టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్పై ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ స్పందించింది. లులు మాల్లో జరిగిన సంఘటన తర్వాతే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పడంపై నిధి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. బాధితురాలిదే తప్పని నిందించడం మానిపులేషన్ అవుతుందని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇవాళ ప్రెస్ మీట్లో శివాజీ లులు మాల్లో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. నిధి అగర్వాల్‌కు అలా జరిగిన తర్వాతే తాను ఈ కామెంట్స్ చేశానని సమర్థించుకున్నారు.
అంతకుముందు దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లను ఉద్దేశించి చీప్ కామెంట్స్ చేశారు. ఈవెంట్లకు ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకోవద్దని.. అంతా బయటికి కనిపించేలా రావొద్దంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై సినీతారలతో పాటు యావత్ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంకర్ అనసూయతో పాటు సింగర చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా శివాజీకి కౌంటరిచ్చారు. ఈ కామెంట్స్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సైతం శివాజీకి నోటీసులు జారీ చేసింది.
క్షమాపణలు చెప్పిన శివాజీ..
తన కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో శివాజీ క్షమాపణలు కోరాడు. తాను ఆ రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందని.. అంతేకానీ నా ఉద్దేశం మాత్రం కరెక్ట్ అంటూ సమర్థించుకున్నారు. కేవలం ఆ రెండు పదాల వల్లే సారీ చెబుతున్నానంటూ వీడియోను రిలీజ్ చేశాడు.



