breaking news
Ramu Rathod
-
'బాయిలోనే బల్లిపలికే' ఫుల్ సాంగ్ వచ్చేసింది
జానపద ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) పాడిన కొత్త పాట ‘బాయిలోనే బల్లి పలికే’ నెట్టింట్ వైరల్ అవుతుంది. వారం క్రితం ప్రోమో విడుదల కాగా.. ఇప్పుడు ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. మంగ్లీ, నాగవ్వల కాంబినేషన్లో వచ్చిన ఈ పాట్ సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. కమల్ ఎస్లావత్ సాహిత్యానికి సురేష్ బోబ్బిలి సంగీతం అదిరిపోయింది. బాయిలోనే బల్లి పలికే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ వచ్చేశాయి. ఇన్‌స్టా ఆన్ చేస్తే చాలు ఇదే సాంగ్ ఊపేస్తుంది. ఈ మధ్యకాలంలో జానపద పాటలు భారీగా వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం రాను బొంబాయికి అనే పాటతో రాము రాథోడ్ ఏకంగా బిగ్‌బాస్ ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు మంగ్లీ పాడిన సాంగ్ కూడా ప్రేక్షకులను భారీగానే మెప్పిస్తుంది. మిలియన్ల కొద్ది వ్యూస్ రావచ్చని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. -
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్‌తో బయటకొచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. అయితే, తన అభిమానలు మాత్రం కాస్త నిరాశ చెందారు. సుమారు 60రోజుల పాటు తనకోసం అండగా నిలబడి ఓట్లు వేసిన వారందరికీ రాము రాథోడ్ తన కుటుంబంతో పాటు క్షమాపణాలు చెప్పాడు.బిగ్‌బాస్ గురించి రాము ఇలా చెప్పుకొచ్చాడు. ' నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకుల దేవుళ్లు అందరూ క్షమించండి. ఇదంతా నా కుటుంబం. వీళ్లందరినీ వదిలేసి తొలిసారిగా అన్నిరోజుల పాటు బయటే ఉండటం జరిగింది. దీంతో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ, కేవలం మీ అభిమానం వల్ల మాత్రమే బిగ్‌బాస్‌లో కొంతకాలమైన ఉండగలిగాను. ముఖ్యంగా మా అమ్మ, పిల్లలు గుర్తుకు రావడంతో హౌస్ నుంచి వచ్చేశాను. నా చిన్నతనం నుంచి నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు. కేవలం బిగ్‌బాస్ కోసం అక్కడ వాళ్లతో గొడవపడటం కూడా నాకు నచ్చలేదు. నా వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉండటం వల్ల హౌస్‌లో ఉండలేకపోయాను. కానీ, తనూజ మాత్రం చాలాసార్లు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. ప్రేక్షకుల నిర్ణయం వరకు ఉండాలని కోరింది. హౌస్‌లోని వారందరూ ఎంత ధైర్యం ఇచ్చినప్పటికీ అక్కడ ఉండటం ఇబ్బందిగానే ఉండేది. నా నిర్ణయాన్ని ప్రేక్షకులు గౌరవిస్తారని ఆశిస్తున్నాను.' అంటూ రాము తన ఫ్యామిలీతో ఒక వీడియో పంచుకున్నాడు. -
మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం
రాను బొంబాయికి రాను.., సొమ్మసిల్లి పోతున్నవే.. పాటలతో యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యాడు సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ ఛాన్స్ తెచ్చుకున్నాడు. తొమ్మిది వారాలు హౌస్‌లో ఉన్న రాము అమ్మపై బెంగ పెట్టుకుని లోలోపలే కుమిలిపోయాడు. చిన్నప్పుడు అమ్మనాన్నకు దూరంగా ఉన్నా.. ఇప్పుడు బిగ్‌బాస్‌కు వచ్చి వాళ్లకు దూరంగా ఉండటం తన వల్ల కావడం లేదంటూ స్వతాహాగా బయటకు వచ్చేశాడు. అసలు రాము పేరెంట్స్ ఏం చేసేవారు? ఎందుకు రాముకు దూరంగా ఉన్నారో వారి మాటల్లోనే చూద్దాం..మేస్త్రీ పనికి..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాము (Ramu Rathod) పేరెత్తగానే అతడి తల్లి.. నా కొడుకును రోజూ చూస్తున్నా, కానీ మాట్లాడలేకపోతున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత తమాయించుకుని ఆమె మాట్లాడుతూ.. నాకు ఐదుగురు సంతానం. పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి మేము ముంబై, పుణె వెళ్లి ఉప్పర్ (మేస్త్రీ) పని చేసేవాళ్లం. పొద్దున 4 గంటలకు పోతే రాత్రి 7 గంటలకు వచ్చేవాళ్లం. మొదట్లో నాకు రూ.30, నా భర్తకు రూ.60 ఇచ్చేవారు. నూకలతో వండిన అన్నం పెట్టేవాళ్లు. అందులో పురుగులు ఏరేసుకుని తినేవాళ్లం. నూకల బియ్యమే ఆహారంఊర్లో నా పిల్లలు సారా అమ్మేవాళ్లు. ఆ డబ్బుతోనే పుస్తకాలు కొనుక్కునేవాళ్లు. నేను కట్టెల మోపు అమ్మగా వచ్చిన డబ్బుతో నూకలు తెచ్చుకుని కుటుంబమంతా తినేవాళ్లం. కరోనా సమయంలో నా ఇంట్లోని నలుగురికి కరోనా వచ్చింది. అప్పుడు నేను, రాము కలిసి ఊరూరు తిరిగి కూరగాయలు అమ్మాం. ఒకప్పుడు మమ్మల్ని చాలా చిన్నచూపు చూసేవాళ్లు. అలా అవమానాలు పడ్డప్పుడు బతకాలనిపించలేదు. రేపు మా గతేంది? అని ఎంతో బాధపడ్డా.. కానీ, నా చిన్నకొడుకు దేవుడిచ్చిన వరం. కుటుంబ బాధ్యతను అతడే చూసుకుంటున్నాడు.నా భర్త కొట్టేవాడునాకు తన సంపాదనతో మొదటగా బంగారు కమ్మలు, మాటీలు కొనిచ్చాడు. అలాగే రూ.10 వేల చీర తెచ్చాడు. అందరూ మనవాళ్లే అంటారు. అన్నల కోసం, అక్క, చెల్లి కోసం చాలా ఖర్చు పెడతాడు. నాకు 6 తులాల బంగారం ఇస్తే, వాడి అక్కకు రూ.3 లక్షలు, చెల్లికి రూ.4 లక్షలు, అన్నకు రూ.16 లక్షలతో బస్ ఇప్పించాడు. అందరం ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్తుంటాడు అని ఎమోషనలైంది. భార్యాభర్తలు గొడవపడేవారా? అన్న ప్రశ్నకు నా భర్త నన్ను కొట్టేవాడు.. కానీ, ఎప్పుడు కొట్లాడుకున్నా వెంటనే కలిసిపోయేవాళ్లం అని చెప్పుకొచ్చింది.చదవండి: రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే.. -
రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!
పచ్చని పల్లెటూరులో బతికే గంగవ్వకు ఏసీ వాతావరణం పడక, హౌస్‌లో ఉండలేక రెండుసార్లు (తెలుగు బిగ్‌బాస్ 4, 8వ సీజన్స్‌లో) సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. గత సీజన్లో మణికంఠ మానసికంగా వీక్ అయిపోయానంటూ పంపించేయమని వేడుకుని బయటకు వచ్చేశాడు. ఇప్పుడదే రకంగా రాము రాథోడ్ కూడా ఇంటి మీద బెంగతో తనంతట తానే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ నుంచి బయటకు వచ్చాడు. నాగార్జున సర్దిచెప్పినా సరే వినకుండా ఎలిమినేషన్‌కే మొగ్గుచూపాడు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శనివారం (నవంబర్ 8వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..టాప్ 6లో ఎవరంటే?నాగార్జున, అమల, రామ్‌గోపాల్ వర్మల 'శివ' మూవీ ప్రమోషన్స్‌తో ఎపిసోడ్ మొదలైంది. తర్వాత.. కంటెస్టెంట్లు ఎవరు హిట్టు? ఎవరు ఫ్లాప్? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించారు. అందులో సుమన్, ఇమ్మాన్యుయేల్ (Emmanuel), తనూజ, కల్యాణ్, రీతూ, పవన్ టాప్ 6లో ఉన్నారు. వీరికి నాగ్ కొన్ని బంపరాఫర్స్ ఇస్తూనే కొన్ని కండీషన్స్ పెట్టాడు. వారి కోరికలు నెరవేర్చుకోవాలంటే కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నాడు.ఇమ్మూ స్వార్థంభరణి ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సుమన్ కెప్టెన్సీ కంటెండర్ అవుతాడని తెలిపాడు. దీన్ని సుమన్ తిరస్కరించి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ ఆడి గెల్చుకుంటానన్నాడు. ఇమ్మాన్యుయేల్‌కు గర్ల్‌ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ వచ్చిందని, అది వినాలంటే గౌరవ్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ పోతుందన్నాడు. ఆ పవర్ పోతే పోనీయ్.. అని భావించిన ఇమ్మూ.. ప్రియురాలి సందేశం విని ఎమోషనలయ్యాడు. తనూజ సోదరి వాయిస్ మెసేజ్ వినాలంటే కల్యాణ్ సీజన్ మొత్తం నామినేట్ అవాలన్నాడు. రీతూకి రెండు సర్ప్రైజ్లురెండువారాల్లో సోదరి పెళ్లి ఉందని ఎమోషనలైన తనూజ.. తన కోసం కల్యాణ్‌ను బలి చేసేందుకు ఒప్పుకోలేదు. కల్యాణ్‌కు వారంపాటు చికెన్, మటన్ కావాలంటే నిఖిల్ రెండు వారాలు నామినేట్ అవ్వాలన్నాడు. దీన్ని కల్యాణ్ తిరస్కరించాడు. రీతూ.. తండ్రి షర్ట్ పొందడం కోసం సంజనా చీరల్ని కోల్పోయింది. పవన్.. ఫ్యామిలీ ఫోటో కావాలంటే రీతూకి తండ్రి ఫోటో రాదన్నాడు. దీంతో అతడు తన ఫ్యామిలీ ఫోటో త్యాగం చేసి రీతూకి ఆమె తండ్రి ఫోటో వచ్చేలా చేశాడు.రాను బిగ్‌బాస్‌కు రానంటూ..ఇంటిమీద బెంగ పెట్టుకున్న రాము (Ramu Rathod)ను నాగ్ కదిలించగానే.. అతడు పాట రూపంలో తన బాధనంతా బయటపెట్టాడు. బయటకు వెళ్లిపోతానన్నాడు. హీరోలు ఆట అంతు చూస్తారు, కానీ మధ్యలో వదిలేయరు అని నాగ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రాము వినిపించుకోలేదు. క్షమించండి సార్, వెళ్లిపోతాను అని పదేపదే అదే మాట అన్నాడు. వెళ్లిపోవాలనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తా.. 10 సెకన్లలో నిర్ణయం చెప్పమంటూ టైమిచ్చినా.. వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. హౌస్మేట్స్ ఆపేందుకు ప్రయత్నించినా లెక్కచేయలేదు. అలా రాము స్వతాహాగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇది సడన్ ఎలిమినేషన్ కావడంతో అతడి జర్నీ వీడియో చూడకుండానే వెళ్లిపోయాడు.చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే.. -
'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్ రాము రాథోడ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. హౌస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన రాము రాథోడ్ సడెన్‌గా సెల్ఫ్ ఎలిమినేషన్ కావడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, షోలో ఉన్నంత కాలం పెద్దగా నెగటివిటీ లేకుండా బయటికి రావడం విశేషం. సుమారు 60 రోజులకు పైగానే బిగ్‌బాస్‌లో రాము ఉన్నాడు. దీంతో ఆయన భారీగానే రెమ్యునరేషన్ రూపంలో సంపాధించాడు.యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన రాము రాథోడ్ ఫోక్ సింగర్‌గా బాగా పాపులర్ అయ్యాడు. “రాను బొంబాయికి రాను” అనే పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. దీంతో ఆయనకు చాలా సాంగ్స్ పాడేందేకు అవకాశాలు వచ్చాయి. ఇలాంటి సమయంలోనే బిగ్‌బాస్ ఛాన్స్ రావడంతో ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే, రాము రాథోడ్ ఒక వారానికి రెమ్యునరేషన్‌గా రూ. 2లక్షల వరకు తీసుకున్నట్లు టాక్ ఉంది. దీంతో 9వారాలకు గాను బిగ్‌బాస్‌తో అతను రూ. 18 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.హోస్ట్ నాగార్జునతో పాటు హౌజ్‌మేట్స్ కూడా బిగ్‌బాస్‌లో ఉండాలని రాము రాథోడ్‌ను కోరారు. కానీ, తన వినకుండా ఇంటిని వీడాడు. ఈక్రమంలో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. 'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్‌బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేశాడు. -
బిగ్‌బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!
బిగ్‌బాస్ షోలో వీకెండ్ వచ్చిందంటే చాలు హౌస్ట్ నాగార్జున వచ్చేస్తారు. కాస్త సందడి చేస్తారు. ఈసారి కూడా అలానే 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ, మూవీలో హీరోయిన్-నాగ్ భార్య అమల షోలో సందడి చేశారు. నాగ్-అమల స్టెప్పులు కూడా వేశారు. ఇవన్నీ సరే గానీ వీకెండ్ వస్తే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి బిగ్‌బాస్‌కి ఛాన్స్ ఇవ్వకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)9వ సీజన్లో ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. ఈసారి సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ నామినేషన్స్‌లో ఉన్నారు. సేవ్ చేసేందుకు ఓటింగ్ లైన్స్ శుక్రవారం రాత్రి వరకు ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత చివరి స్థానంలో సాయి శ్రీనివాస్ నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీకెండ్ ఇతడు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని అంతా ఫిక్సయ్యారు. సరిగ్గా ఇలాంటి టైంలో ట్విస్ట్. గత కొన్నాళ్ల నుంచి డల్‌గా ఉన్న రాము.. సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.ఐదోవారం వరకు రాము రాథోడ్ బాగానే బండి లాక్కొచ్చాడు గానీ తర్వాత మాత్రం పూర్తిగా డల్ అయిపోయాడు. నామినేషన్స్‌లో వాదించట్లేదు, పైపెచ్చు తానే నామినేట్ అవుతానని అంటున్నాడు. మరోవైపు గేమ్స్ వేటిలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్లో వాళ్లు గుర్తొస్తున్నారని పదే పదే అంటున్నాడు. శనివారం ఎపిసోడ్‌లోనూ హౌస్ట్ నాగార్జున ఇదే విషయం అడిగారు. దీంతో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్)'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్‌బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని రాము దీనంగా చెప్పాడు. ప్రోమోలో డ్రామా చూపించినప్పటికీ నిజంగానే రాము బయటకొచ్చేశాడట. శనివారం ఎపిసోడ్‌లోనే ఈ సెల్ఫ్ ఎలిమినేషన్ ఉండబోతుంది.ప్రతివారం ఒకే ఎలిమినేషన్ ఉంటుందిగా. రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవడంతో రెగ్యులర్‌గా జరగాల్సిన ఉంటుందా లేదా అందరూ అనుకుంటున్నారు. అయితే సాయి శ్రీనివాస్‌ని కూడా పంపిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాలావరకు అయితే రాము మాత్రమే హౌస్ నుంచి బయటకు రావొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: చెల్లి సీమంతం గ్రాండ్‌గా చేసిన బిగ్ బాస్ వితిక) -
హౌస్‌లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో తొమ్మిదోవారం ఎలిమినేషన్‌కు సమయం ఆసన్నమైంది. ఈసారి భరణి, తనూజ, సుమన్, రాము, సాయి శ్రీనివాస్, సంజన, కల్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెను ఓటింగ్‌లో అగ్రస్థానలో నిలబెడుతూనే వస్తోంది. రెండో స్థానంలో కామన్ మ్యాన్ కల్యాణ్ దూసుకెళ్తున్నాడు. సుమన్ చిన్నగా నవ్వినా, ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా సరే.. ఓట్లు దానంతటదే వస్తాయి. చివర్లో వాళ్లిద్దరుఅలా అతడికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. సంజన ఎలిమినేషన్ గండానికి కాస్త దూరంలోనే ఉంది. భరణికి ఆమె కంటే తక్కువ ఓట్లే పడుతున్నాయి. చివర్లో రాము (Ramu Rathod), సాయి శ్రీనివాస్ మిగిలారు. ఇద్దరికీ చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన సాయికి తానేంటో నిరూపించుకునే టాస్క్ ఒక్కటికూడా పడలేదు. కానీ, నామినేషన్స్‌లో బాగానే మాట్లాడాడు. ఓట్లు పడాలంటే ఇది సరిపోదు. వెళ్లిపోవడానికి రెడీ?కనీసం కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో అయినా ఇరగదీద్దాం అనుకుంటే దివ్య, రీతూ.. అతడికి ఆ ఛాన్సు రాకుండా, లేకుండా చేశారు. ఫలితంగా అతడి మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. ఇక రాము విషయానికి వస్తే.. ఎప్పుడు వెళ్లిపోదామా? అని చూస్తున్నాడు. ప్రతి గేమ్‌లో తనంతట తానే పక్కకు తప్పుకుంటున్నాడు. ఆటలో గెలుపోటములు సహజం.. కానీ, ఆడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా పక్కకెళ్లి కూర్చుంటున్నాడు. అన్నింట్లోనూ గివప్ ఇచ్చేస్తున్నాడు. ఇల్లు గుర్తొస్తుందంటూ చాలాసార్లు ఒంటరిగా ఒక్కడే కూర్చుంటున్నాడు. చాలా డల్ అయిపోయాడు. రామును ఎలిమినేట్ చేస్తే బెటర్!ఆరెంజ్ టీమ్‌లో అందరూ సేఫ్ బ్యాడ్జ్ కోసం పోట్లాడుతుంటే నాకూ కావాలని మాటవరసకైనా అనలేదు. నాకొద్దని సింపుల్‌గా తేల్చేశాడు. కనీసం కెప్టెన్సీ కంటెండర్ అవుతాననీ వాదించలేదు. తనే స్వయంగా వదిలేసుకున్నాడు. తనకేదీ అవసరమే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అతడి వాలకం చూసి జనాలకు సైతం చిరాకొస్తోంది. ఇంత హోమ్ సిక్ అయితే రామును పంపించేయండి నాగార్జునగారూ అని కామెంట్లు చేస్తున్నారు. ఇతడికి ఓట్లేసి కాపాడే బదులు ఏదో ఒకటి చేయాలని తాపత్రయం చూపిస్తున్న సాయిని హౌస్‌లో ఉంచితే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి!చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి -
తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్‌తో మాధురి కంటతడి
సరిపోదా శనివారం అన్నట్లు నాగార్జున.. తనూజకు ఒక్కదానికే స్పెషల్‌గా సండేరోజు క్లాస్ పీకారు. దాన్ని క్లాస్ పీకడం అని కూడా అనరు. ఎక్కువగా కోప్పడకు, చెప్పే విధానం మార్చుకో, సహనంగా ఉండటానికి ప్రయత్నించు అని తనూజను బుజ్జగించినట్లే ఉంది. ఎలిమినేషన్‌ను మలుపు తిప్పే అస్త్రం తనూజ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని వాడకుండా భద్రంగా కాపాడుకుంది. మరి ఆదివారం (నవంబర్ 2వ) ఎపిసోడ్లో ఏం జరిగాయో చూసేద్దాం..పర్ఫామెన్స్ ఇరగదీశారుది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక, దీక్షిత్ శెట్టి బిగ్‌బాస్ షోకి వచ్చారు. వీళ్ల ఎదుటే హౌస్‌మేట్స్‌తో కొన్ని సీన్స్ రీక్రియేట్ చేయించారు. వాళ్ల యాక్టింగ్ చూసి రష్మిక కొన్నిసార్లు నోరెళ్లబెట్టేసింది. యాక్టింగ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇమ్మాన్యుయేల్ ఎగరేసుకుపోయాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్న అందరినీ నాగార్జున సేవ్ చేసుకుంటూ రాగా చివరకు గౌరవ్, మాధురి మిగిలారు. గౌరవ్, మాధురి.. ఇద్దర్నీ గేటు బయటకు తీసుకొచ్చాక హౌస్‌మేట్స్‌తో ఓ విషయం చెప్పాడు నాగ్. కాళ్లు పట్టుకున్న రాముఓట్ల పరంగా మాధురి చిట్టచివరి స్థానంలో ఉందన్నాడు. అయితే తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడని వెల్లడించాడు. అప్పటికే గౌరవ్‌ను నామినేట్ చేసి కుంగిపోతున్న రాము.. అతడ్ని కాపాడమని తనూజ కాళ్లావేళ్లా పడ్డాడు. చివరకు తనూజ గోల్డెన్ బజర్ ఉపయోగించకపోయేసరికి మాధురి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి గౌరవ్‌ను ఇంట్లోకి పంపారు. ఈ సంతోషం పట్టలేక రాము.. తనూజ కాళ్లు మొక్కడం గమనార్హం. మాధురి సంతోషంగానే బయటకు వచ్చేసింది.నా బంగారం తనూజ: మాధురిఎలిమినేట్ అవుతారనుకున్నారా? అని నాగ్ అడగ్గా.. బయటకు రావాలనే కోరుకున్నా.. ఎందుకంటే నవంబర్ 4న మా ఆయన బర్త్‌డే సార్.. అంటూ మాధురి అసలు విషయం చెప్పింది. తన ఏవీ చూసుకుని లైఫ్‌లాంగ్ మెమొరీ అని ఎమోషనలైంది. ముగ్గురికి గులాబీలు, ముగ్గురికి ముళ్లు ఇవ్వమని మాధురికి టాస్క్ ఇచ్చారు. మొదటి గులాబీ.. నా బంగారం తనూజకి ఇస్తా.. తను చాలా స్వీట్, నేను బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్‌తో ఆడుతుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుందన్నారు. అంతా అబద్ధం, తను తనలాగే ఉంది అని కంటతడి పెట్టుకుంది. డిమాన్ పవన్, పవన్ కల్యాణ్‌కు సైతం రోజాలు ఇచ్చింది.100%ఫేక్ముళ్ల గురించి అడగ్గానే మొదటిది భరణికి ఇస్తానంది. 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి గారే.. హౌస్‌లో ఉండటానికి తనకు అర్హత లేదు అని కుండబద్ధలు కొట్టి చెప్పింది. దివ్య కూడా అంతే.. తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. వాళ్ల గొంతు కూడా తనే అయిపోతుంది. అవి తగ్గించుకుని ఆడితే బెటర్ అని పేర్కొంది. వెళ్లిపోయేముందు.. తనూజ, నేనొక్కటే కోరుకుంటున్నా.. నువ్వు స్ట్రాంగ్‌గా, నవ్వుతూ ఉండాలి. విన్నర్‌గా చూడాలి.. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే అని చెప్పి వీడ్కోలు తీసుకుంది.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్ -
నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య
బిగ్‌బాస్ 9 (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్.. వరుసగా షోకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు ఐదో వికెట్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. కెప్టెన్ రాము మినహా అందరూ నామినేట్ అయినట్లు ప్రకటించాడు. కానీ ఇక్కడే ఓ అవకాశం కల్పించాడు. ఇమ్యూనిటీ దక్కించుకుని ఈ గండం గట్టెక్కవచ్చని తెలిపాడు. బలమున్నోడిదే గెలుపుఅందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఓ పెద్ద బెడ్‌ను గార్డెన్ ఏరియాలో పెట్టాడు. నామినేట్ అయినవాళ్లంతా ఆ బెడ్ ఎక్కి.. ఒక్కొక్కరిని కిందకు తోసేస్తూ ఉండాలి. బెడ్‌పై చివరివరకు ఉన్నవారికి ఇమ్యూనిటీ అందుతుంది. మొదట అందరూ కలిసి ఫ్లోరాను, తర్వాత సంజనాను తోసేసినట్లు తెలుస్తోంది. సుమన్, డిమాన్ పవన్‌ను కూడా తోసేశారు. దివ్యను తీసేయడానికి వస్తుంటే ఆమె తిరగబడింది. ఏ కారణంతో తీసేస్తున్నారని నిలదీసింది. ఎవరికీ ఏం పాయింట్ లేదని ఇమ్మాన్యుయేల్ కూల్‌గా ఆన్సరిచ్చాడు. నిలదీసిన దివ్యదాంతో దివ్యకు మరింత తిక్కరేగింది. ఈ రౌండ్లో నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్పులు పోతాయి, మీ బాండ్లు పోతాయి.. అని ఆవేశంతో ఊగిపోయింది. దీంతో శ్రీజ.. ధైర్యం, దమ్ము అనే పదాలు అనవసరంగా వాడుతున్నావని కౌంటరిచ్చింది. భరణి అన్న నిన్ను తోసేయడానికి రాలేదు.. అంటే స్నేహం కోసం ఆగిపోయాడా? అని నిలదీసింది. అలా గొడవలు, తోసుకోవడాలతోనే ఈ గేమ్ కొనసాగింది. ప్రస్తుతానికైతే ఫ్లోరా, సుమన్, డిమాన్ పవన్, సంజనా, తనూజ, రీతూ చౌదరి, దివ్య నిఖిత నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్‌గా జరుపుకుంటా!: శివజ్యోతి -
సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్‌స్టోరీ
దొంగతనంతో రోత పుట్టిస్తోంది సంజనా. ఒకటీరెండు కాదు ఏకంగా 8 గుడ్లు తినేసింది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో చక్రం తిప్పడంతో కల్యాణ్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. అందుకు కర్త, కర్మ, క్రియ రీతూ అని తెలిసి మోసపోయానంటూ ఏడ్చాడు. ఇక ఇమ్మూ తన లవ్‌స్టోరీ చెప్పాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాది శాడిజం: హరీశ్సంజనా.. అందరి గుడ్లు దొంగిలించి గుటుక్కుమని మింగేసింది. దాదాపు 8 గుడ్లు తినేయడంతో హరీశ్.. ఇది సైకోయిజం, శాడిజం.. మా అమ్మ ఇలా చేస్తే బయటకు పంపేవాడ్ని అని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌ను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). తనకు కల్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ అని శ్రీజ క్లారిటీతో ఉంది. పవన్.. బయటకు ఏమీ చెప్పకపోయినా తనకు రీతూ ఫస్ట్ ప్రియారిటీ అని అందరికీ తెలిసిందే! దీంతో బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లో ఫస్ట్ బెల్ అందుకున్న డిమాన్ పవన్.. కల్యాణ్‌ను ఎలిమినేట్ చేశాడు. అది కల్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు.నాలుగో కెప్టెన్తర్వాత శ్రీజ (Srija Dammu).. ఇమ్మూను ఎలిమినేట్ చేసింది. అనంతరం భరణి చేతికి గంట వెళ్లింది. రీతూకు సపోర్ట్ చేయమని ఓరకంగా బ్లాక్మెయిల్ చేసింది తనూజ. కానీ అప్పటికే రాముకి మాటిచ్చిన భరణి.. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తర్వాతెప్పుడైనా సాయం చేస్తాను, కానీ, ఇప్పుడు కాదంటూ రీతూను ఎలిమినేట్ చేశాడు. అలా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు. అంతా అయిపోయాక కల్యాణ్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది రీతూ. మోసపోయానని బాధనన్ను గేమ్‌లో తీసేయమన్నావా? అని కల్యాణ్ సూటిగా అడగ్గా అవునని తలాడించింది రీతూ (Rithu Chowdary). దీంతో చేయ్ తీయ్ అంటూ సీరియస్ అయ్యాడు. రీతూ, పవన్ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు లెక్కచేయలేదు. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్.. ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావ్? అని మనసులో బాధను బయటపెట్టాడు. నేను చెప్పేది విను అంటూ రీతూ వెంటపడ్డా సరే.. ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు బాధపడుతున్నా అని క్లాస్ పీకాడు కల్యాణ్. ఆ మాటతో బోరుమని ఏడ్చింది రీతూ.చూడకుండానే లవ్తర్వాత రాంబో ఇన్ లవ్ వెబ్‌సిరీస్ హీరోహీరోయిన్ హౌస్లోపలకు వచ్చారు. తమ ప్రేమకథల్ని చెప్పమన్నారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. నేను స్టాండప్ షోలు చేస్తున్నప్పుడు నాకు ఓ అమ్మాయి పెద్ద మెసేజ్ చేసింది. నా నెంబర్ ఇవ్వమని అడిగింది. అలా రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు షోలు లేవు, ఫేమస్ అవలేదు. తన ముఖం చూడకుండానే ప్రేమించాను. అప్పుడు తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చచ్చినా, బతికినా దీనితోనే కలిసుండాలనుకున్నాను. అంత మంచి అమ్మాయి. కానీ, తర్వాత షూటింగ్స్‌లో బిజీ ఉండి సరిగ్గా తనకు టైమ్ ఇచ్చేవాడ్ని కాదు. తనకోసం కప్పు గెలుస్తా..చిరాకుపడేవాడ్ని, తిట్టేవాడ్ని. బిగ్‌బాస్‌కు వచ్చాకే తన విషయంలో చాలా రియలైజ్ అయ్యా.. రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నాను. నా అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదు. అయినా నాకోసం ఉండిపోయింది. ఈ నవంబర్‌కు పీజీ చేసేందుకు ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కు వస్తున్నానని వెళ్లకుండా ఆగిపోయింది. నాకోసం ఎందుకింత చేస్తుంది? తనకోసం గెలవాలి, కప్పు తన చేతిలో పెట్టాలనే ఆడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.చదవండి: అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార -
ఇంగ్లిష్ వచ్చా? ఎక్కడినుంచి వచ్చావ్? నోరు పారేసుకున్న సంజనా
గతంలో గౌతమ్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చి నెగెటివ్ అయ్యాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ ఓవర్ డైలాగ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో విమర్శలపాలయ్యాడు. ఇప్పుడు సంజనా పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. మిడ్‌వీక్ ఎలిమినేట్ అయి వీకెండ్లో మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంజనా.. బ్రేకులు ఫెయిలైన బండిలా నోటికేదొస్తే అది మాట్లాడేస్తోంది. మొన్న తనూజను చీప్ అంటూ తిట్టిన ఆమె ఇప్పుడు రాముపై మాటలు వదిలింది. అసలేం జరిగిందో నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..వెరైటీ నామినేషన్స్ఈవారం నామినేషన్స్ కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). హౌస్‌మేట్స్‌తో లూడో గేమ్ ఆడించాడు. కాకపోతే డైస్ తిప్పడం.. దాని ప్రకారం ఎవరు పావులు ముందుకు జరపాలన్నది కెప్టెన్ పవన్ చేతిలో పెట్టాడు. దాంతో అతడు తనకు నచ్చిన టీమ్‌కు ఛాన్సులిచ్చుకుంటూ పోయాడు. అలా ఓ గేమ్‌లో సుమన్ శెట్టి టీమ్(సుమన్, ఫ్లోరా, రాము రాథోడ్) గెలిచింది. కెప్టెన్సీలో పవన్‌కు ఫేవర్ చేశావంటూ పాత కారణమే చెప్పి రీతూ చౌదరిని నామినేట్ చేశాడు సుమన్. సుమన్ టీమ్‌కే మరొకర్ని నామినేట్ చేసే ఛాన్స్ రాగా.. రాము సంజనాను నామినేట్ చేశాడు.ఇంగ్లిష్ వచ్చా?మీ వల్ల హౌస్ హార్మొని చెడిపోతుంది... మేము అమ్మలం కాబట్టి ఇలా చూస్తున్నారు. వాళ్లు అమ్మాయిలు కాబట్టి అలా చూస్తున్నారు అన్న మాట నచ్చలేదని కారణాలు చెప్పాడు. దీనికి సంజనా (Sanjana Galrani) ఒప్పుకోలేదు. దీందో రామ్.. హౌస్‌లో మోస్ట్ ఆఫ్ ది వయొలెన్స్ అంటూ ఏదో చెప్పబోయాడు. వయొలెన్స్ అంటే అర్థం తెలుసా? ఇంగ్లిష్ తెలుసా? వయొలెన్స్ అంటే కొట్లాట.. అంటూ కించపరిచినట్లు మాట్లాడింది. అక్కడితో ఆగలేదు. ఎక్కడినుంచి వచ్చావో.. నువ్వు ఓపిక అనేది నేర్చుకో అని మరో మెట్టు దిగి మాట్లాడింది.హరీశ్ బెదిరింపులుఎక్కడినుంచి వచ్చావంటే ఏంటి అర్థం? అని రాము నిలదీయగా.. అందులో తపఏపముంది? నాకు తెలుగొచ్చు, మీరు నేర్పించకండి అంటూ ఆవేశంతో ఊగిపోయింది. తర్వాత ఫ్లోరా.. తనను బెదిరించాడంటూ హరీశ్‌ను నామినేట్ చేసింది. నేను బెదిరించలేదు. తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకే సమస్యవుతుందని చెప్పాని వివరణ ఇచ్చాడు. అప్పటికీ తగ్గని ఫ్లోరా.. దివ్య మేకప్ సామాన్లు దొంగతనం చేయాలని హరీశ్ చెప్పారు. నామినేషన్స్‌లో ఆరుగురుకానీ దివ్య బట్టలు దొంగతనం అయినప్పుడు మాత్రం అది చాలా తప్పు అన్నారు. ఇదే డబుల్ ఫేస్ అంటూ బాగానే పాయింట్లు లాగింది. ఇంతలో రాము, తనూజ కూడా హరీశ్‌పై తమ పాయింట్లు చెప్పేందుకు మధ్యలో వచ్చారు. రీతూ.. శ్రీజను, శ్రీజ.. దివ్యను నామినేట్ చేశారు. ఇక ఈ వారం రీతూ, ఫ్లోరా, సంజనా, శ్రీజ, దివ్య, హరీశ్ నామినేట్ అయ్యారు. ఏదేమైనా మనీష్, ప్రియల ఎలిమినేషన్‌తో శ్రీజలో మార్పు వచ్చింది. అరుపులతో ఓటింగ్‌లు పడవు అని అర్థమై సైలెంట్ అయిపోయింది. కోపాన్ని, గొడవలను కాస్త పక్కనపెట్టి ఓర్పుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్‌పై కేసు -
మనుషుల్ని తొక్కేస్తున్నాడు, ఇతడితో బతకలేం.. వైల్డ్ ఫైర్‌లా సంజనా
బిగ్ షాక్.. సంజనా ఎలిమినేట్ అంటూ అందరిచెవిలో పూలు పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). అది నమ్మించడం కోసం ఆమెను ఇప్పుడు స్టేజీపైకి తీసుకొచ్చారు. ఎలిమినేట్ అయినవాళ్లు ఎలాగైతే వీడ్కోలు చెప్తారో.. తనతోనూ అలాగే చెప్పిస్తూ భలే డ్రామా క్రియేట్ చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. సుమన్ స్టాండ్ తీసుకోడుఅందులో సంజనా (Sanjana Galrani).. నేను ఎలిమినేట్ అవ్వడానికి అంత చెడ్డపనులేమీ చేయలేదు కదా! అని అమాయకంగా ముఖం పెట్టింది. దానికి నాగార్జున.. దొంగతనం ఒక్కసారి చేస్తే బాగుంటుంది, ప్రతిసారి అదే చేస్తే వాళ్లకు కూడా చిరాకొస్తుందన్నాడు. ఇక ఇంటిసభ్యుల గురించి సంజనా మాట్లాడుతూ.. సుమన్ దేనికీ స్టాండ్ తీసుకోడు. హరీశ్.. ఏం చెప్పినా గొడవకు వచ్చేస్తాడు. ఏం బిడ్డా? తక్కువ చూశానా?ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం చాలా కష్టం. తనే గొప్ప.. తనే ప్రధానమంత్రి అని ఫీలవుతాడు. మనుషుల్ని తొక్కుతున్నాడు. అతడితో బతకలేం.. ఒక్కసారి కూడా తన తప్పు ఒప్పుకోడు. రాము (Ramu Rathod).. నేను కొంతమందిని ఎక్కువగా, కొంతమందిని తక్కువగా ట్రీట్ చేస్తానని చెప్పాడు. నిన్నెప్పుడు తక్కువగా ట్రీట్ చేసాన్రా బిడ్డా.. నేను చీప్ అమ్మాయినా? అని నిలదీసింది.రికార్డింగ్ ఉంది, ఊరుకో..అందుకు రాము.. నేను చీప్ అనలేదండి అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. రికార్డింగ్ ఉంది, ఊరుకో.. అని నోరు మూయించింది. భరణితో.. ప్రతిరోజు అన్నాచెల్లిలా ఉండాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు నిలబడాలంటూ అతడిని కడిగిపారేసింది. ఇక ఇమ్మూ పేరెత్తగానే అటు ఇమ్మూ, ఇటు సంజనా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఒళ్లో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తొచ్చేది అని ఏడ్చాడు. చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్ -
పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్‌గా రాము రాథోడ్
బిగ్‌బాస్ హౌస్‌లో బండచాకిరీ చేస్తున్న టెనెంట్స్‌లో ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందుకోసం ఓ గేమ్ పెట్టాడు. ఓనర్లు విసిరే బంతులు, బొమ్మలను టెనెంట్లు క్యాచ్ చేసి వారి బాస్కెట్లో వేసుకోవాలి. ఎండ్ బజర్ వచ్చేవరకు ఆ బాస్కెట్‌లోని వస్తువులను ఎవరూ ఎత్తుకుపోకుండా భద్రంగా దాచుకోవాలి. బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర తక్కువ వస్తువులుంటే వారు ఎలిమినేట్ అవుతూ వస్తారు.గివప్ ఇచ్చేసిన సంజనామొదటి రౌండ్లో ఫ్లోరా, సంజనా బాగానే ఆడారు. కానీ ఫ్లోరా ఓడిపోయింది. అటు సంజన కూడా.. ఆల్రెడీ ఓ వారం కెప్టెన్‌గా ఇంట్లో ఉన్నాను కాబట్టి వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొంటూ గేమ్ నుంచి నిష్క్రమించింది. అయితే వీరిద్దరూ టెనెంట్స్‌లో ఎవరిని ఓనర్స్‌గా చూడాలనుకుంటున్నారో వారికి సపోర్ట్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9).ఈడ్చిపడేసిన సుమన్దీంతో ఇద్దరూ కలిసి రెండో రౌండ్లో సుమన్ దగ్గరున్న బొమ్మలు తీయబోయారు. వారిని వదిలించుకునే క్రమంలో సుమన్ (Suman Shetty) మోచేయి ఫ్లోరాకి తగిలింది. డిఫెండ్ చేసుకునే క్రమంలో అవతలి వారికి దెబ్బలు తగిలినా సరే సంచాలక్ ప్రియ.. అతడిని ఎలిమినేట్ చేసింది. కానీ తర్వాతి రౌండ్లో రీతూ డిఫెండ్ చేసుకునే క్రమంలో అవతలివారిని కొట్టినా ప్రియ ఆమెను ఎలిమినేట్ చేయకపోవడం గమనార్హం.రీతూ రిక్వెస్ట్ పట్టించుకోని సుమన్రీతూ నన్ను కొట్టినప్పుడు ఎందుకు ఔట్ చేయలేదు? మీ ఫ్రెండ్ అని వదిలేశారా? అని సంజనా నిలదీసినా సరే ప్రియ పట్టించుకోలేదు. ఇక ఫ్లోరా, సంజన, సుమన్.. ముగ్గురూ రీతూ (Rithu Chowdary)నే అటాక్ చేశారు. అన్నా ప్లీజ్ అన్నా, వాళ్లను ఆపు అన్నా.. అని రీతూ.. సుమన్‌ను బతిమాలుకున్నా అతడు పట్టించుకోలేదు. రీతూ బాస్కెట్ ఖాళీ చేసి తనూజ, రాము, ఇమ్మూకి వస్తువులు పంచేశారు. అది జీర్ణించుకోలేని రీతూ పిచ్చిపట్టినట్లుగా ఆడింది. రాము బాస్కెట్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసుకుంది.మాట మార్చేసిన రీతూఇక్కడ మరో ముఖ్య విషయమేంటంటే.. చివరి వరకు మనిద్దరమే ఉండాలని రామూతో డీల్ మాట్లాడుకున్న రీతూ.. దాన్ని మర్చిపోయింది. ఆమె మాట తప్పడం చూసి షాకైన రాము.. ఆటాడకుండా శిలలా నిల్చుండిపోయాడు. అది చూసి ఇమ్మూకి పాపం అనిపించడంతో తన బొమ్మలు రాముకిచ్చాడు. అలాగే రీతూ చేసిన పనిని తప్పుపట్టాడు. దీంతో ఆమె.. ముగ్గురు కలిసి నామీద పడితే ఫెయిర్గేమా? అని ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ మాటతో తనూజ కూడా రియాక్ట్ అయింది. నోరు మూయ్నువ్వు నా దాంట్లో బొమ్మలు తీద్దామని రాముతో చెప్పలేదా? అంటే నీకు గ్రూప్ గేమ్ కావాలి.. వాడికి వద్దా? అని నిలదీసింది. దాంతో రీతూ.. నేను, నీ పేరే చెప్పలేదని బుకాయించింది. ఈ క్రమంలో ఇద్దరూ నువ్వు నోరు మూయ్ అంటూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. సంజనా, ఫ్లోరా, సుమన్ సపోర్ట్ చేస్తామంటే తనూజ, ఇమ్మాన్యుయేల్ మాకు వద్దంటే వద్దని వేడుకున్నారు. సింగిల్‌గానే ఆడతామన్నారు. అలా రీతూ, తనూజ అవుట్ అయ్యాక ఇమ్ము, రాము మిగిలారు.ఓనర్‌గా రామువీరిలో ఒకరిని ఓనర్‌గా ప్రకటించమని టెనెంట్స్‌కు బాధ్యత అప్పగించాడు బిగ్‌బాస్. రీతూ తప్ప అందరూ ఇమ్మాన్యుయేల్‌కే ఓటేశారు. కానీ, రీతూ అస్సలు వినిపించుకోలేదు, రాము ఓనర్ అవ్వాల్సిందేనని బలంగా వాదించింది. దీంతో రామునే ఓనర్‌గా ప్రకటించారు. ఇదంతా అయ్యాక ఇమ్మూ ఎమోషనలయ్యాడు. నేను ఆడలేదా? గ్రూప్ సపోర్ట్ అడిగానా? అంటూ రీతూ మాటల్ని తలుచుకుని బాధపడ్డాడు. -
'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక ఇంత కథ ఉందా?
ఒక్క పాటతో ఫేమస్ అయిన యువకుడు రాము రాథోడ్. ఆ ఒక్క సాంగ్ అతని జీవితాన్నే కాదు.. కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన రాము రాథోడ్.. రాను బొంబాయి రాను అంటూ ఫోక్ సాంగ్ ప్రియులను ఓ ఊపు ఊపేశాడు. ఈ పాటతో డబ్బులు సంపాదించడమే కాదు.. ఏకంగా బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చేలా చేసింది. ఈ ఏడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు రాము రాథోడ్. ఈ సందర్భంగా తమ కుమారుడికి దక్కిన ఘనతపై రాము రాథోడ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రాము రాథోడ్ బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత రాము రాథోడ్ పేరేంట్స్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా కష్టాలు చూసిన రాము.. ఇప్పుడు మమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. రాను బొంబాయికి రాను.. అనే పాట రాయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. పుణె, ముంబయిలో మేము పడిన కష్టాలను చూసిన రాము రాథోడ్‌కు.. ఈ పాట రాయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.మేము పెంకుటిల్లులో ఉండేవాళ్లమని.. చాలా పేదరికంలో బతికామని వెల్లడించారు. సెలవుల్లో పుణె, ముంబయికి వచ్చి మాతో పాటు రాము కూడా పనులు చేశాడని తల్లిదండ్రులు తెలిపారు. ముంబయిలో కూడా హిందీ పాటకు డ్యాన్స్ చేస్తే కప్పు కూడా వచ్చిందన్నారు. అప్పటి నుంచి రాముకు మేమే టీవీ, టేప్ రికార్డర్, సౌండ్ బాక్స్ కొనిచ్చి ఇంటివద్దనే విడిచి ముంబయికి వెళ్లామని అన్నారు.లాక్ డౌన్లో రాము ఈ పాటలను రాయడం మొదలు పెట్టాడని పేరేంట్స్ తెలిపారు. నువ్వు వేరే పనిచేయలేవు.. నీకు నచ్చింది పని చేస్కో అన్నామని అతని తల్లి తెలిపింది. ఫస్ట్ సొమ్మసిల్లి అనే సాంగ్ రాశాడని వెల్లడించింది. ఆ తర్వాత చాలా పాటలు రాశాడని పేర్కొంది. అలా తన పాటలు మొదలెట్టిన రాము రాను బొంబాయికి రాను.. అంటూ సాంగ్‌తో ఫేమ్ తెచ్చుకోవడమే కాదు.. తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపాడు. కాగా.. 'సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ' సాంగ్‌ను కూడా రాము రాథోడ్ రచించడమే కాకుండా ఆలపించాడు కూడా.. 2022లో రిలీజైన ఈ పాట 290+ మిలియన్ (29 కోట్లకుపైగా) వ్యూస్ సాధించింది. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్.. అందుకే ఇదే సాంగ్‌ను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్ చేశారు. -
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నెల ప్రారంభమైన బిగ్‌బాస్ షో ఇప్పటికే ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా ఆరుగురు కామనర్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. అంతే కాకుండా రాను.. బొంబాయికి రాను అంటూ ఊపేసిన రాము రాథోడ్ సైతం బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఫోక్ సాంగ్‌తో వైరలైన రాము రాథోడ్ బిగ్‌బాస్‌లోకి వెళ్లడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే రాము రాథోడ్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో చూసిన తల్లిదండ్రులు మాత్రం ఫుల్ ఎమోషనలవుతున్నారు. రామును అలా చూడడం మేము తట్టుకోలేకపోతున్నామని రాము తండ్రి ఏడ్చేశారు. మాకు చదువు రాదని.. రాము నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉంటుందని.. ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తే మాకు నచ్చడం లేదన్నారు. కానీ అవన్నీ ఆటలో భాగమని మాకు తెల్వదని అంటున్నారు రాము పేరేంట్స్. అంతేకాకుండా రాము అందరికీ నచ్చే మనిషి అని అతని తల్లి అన్నారు. అందరినీ బాగా పలకరిస్తాడని చెప్పారు. రామును టీవీల్లో చూస్తుంటే మాకు బాధగా ఉందని అతని తండ్రి ఎమోషనల్‌గా మాట్లాడారు. నువ్వు చివరికీ వరకు హౌస్‌లో ఉండి కప్ గెలవాలని రాము తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాము గెలిస్తే మహబూబ్‌నగర్‌లోని గోపాలపురమంతా డ్యాన్స్ చేస్తామని అంటున్నారు అతని తల్లిదండ్రులు. ఏదేమైనా ఒక్క పాటతో ఫేమ్ తెచ్చుకుని బిగ్‌బాస్ వరకు వెళ్లిన రాము రాథోడ్ కప్ గెలవాలని అతని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. -
‘బిగ్‌బాస్’లోకి ‘రాను బొంబాయికి రాను’ రాము.. ప్రభాస్ హీరోయిన్.. లిస్ట్ ఇదే?
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి అందరికి తెలిసిందే. హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్ షో కోసం ఎదురు చూసే బుల్లితెర ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. త్వరలోనే సీజన్ 9(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. ఈ సారి ఈ గేమ్ షోని సరికొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్‌కి కంటెస్టెంట్లను డైరెక్ట్‌గా హౌస్‌లోకి పంపేవారు. ఈ సారి మాత్రం షో ప్రారంభానికి ముందే కొంతమందికి ‘అగ్ని పరీక్ష’ పెట్టారు. ఇందులో పాల్గొని గెలిచిన ఐదు లేదా ఆరుగురిని హౌస్‌లోకి పంపుతారు. వీరితో పాటు మరికొంతమంది డైరెక్ట్‌గా బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లబోతున్నారు.సరికొత్తగాబిగ్బాస్ సీజన్ 9ని కొత్తగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా ఒకే హౌస్‌లో ఉండేవాళ్లు. కానీ సీజన్ 9లో మాత్రం కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి..వేరు వేరు హౌస్‌లో ఉండబోతున్నారు. ఈ సీజన్లో 15 మంది కంటే ఎక్కువే హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. వారిలో సగం ఒక హౌస్‌లో ఉంటే..మరో సగం మంది వేరే హౌస్‌లో ఉంటారు. ఆట తీరుని బట్టి కంటెస్టెంట్ ఏ ఇంట్లో ఉండాలో డిసైడ్ చేస్తారట. వీరికి పెట్టే టాస్క్‌లు కూడా కొత్తగా ఉండబోతున్నాయట. ఈ సారి మైండ్ గేమ్‌తో పాటు ఫిజికల్ టాస్క్‌లు కూడా కాస్త కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కంటెస్టెంట్స్ వీరే?ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్‌బాస్ షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. సీజన్ 9లో పాల్గొనేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. వారిలో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష, యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, కమెడియన్ సుమన్ శెట్టి, కన్నడ నటి తనూజ పుట్టస్వామి, సీరియల్ నటుడు భరణి, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కామనర్స్గా శ్రీజ, పవన్ కల్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీశ్ వెళ్లే అవకాశం ఉంది. మరి వీరిలో నిజంగానే ఎంతమంది బిగ్‌బాస్ షోలోకి వెళ్తున్నారనే విషయం తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే. -
‘రానూ బొంబాయికి రాను’.. బడ్జెట్ 5 లక్షలు.. కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మధ్య తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కోపాటకి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. పెళ్లి బరాత్ మొదలు ఏ ఈవెంట్‌కి వెళ్లిన ఈ పాటలే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన అన్ని పాటలు ఒకెత్తు.. ‘రాను బొంబాయికి రాను..’ పాట మరో ఎత్తు. ఫోక్ సాంగ్స్‌లో ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు ఆ పాటకు రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పాటతో అటు వారిద్దరు ఫేమస్ అయిపోయారు. అయితే ఈ పాటకు చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయంపై రకరకాల పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా డ్యాన్సర్ లిఖిత క్లారిటీ ఇచ్చింది.రెండు రోజుల షూటింగ్.. ఖర్చు ఎంతంటే..రాము రాథోడ్ అన్నతో ముందుగా రెండు పాటలు అనుకున్నాం. ‘రాను బొంబాయికి..’ రెండో పాట. ఒక్క రోజులోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. ముందుగా ప్రొమో విడుదల చేశాం. అది బాగా వెళ్లింది. ఈ పాట కోసం చేసిన రీల్‌కి ఒకే రోజు మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో మేం కొన్ని మార్పులు చేశాం. పాట బాగా వెళ్లేలా ఉందని..రెండో రోజు వేరే చోట షూట్ చేశాం. అలా ఈ పాట కోసం మొత్తం రెండు రోజులు కేటాయించాం. ఇది హిట్ అవుతుందని తెలుసు కానీ..ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తున్నారు. నా పేరు తెలియకపోయినా..‘రాను బొంబాయి రాను’ అమ్మాయి అంటూ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు.రూ.కోటి వచ్చింది నిజమే కానీ.. ఈ పాటను రామ్ రాథోడ్ తన యూట్యూబ్ నుంచే రిలీజ్ చేశాడు. ఇప్పటి వరకు రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది నిజమే. అయితే రామ్ రాథోడ్ అన్నయ్య విల్లా కొన్నాడు.. బెంజ్ కారు కొన్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన ఏమి కొనలేదు. ఇక నా రెమ్యునరేషన్ విషయానికొస్తే.. రెండు రోజులకు ఎంత మాట్లాకున్నామో అంతే ఇచ్చేశాడు. భారీగా లాభం వచ్చింది కదా అని మేం ఎక్కువ అడగలేదు. ఎంత చెప్పారో అంతే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఏమైనా ఇవ్వాలా వద్దా? అనేది వాళ్ల ఇష్టం. నేను అయితే ఏమి ఆశించడం లేదు. మేం పడిన కష్టానికి గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని లిఖిత చెప్పుకొచ్చింది. కాగా, ఈ పాటకు రాము రాథోడ్ లిరిక్స్ అందించడమే కాకుండా ప్రభతో కలిసి చక్కగా ఆలపించాడు కూడా. శేఖర్ వైరస్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకి కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. రామ్ రాథోడ్ తన సొంత డబ్బులతో ఈ పాటను తెరకెక్కించాడు.


