దర్శకధీరుడు రాజమౌళి- ప్రిన్స్ మహేశ్‌బాబులో కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ ప్రకటించేందుకే భారీ ఈవెంట్ నిర్వహించారు. గ్లోబ్‌ట్రాటర్ పేరుతో ఈవెంట్‌ని నిర్వహించి వారణాసి టైటిల్ రివీల్ చేశారు. వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది.
అయితే ఈ మూవీ బడ్జెట్‌పై ఇప్పటికే టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. రాజమౌళి అంటేనే భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే ఆర్ఆర్‌ఆర్‌కు రూ.600 కోట్లు ఖర్చు పెట్టిన రాజమౌళి.. ఈ సినిమాకు అంతకుమించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ మూవీకి దాదాపు 1200 కోట్లకు పైగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ప్రకటించపోయినా వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చని సినీ విశ్లేషకుల అంచనా.
ఈ క్రమంలో ప్రియాంక చోప్రా వారణాసి బడ్జెట్‌పై ఆసక్తికర సమాధానం చెప్పింది. ది కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంకను ఫన్నీ ప్రశ్న అడిగాడు కపిల్ శర్మ. వారణాసి మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. కానీ మీరు ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాక అది కాస్తా డబుల్ అయిందని తెలిసింది. ఇది నిజమేనా?అని ప్రియాంకను అడిగారు. దీనికి హీరోయిన్ స్పందిస్తూ.. అంటే బడ్జెట్‌లో సగం డబ్బులు నా ఖాతాలోకి వచ్చాయని చెబుతున్నారా? అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Priyanka chopra about #Varanasi on Kapil Sharma show
pic.twitter.com/6kgkusKaGf— Sunaina🦋 (@Sunaina_speaks) December 20, 2025


