నా ఫస్ట్‌ మూవీ తెలుగులో.. ఇంతవరకు రిలీజవ్వలేదు | TV Actor Nakuul Mehta says his first Telugu film never released | Sakshi
Sakshi News home page

తెలుగులో నా తొలి మూవీ రిలీజవ్వలేదు.. శ్రియా మాత్రం!

Feb 6 2026 10:42 AM | Updated on Feb 6 2026 10:51 AM

TV Actor Nakuul Mehta says his first Telugu film never released

తెలుగు సినిమాతోనే తన ప్రయాణం మొదలైందంటున్నాడు బాలీవుడ్‌ నటుడు నకుల్‌ మెహతా. కానీ తెలుగులో నటించిన తొలి సినిమా ఇంతవరకు రిలీజవలేదని చెప్తున్నాడు. నకుల్‌ మాట్లాడుతూ.. తెలుగు మూవీతోనే నా కెరీర్‌ మొదలైంది. హైదరాబాద్‌ వెళ్లి మూడు నెలలు అక్కడే ఉన్నాను. అప్పుడు హీరోయిన్‌ శ్రియా పేరు బాగా వినిపించింది. ఖాళీగానే ఉన్న సమయంలో  తన సినిమాలు చూసేవాడిని. 

నా సినిమా ముందుకు కదల్లేదు
తన కెరీర్‌ కూడా అప్పుడప్పుడే మొదలైంది. కానీ ఆరంభం నుంచే సక్సెస్‌ఫుల్‌గా రాణించింది. నా సినిమా మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో నేను మళ్లీ ముంబై వచ్చేసి యాడ్స్‌ చేసుకుంటూ నా దారి నేను చూసుకున్నాను. నటుడినవ్వాలన్న కోరిక మొదట్లో అంత బలంగా లేదు. కాకపోతే నా చుట్టూ ఉంండేవారంతా నన్ను యాక్టింగ్‌ వైపు వెళ్లమని చెప్పేవారు. నాక్కూడా అందరినీ ఎంటర్‌టైన్‌ చేయడం అంటే ఇష్టం. 

టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా..
అలా తెలుగు సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకున్నాను. కానీ ఆ భాష నాకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. అయితే మన చుట్టూ ఉన్న మనుషులు సరిగా ఉంటే అన్నీ సర్దుకుపోవచ్చనిపించింది. ఈ అనుభవం నాకు బాగానే పనికొచ్చింది. కెమెరా ముందు నటించడాన్ని మరింత ప్రేమించాను. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి పర్ఫామెన్స్‌ ఇచ్చేందుకు నావంతు ప్రయత్నిస్తూనే ఉన్నాను. 

అదే సక్సెస్‌
శ్రియా 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఎంతో సక్సెస్‌ను చూసింది, స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. నా దృష్టిలో సక్సెస్‌ అంటే జనం మనల్ని ప్రేమించడమే! కాగా నకుల్‌.. ఇష్క్‌బాజ్‌ సీరియల్‌తో గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో అభిమాని (2005) సినిమాలో యాక్ట్‌ చేశాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఫుల్‌ యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. చివరగా స్పేస్‌ జెన్‌: చంద్రయాన్‌ అనే సిరీస్‌లో యాక్ట్‌ చేశాడు.

చదవండి: ధురంధర్‌ 2లో దర్శకుడి సతీమణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement