బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్‌తో బయటకొచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. అయితే, తన అభిమానలు మాత్రం కాస్త నిరాశ చెందారు. సుమారు 60రోజుల పాటు తనకోసం అండగా నిలబడి ఓట్లు వేసిన వారందరికీ రాము రాథోడ్ తన కుటుంబంతో పాటు క్షమాపణాలు చెప్పాడు.
బిగ్‌బాస్ గురించి రాము ఇలా చెప్పుకొచ్చాడు. ' నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకుల దేవుళ్లు అందరూ క్షమించండి. ఇదంతా నా కుటుంబం. వీళ్లందరినీ వదిలేసి తొలిసారిగా అన్నిరోజుల పాటు బయటే ఉండటం జరిగింది. దీంతో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ, కేవలం మీ అభిమానం వల్ల మాత్రమే బిగ్‌బాస్‌లో కొంతకాలమైన ఉండగలిగాను. ముఖ్యంగా మా అమ్మ, పిల్లలు గుర్తుకు రావడంతో హౌస్ నుంచి వచ్చేశాను. నా చిన్నతనం నుంచి నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు. కేవలం బిగ్‌బాస్ కోసం అక్కడ వాళ్లతో గొడవపడటం కూడా నాకు నచ్చలేదు.
నా వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉండటం వల్ల హౌస్‌లో ఉండలేకపోయాను. కానీ, తనూజ మాత్రం చాలాసార్లు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. ప్రేక్షకుల నిర్ణయం వరకు ఉండాలని కోరింది. హౌస్‌లోని వారందరూ ఎంత ధైర్యం ఇచ్చినప్పటికీ అక్కడ ఉండటం ఇబ్బందిగానే ఉండేది. నా నిర్ణయాన్ని ప్రేక్షకులు గౌరవిస్తారని ఆశిస్తున్నాను.' అంటూ రాము తన ఫ్యామిలీతో ఒక వీడియో పంచుకున్నాడు.


