నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిత్రమండలి’.. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌పై కల్యాన్ మంతిన, భాను ప్రతాప,డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. అయితే, ఈ మూవీకి సమర్పకులుగా నిర్మాత బన్నీ వాస్ ఉన్నారు. దీంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ మూవీ నష్టాలను మిగిల్చిందని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాస్ పేర్కొన్నారు.
‘మిత్రమండలి’ సినిమా తమకు నష్టాలను తెచ్చిందని బన్నీ వాస్ ఇలా అన్నారు. 'సినిమా పూర్తి అయ్యాక ఎడిటింగ్ రూమ్‌లో అందరం చూశాం. చాలా బాగుందని మాకు అనిపించింది. దీంతో థియేటర్స్‌లలో ప్రేక్షకులు కూడా నవ్యూతూ బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాం. కానీ, ఎక్కడో పొరపాటు జరిగింది. ప్రేక్షకులతో పాటు నేను కూడా సినిమా చూశాను. వారిలో నవ్వు అనేది కనిపించలేదు. నేను అంచనా పెట్టుకున్న సీన్లు కూడా మెప్పించలేదు. తొలిసారి మా అంచనా తప్పు అయింది. అయితే, ఎడిటింగ్‌లో పొరపాటు చేశామని తర్వాత అర్థమైంది. ఫైనల్ కాపీని విడుదలకు ముందు మరోసారి చూసుకొని ఉండింటే బాగుండేది. కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దీంతో మిత్రమండలి మూవీ వల్ల రూ. 6 కోట్లు నష్టపోయాం.' అని బన్నీ వాస్ పేర్కొన్నారు.
మిత్రమండలిలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్,సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న విడుదలైన ఈ చిత్రం 20రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ రైట్స్‌తో కలుపుకొని రూ. 9 కోట్ల వరకు మాత్రమే రికవరీ చేసినట్లు సమాచారం.
#Mitramandali 6 కోట్లు పోయింది.
ఆ తప్పు కరెక్ట్ చేయలేకపోయాం.
- @TheBunnyVas
Watch Full Interview https://t.co/wzUYcruF7Z pic.twitter.com/1Xe6Jkfmwe— Rajesh Manne (@rajeshmanne1) December 30, 2025


