
బిగ్ షాక్.. సంజనా ఎలిమినేట్ అంటూ అందరిచెవిలో పూలు పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). అది నమ్మించడం కోసం ఆమెను ఇప్పుడు స్టేజీపైకి తీసుకొచ్చారు. ఎలిమినేట్ అయినవాళ్లు ఎలాగైతే వీడ్కోలు చెప్తారో.. తనతోనూ అలాగే చెప్పిస్తూ భలే డ్రామా క్రియేట్ చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు.
సుమన్ స్టాండ్ తీసుకోడు
అందులో సంజనా (Sanjana Galrani).. నేను ఎలిమినేట్ అవ్వడానికి అంత చెడ్డపనులేమీ చేయలేదు కదా! అని అమాయకంగా ముఖం పెట్టింది. దానికి నాగార్జున.. దొంగతనం ఒక్కసారి చేస్తే బాగుంటుంది, ప్రతిసారి అదే చేస్తే వాళ్లకు కూడా చిరాకొస్తుందన్నాడు. ఇక ఇంటిసభ్యుల గురించి సంజనా మాట్లాడుతూ.. సుమన్ దేనికీ స్టాండ్ తీసుకోడు. హరీశ్.. ఏం చెప్పినా గొడవకు వచ్చేస్తాడు.

ఏం బిడ్డా? తక్కువ చూశానా?
ఇలాంటి వ్యక్తితో కలిసి జీవించడం చాలా కష్టం. తనే గొప్ప.. తనే ప్రధానమంత్రి అని ఫీలవుతాడు. మనుషుల్ని తొక్కుతున్నాడు. అతడితో బతకలేం.. ఒక్కసారి కూడా తన తప్పు ఒప్పుకోడు. రాము (Ramu Rathod).. నేను కొంతమందిని ఎక్కువగా, కొంతమందిని తక్కువగా ట్రీట్ చేస్తానని చెప్పాడు. నిన్నెప్పుడు తక్కువగా ట్రీట్ చేసాన్రా బిడ్డా.. నేను చీప్ అమ్మాయినా? అని నిలదీసింది.
రికార్డింగ్ ఉంది, ఊరుకో..
అందుకు రాము.. నేను చీప్ అనలేదండి అని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. రికార్డింగ్ ఉంది, ఊరుకో.. అని నోరు మూయించింది. భరణితో.. ప్రతిరోజు అన్నాచెల్లిలా ఉండాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు నిలబడాలంటూ అతడిని కడిగిపారేసింది. ఇక ఇమ్మూ పేరెత్తగానే అటు ఇమ్మూ, ఇటు సంజనా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఒళ్లో పడుకోబెట్టుకుంటే మా అమ్మ గుర్తొచ్చేది అని ఏడ్చాడు.
చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్