చంపాపేట: చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ లావణ్య పర్యవేక్షణలో సింధూర అభిషేకం, ఆకుపూజ, అర్యనలు తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
మన్సూరాబాద్‌లో..
మన్సూరాబాద్: మన్సూరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు.
మోహన్‌నగర్‌లో..
నాగోలు: హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్‌లో హనుమాన్ యువసేన అధ్యక్షుడు యశ్పాల్‌గౌడ్ ఆధ్వర్యంలో హోమం, హనుమంతుడికి అభిõÙకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మధుసూదన్‌రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, నాయకులు భరత్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, మహిపాల్ రెడ్డి, బొక్కబాల్ రెడ్డి, లింగాల నాగేశ్వరరావు గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఐఎస్‌సదన్, సైదాబాద్ డివిజన్లలో..
సైదాబాద్: ఐఎస్‌సదన్, సైదాబాద్ డివిజన్ల పరిధిలోని పలు ఆలయాలు ఆధ్యాతి్మక శోభతో వెల్లివిరిసాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సైదాబాద్ శంకేశ్వరబజార్‌లోని శివాలయంలో నిర్వహించిన హోమంలో ఐఎస్‌సదన్ డివిజన్ కార్పొరేటర్ దంపతులు జంగం శ్వేతామధుకర్‌రెడ్డి పాల్గొన్నారు. సైదాబాద్ పూజలబస్తీలోని శ్రీశివాంజనేయ స్వామి దేవాలయంలో సుభాష్‌చందర్జీ పూజల్లో పాల్గొన్నారు.
రామకృష్ణపురం డివిజన్‌లో..
దిల్‌సుఖ్‌నగర్: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన పూజల్లో ఆర్‌కేపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ దేప సురేఖ భాస్కర్‌రెడ్డి పాల్గొని మాలధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, పున్న నిర్మల గణేష్ బండి మధుసూదన్ రావు, తలాటి రమేష్ నేత, సురేష్ పాల్గొన్నారు. ఘనంగా హనుమాన్ జయంతి
గోల్కొండ: హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. షేక్‌పేట్‌లోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా గోల్కొండ రిసాలబజార్‌లోని హనుమాన్ ఆలయంలో మహంకాళి ఆలయ పూజారి బి.సురేష్‌చారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి నిర్వహించారు.
పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన...
చాంద్రాయణగుట్ట: రాజన్నబావి ప్రాంతంలోని భవానీ శంకర ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో గురువారం 21 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా సర్వధర్మ సనాతన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్టించారు. శ్రీమఠం నరసింహాచార్య కాకునూరి రవి నారాయణ శర్మ, శ్రీ కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారికి వాయుస్తుతి పునశ్చరణతో అభిషేకం, 108 కలశాలతో పంచుముఖ ఆంజనేయ స్వామి వారికి కుంభాభిషేకం, అష్టోత్తర శతనామావళి, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె.వెంకటేష్‌లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అధ్యక్షుడు మధుసూదన్ రావు, ఫ్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రాజు ముదిరాజ్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా తమలపాకు పూజ..
హనుమాన్ జయంతి సందర్భంగా లాల్‌దర్వాజా పూల్‌బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సంకట మోచన హనుమాన్ స్వామికి అభిషేకం తమలపాకు పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాశెట్టి లెనిన్‌బాబు దంపతులు, ట్రస్టీ వెంకటేశ్వర రావు, ప్రధాన అర్చకులు మోహనాచార్యులుతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గోషామహల్‌లో..
అబిడ్స్: హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సంతోష్ గుప్తా పాల్గొని పూజలు చేశారు. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. గోషామహల్, జాంబాగ్, ఆగాపురా, ఆసిఫ్‌నగర్, బేగంబజార్, ధూల్‌పేట్ తదితర ప్రాంతాల్లోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.