తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌కు మరికొద్ది గంటల్లో శుభం కార్డు పడనుంది. ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఎంతోమంది గెస్టులు బిగ్‌బాస్ స్టేజీపైకి రానున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో మంగ్లీ, పాయల్ రాజ్‌పుత్ వంటి పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అల్లాడించారు. అలాగే ఛాంపియన్, అనగనగా ఓ రాజు సినిమా హీరోహీరోయిన్లు కూడా సందడి చేశారు.
బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీకాంత్
హీరో శ్రీకాంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఒకర్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి టీషర్ట్‌పై అన్‌సేఫ్ అని రాస్తారో వారు ఎలిమినేట్ అయినట్లు లెక్క! ఇక్కడ అందరికంటే ఎక్కువ కల్యాణ్ భయపడ్డాడు. తాను వెళ్లిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడు. కానీ కొంత షూటింగ్ నిన్ననే అయిపోవడంతో ఫస్ట్ సంజనా ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి.
రోబో ఎలిమినేట్!
తర్వాత రోబోను పంపించగా ఆ రోబో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది. ప్రోమో చూస్తుంటే మాత్రం ఓపక్క టెన్షన్, మరోపక్క ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఇక ఈ సీజన్ దేశంలోనే టాప్ 1లో ఉందన్నారు నాగార్జున. బిగ్‌బాస్ 9 ట్రోఫీని చూపించేటప్పుడు మగువా మగువా.. పాట బీజీఎమ్ వేశారు. అంటే తనూజ గెలుస్తుందని ఏమైనా హింట్ ఇచ్చారా? అని నెటిజన్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఆ ప్రోమో మీరూ చూసేయండి..
&


