
ధర్మ మహేశ్ (Dharma Mahesh).. హీరోగా చేసింది రెండే రెండు సినిమాలు (సిందూరం, డ్రింకర్ సాయి).. కానీ సినిమా వార్తలకంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. అదనపు కట్నం అడుగుతున్నాడని, వేరే మహిళలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ మహేశ్‌పై సంచలన ఆరోపణలు చేసింది భార్య, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి. ఈ మేరకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరి (Rithu Chowdary) అతడి ఫ్లాట్‌కొచ్చిన వీడియోలు బయటపెట్టింది.
మీడియా ముందుకు ధర్మ మహేశ్
రీతూ కోసం అతడు గొడవపడ్డ చాటింగ్ స్క్రీన్‌షాట్స్ కూడా రిలీజ్ చేసింది. మహేశ్‌తో పాటు అతడి కుటుంబాన్ని సైతం నిందించింది. ఈ వివాదంపై చాలారోజులుగా సైలెంట్‌గా ఉన్న మహేశ్ ఎట్టకేలకు నోరు విప్పాడు. రీతూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ గౌతమి (Gautami Chowdary) వరుస ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో ఓపిక నశించిన మహేశ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తాను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే గౌతమి కూడా ఎన్నో తప్పులు చేసిందన్నాడు.
తన ఫోన్ నెంబర్ తెలీదు
అతడు ఇంకా మాట్లాడుతూ.. గౌతమి ఫోన్‌లోని సెకండ్ నెంబర్ ఏంటో కూడా నాకు తెలీదు. అడిగితే.. నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాది అంటుంది. మొగుడ్ని.. నాకే నెంబర్ చెప్పదు. రాత్రి వేరే ఎవడి కారులోనో బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తుంది. బాగా తాగి నా ఫోటోను కూడా కాల్చేసింది. ఇవన్నీ నేనెలా తట్టుకోవాలి. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు గుంటూరులో ఒకే గదిలో కలిసున్నాం. ఆ సమయంలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు నాకింకా 19 ఏళ్లే!
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ
అయినా సరే నేను నిలబడతాను, ప్రెగ్నెన్సీ ఉంచుకోమన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. పరువు పోతుందని అబార్షన్ చేయించుకుంది. వేలెత్తి నన్ను చూపించేముందు నిన్ను నువ్వు చూసుకో అంటున్నా.. నీకూ, నాకు పెద్ద తేడా ఏం లేదు. మే నెలవరకు కలిసుందామనే ప్రయత్నించాను. నేను గౌతమితో తప్ప ఎవరితోనూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవలేదు. నా కొడుకును చూపించమంటే లెక్కచేయడం లేదు. మే తర్వాత నుంచి నా కొడుకును ఇంతవరకు చూపించలేదు. నేను డబ్బు గురించి అడిగానంటే చెప్పుతో కొట్టండి. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. కావాలంటే రక్తపరీక్షలు చేయండి.ఈ ఇంటర్వ్యూలో నేను అబద్ధం చెప్తే కుక్కచావు చస్తాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ధర్మ మహేశ్.