
మిరాయ్ సినిమాతో తేజ సజ్జా మరో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించారు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ. 112 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మిరాయ్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న తేజ సజ్జా తన తర్వాతి సినిమాలను ప్రకటించాడు. అయితే, అవన్నీ కూడా సీక్వెల్స్ కావడం విశేషం.

మిరాయ్ సినిమా తర్వాత తేజ సజ్జా నుంచి రానున్న చిత్రాల గురించి రివీల్ చేశాడు. మూడు సినిమాల సీక్వెల్స్ ను ఆయన ప్రకటించాడు. మిరాయ్, జై హనుమాన్, జాంబీరెడ్డి 2 సీక్వెల్స్ చిత్రాలు ఉంటాయని తేజ సజ్జా పంచుకున్నాడు. మిరాయ్ సెకండ్ పార్ట్ కోసం కొన్ని ఐడియాలు సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు ఇప్పటికే చెప్పారు. 'హను-మాన్' సీక్వెల్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే, పార్ట్-1కు మించి వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్’ ఉంటుందని ఆయన అన్నారు. కానీ, సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదని క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్‌లో అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడని చెప్పారు. అయితే, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి అని ట్విస్ట్ ఇచ్చారు. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఇప్పటికే ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను మైత్రి మూవీస్ నిర్మిస్తుంది.

జైహనుమాన్ తర్వాతే మిరాయ్2
తేజ సజ్జా , దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన తొలి హిట్ మూవీ 'జాంబిరెడ్డి'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుంది. అయితే, సుమారు నాలుగేళ్ల తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా 'జాంబిరెడ్డి 2'ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి అయినట్లు సమాచారం. అయితే, ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథను మాత్రమే అందిస్తారని దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని చర్చ జరుగుతుంది. తేజ సజ్జా నుంచి తర్వాతి సినిమా జైహనుమాన్ (2026) విడుదల కానుంది. అదే ఏడాది చివరిలో మిరాయ్2 ఉండోచ్చని టాక్.. 'జాంబిరెడ్డి 2' కోసం మాత్రం మరో రెండేళ్లు ఆగాల్సిందే.
#TejaSajja Emerging as the most prominent star of Tollywood. What a lineups👌📈#JaiHanuman - Alongside RishabhShetty playing LordHanuman✡️#Mirai2 - Alongside RanaDaggubati playing prominent role⚔️#ZombieRedd2 - Comedy entertainer With Alien Vs Zombie🧟♂️ pic.twitter.com/9kep3K4cQY
— AmuthaBharathi (@CinemaWithAB) September 18, 2025