దసరాకి కింగ్‌ | Akkineni Nagarjuna 100th Movie Update | Sakshi
Sakshi News home page

దసరాకి కింగ్‌

Feb 2 2026 12:46 AM | Updated on Feb 2 2026 12:46 AM

Akkineni Nagarjuna 100th Movie Update

హీరో నాగార్జున ఒక స్పెషల్‌ మూవీ చేస్తున్నారు. మరి... కెరీర్‌లో నూరవ చిత్రం అంటే ప్రత్యేకమే కదా. అందుకే దసరా పండగకి సందడి చేయాలని నిర్ణయించుకున్నట్లున్నారు. అభిమానులు కూడా తమ కింగ్‌ (నాగార్జునని అలానే పిలుస్తారు) సెంచురీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘కింగ్‌ 100’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూ పొందుతోంది. తమిళ చిత్రం ‘నిదమ్‌ ఒరు వానమ్‌’తో దర్శకుడిగా పరిచయమైన ఆర్‌ఏ కార్తీక్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూ పొందిస్తున్నారని సమాచారం.

లాటరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని భోగట్టా. అందుకే ‘లాటరీ కింగ్‌’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ఇంకా ‘కింగ్‌ 100, కింగ్‌ 100 నాటౌట్‌’ టైటిల్స్‌ని కూడా పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో టబు నటిస్తున్నారు. టబు ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు. అలాగే అనుష్క కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. అయితే ఈ విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారనే వార్త తెరపైకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement