ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత..! | Prabhas Fans Hulchal At Vimal Theatre In hyderabad Ahead Of The Raja Saab Release, Video Went Viral | Sakshi
Sakshi News home page

Prabhas Fans At Vimal Theatre: ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. విమల్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా..!

Jan 8 2026 11:37 PM | Updated on Jan 9 2026 7:56 AM

Prabhas Fans Halchal at Vimal Theatre In hyderabad

ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. విమల్ థియేటర్‌లోకి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. తెలంగాణలో ప్రీమియర్ షోస్కు అనుమతులు లేకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మీడియా కోసం విమల్థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఫ్యాన్స్అక్కడికి చేరుకున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ప్రెస్షోను తాత్కాలికంగా నిలిపివేశారు. ఘటనతో విమల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్ జనవరి 9 థియేటర్లలో రిలీజవుతోంది. ఈనెల 8 ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. కానీ ఏపీలో ఇప్పటికేప్రీమియర్షోలు పడగా.. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో కేవలం మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement