‘ధురంధర్’ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు హీరో రణ్‌వీర్ సింగ్. అయితే ‘డాన్ 3’ సినిమా నుంచి రణ్‌వీర్ సింగ్ తప్పుకుంటున్నారనే టాక్ బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా
‘డాన్ 3’ సినిమా రానున్నట్లుగా 2023 ఆగస్టు 9న ప్రకటన వచ్చింది. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ ఈ ‘డాన్ 3’ సినిమాను నిర్మిస్తారని, 2025లో ఈ సినిమా విడుదలవుతుందనేది ఆ అనౌన్స్‌మెంట్ సారాంశం. కానీ వివిధ కారణాల వల్ల రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు.
‘ధురంధర్’ సినిమా తర్వాత రణ్‌వీర్ సింగ్ నెక్ట్స్ మూవీ ‘డాన్ 3’ అని అందరూ అనుకున్నారు. కానీ రణ్‌వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నారని బీ టౌక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డాన్ 3’ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు ‘డాన్’గా రణ్‌వీర్ సింగ్ వెండితెరపై కరెక్ట్ కాదన్నట్లుగా కొంతమంది షారుక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించారు (ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), ‘డాన్ 2 (2011) చిత్రాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించారు).
కానీ ‘డాన్ 3’లో యాక్టర్‌గా తాను ప్రేక్షకులను మెప్పిస్తానని రణ్‌వీర్ సింగ్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ ్ర΄ాజెక్ట్ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమాకు ‘ప్రళయ్’ అనే టైటిల్ ఖరారైందని, ఇదొక జాంబీ ఫిల్మ్ అని, ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ టాక్.


