గుడ్‌బై 2025 అంటూ వీడ్కోలు పలకడం, వెల్క్‌మ్ 2026 అంటూ స్వాగతం చెప్పడం.. కోసం ప్రపంచం సకల సన్నాహాలతో సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకలలో టాక్ ఆఫ్ ద ఈవెంట్స్‌గా నిలిచే ముఖ్యమైన అంశం సెలబ్రిటీల ప్రదర్శన. అదే క్రమంలో భారతీయ సినీ సెలబ్రిటీలు పలువురు రానున్న నూతన సంవత్సర వేడుకలలో ప్రదర్శన ఇస్తున్నారు. అందులో ఇప్పటివరకూ నిర్ణయమైన వాటిలో చెప్పుకోదగ్గ ఈవెంట్ గోవాలో జరుగుతోంది. మన మిల్క్ బ్యూటీ, తాజా ఐటమ్ నంబర్‌ల క్వీన్‌గా పేరొందిన తమన్నా అందులో పాల్గొంటోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం తమన్నా గోవాలోని బీచ్ ఫ్రంట్ హోటల్‌కు చేరుకుంది. అదే విధంగా బాలీవుడ్ నటి, రొమాంటిక్ చిత్రాల బ్యూటీ సన్నీ లియోన్ తెలంగాణ రాజధాని నగరంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటోంది.
ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల సైతం ఆమెకు జత కలవనున్నాడు. అదే విధంగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ గోవా, లక్నో... ఇతర ప్రధాన నగరాల్లో జరిగే కార్యక్రమాలలో సినిమా ప్రముఖులు పాల్గొంటున్నారు.
–గోవాలో బాలీవుడ్ నైట్ క్లబ్‌గా పేర్కొనే లాస్ ఒలాస్‌లో నటి తమన్నా, మరో నటి సోనమ్ బజ్వాలతో పాటు మ్యుజిషియన్ మిళింద్ గాబాలు పాల్గొంటున్నారు.
–ప్రముఖ నేపధ్యగాయని సునీత కూడా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకల్లో గళం కలుపుతున్నారు.
–ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్... విజయవాడలో జరుగుతున్న ఈవెంట్‌లో సందడి చేయనున్నాడు.
–ఢిల్లీలో ది లీలా యాంబియెన్స్ కన్వెన్షన్ హోటల్ జరిగే ‘డాజిల్ ఫ్రమ్ ది –ఈస్ట్‘ కార్యక్రమంలో పంజాబీ గాయకుడు, నటుడు జాస్సీ గిల్ – బబ్బల్ రాయ్ జంట ప్రత్యక్ష ప్రదర్శనలను అందిస్తుంది.
–హిందీ గాయని సప్నా చౌదరి – రేణుకా పన్వర్ లు ఢిల్లీలోని షాహ్దారాలో జరిగే ‘ఎపిక్ నైట్ అవుట్‘ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తోంది.
–ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ హైదరబాద్‌కి వస్తున్నాడు. నగరంలో జరుగుతున్న ఓ నూతన సంవత్సర వేడుకకు హాజరవుతున్నాడు.
–బాలీవుడ్ గాయని, నటి సునంద శర్మ: ఢిల్లీలోని లే మెరిడియన్ గుర్గావ్‌లో నిర్వహిస్తున్న విలాసవంతమైన నూతన సంవత్సర వేడుకలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనుంది.
––న్యూజిలాండ్‌కు చెందిన బాలీవుడ్ గాయని షిర్లీ సెటియా ‘బిగ్ బ్యాంగ్ బెంగళూరు‘ కార్యక్రమంలో ఆటపాటలతో అలరించనుంది.
–మాజీ బాలీవుడ్ నటి ర్యాప్ గాయని ఉదితా గోస్వామి బెంగళూరులోని స్టార్ హోటల్ హై అల్ట్రా లాంజ్‌లో జరిగే న్యూ ఇయర్ పార్టీలో పాల్గొంటోంది.


