'రాము రాథోడ్‌' సెల్ఫ్‌ ఎలిమినేట్‌.. ఎంత సంపాదించాడంటే.. | Ramu Rathod Self Elimination In Bigg Boss 9 Telugu Remuneration | Sakshi
Sakshi News home page

'రాము రాథోడ్‌' సెల్ఫ్‌ ఎలిమినేట్‌.. ఎంత సంపాదించాడంటే..

Nov 9 2025 8:07 AM | Updated on Nov 9 2025 8:29 AM

Ramu Rathod Self Elimination In Bigg Boss 9 Telugu Remuneration

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్‌ రాము రాథోడ్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. హౌస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన రాము రాథోడ్‌ సడెన్‌గా సెల్ఫ్‌ ఎలిమినేషన్‌ కావడంతో ఆయన ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. అయితే, షోలో ఉన్నంత కాలం పెద్దగా నెగటివిటీ లేకుండా బయటికి రావడం విశేషం. సుమారు 60 రోజులకు పైగానే బిగ్‌బాస్‌లో రాము ఉన్నాడు. దీంతో ఆయన భారీగానే రెమ్యునరేషన్‌ రూపంలో సంపాధించాడు.

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన రాము రాథోడ్ ఫోక్‌ సింగర్‌గా బాగా పాపులర్‌ అయ్యాడు.  “రాను బొంబాయికి రాను” అనే పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. దీంతో ఆయనకు చాలా సాంగ్స్‌ పాడేందేకు అవకాశాలు వచ్చాయి. ఇలాంటి సమయంలోనే బిగ్‌బాస్ ఛాన్స్‌ రావడంతో ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే, రాము రాథోడ్‌ ఒక వారానికి రెమ్యునరేషన్‌గా రూ. 2లక్షల వరకు తీసుకున్నట్లు టాక్‌ ఉంది. దీంతో 9వారాలకు గాను బిగ్‌బాస్‌తో అతను రూ. 18 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.

హోస్ట్ నాగార్జునతో పాటు హౌజ్‌మేట్స్‌ కూడా బిగ్‌బాస్‌లో ఉండాలని రాము రాథోడ్‌ను కోరారు. కానీ, తన వినకుండా ఇంటిని వీడాడు.  ఈక్రమంలో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. 'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్‌బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement