Dharma Mahesh
-
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘డ్రింకర్ సాయి’
ధర్మ మహేష్ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ మహేశ్ హీరోగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 2024 డిసెంబర్లో థియేటర్స్‌లో విడుదలై యావరేజ్ టాక్ సంపాదించుకుంది. కానీ దాదాపు ఏడాదిన్నర ఓటీటీలోకి వచ్చి.. ఇక్కడ మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫ్రీ ఆన్ జీ5 విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది.ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగే పరిణామాలను, అతని ప్రేమ, ఆత్మగౌరవం, భావోద్వేగ సంఘర్షణలను ధర్మ మహేష్ ఎంతో నేచురల్‌గా నటించారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే థియేటర్లలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరింత పెద్ద స్థాయిలో ఆదరణ పొందుతోంది. అలాగే ఈ చిత్రంతో బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్ అందుకున్నారు ధర్మ మహేష్. హీరోయిన్గా నటించిన ఐశ్వర్య శర్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆమెకు ధర్మ మహేష్‌తో ఉన్న కెమిస్ట్రీ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలాగే రీతూ చౌదరి, పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి కథను మరింత బలపరిచారు. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్
ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలానే జెట్ లీ, కర, లీడర్, ఫేసెస్ అనే స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్ లాంటి వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఇవలా ఉండగానే ఓ తెలుగు మూవీ చాన్నాళ్ల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్‌తో ఈమెకు సంబంధమేంటి?)ధర్మ మహేశ్, ఐశ్వర్య శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'డ్రింకర్ సాయి'. 2024 డిసెంబరు చివరి వారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఘోరమైన డిజాస్టర్ అయింది. టీజర్, ట్రైలర్ లాంటివి పర్లేదనిపించినప్పటికీ.. అసలు సంగతి తేలిపోయింది. ఇప్పుడీ చిత్రం దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది.'డ్రింకర్ సాయి' విషయానికొస్తే.. తల్లిదండ్రులు కట్టించిన ఆస్పత్రి నుంచి వచ్చే డబ్బులతో సాయి(ధర్మ).. జల్సా చేస్తూ ముఖ్యంగా రోజంతా తాగుతూ ఓ ముగ్గురు ఫ్రెండ్స్‌ని వెనకేసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. తనకు యాక్సిడెంట్ చేసిన భాగి(ఐశ్వర్య శర్మ)ని ఇష్టపడి ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. భాగికి సాయి అంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ ఎక్కడ వయలెంట్ అయిపోతాడో అనే భయంతో ప్రేమని భరిస్తూ ఉంటుంది. ఈ బలవంతపు ప్రేమగాథ ఎక్కడివరకు సాగింది? చివరకు భాగి.. సాయిని మార్చుకోగలిగిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
జిస్మత్ మండీని ప్రారంభించిన సినీ నటుడు ధర్మ మహేష్
సినీ నటుడు, జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్ చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్ ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.సినీ నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ మండీ జిస్మత్ మండీ గా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismat కు మార్చాము ఇది నాణ్యత, భావోద్వేగం మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని అన్నారు. భావోద్వేగపరంగా, ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుంది. ధర్మ మహేష్ కంపెనీ యొక్క మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నాడు మరియు ఆ పరివర్తన పూర్తయ్యే వరకు, కార్యకలాపాలు మరియు విస్తరణను పర్యవేక్షిస్తునాము. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయి. మేము అందించే రుచి, నాణ్యత మరియు ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. ”ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్ ను బలోపేతం చేస్తుందని అని విశ్వసిస్తునాము అన్నారు. -
ప్రైవేట్ వీడియోలు బయటపెడతా! TV5 మూర్తి గలీజ్ దందా
-
10 కోట్లు డిమాండ్.. ఎలా ప్లాన్ చేశారంటే.. లాయర్ షాకింగ్ నిజాలు..
-
టీవీ5 మూర్తి, గౌతమి చౌదరికి షాక్!
సాక్షి,హైదరాబాద్: టీవీ5 మూర్తిపై కేసు నమోదైంది. వ్యక్తిగత గోప్యత, ప్రైవసీ భంగం కలిగించారనే అభియోగాలపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఏ1 గౌతమి చౌదరి,ఏ2 టీవీ5 మూర్తి పేర్లను చేర్చారు. టీవీ5 మూర్తి,గౌతమి చౌదరిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ5 మూర్తి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి TV5 మూర్తి , గౌతమీ చౌదరిలపై చట్ట పరమయిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో Tv5 మూర్తి పై, గౌతమి చౌదరిపై పోలీసులు 308 (3) BNS 72 IT Act ప్రకారం కేసునమోదు చేసి విచారణ చేపట్టారు . -
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్
ధర్మ మహేశ్ (Dharma Mahesh).. హీరోగా చేసింది రెండే రెండు సినిమాలు (సిందూరం, డ్రింకర్ సాయి).. కానీ సినిమా వార్తలకంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. అదనపు కట్నం అడుగుతున్నాడని, వేరే మహిళలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ మహేశ్‌పై సంచలన ఆరోపణలు చేసింది భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి. ఈ మేరకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరి (Rithu Chowdary) అతడి ఫ్లాట్కొచ్చిన వీడియోలు బయటపెట్టింది. మీడియా ముందుకు ధర్మ మహేశ్రీతూ కోసం అతడు గొడవపడ్డ చాటింగ్ స్క్రీన్‌షాట్స్ కూడా రిలీజ్ చేసింది. మహేశ్‌తో పాటు అతడి కుటుంబాన్ని సైతం నిందించింది. ఈ వివాదంపై చాలారోజులుగా సైలెంట్‌గా ఉన్న మహేశ్ ఎట్టకేలకు నోరు విప్పాడు. రీతూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ గౌతమి (Gautami Chowdary) వరుస ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో ఓపిక నశించిన మహేశ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తాను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే గౌతమి కూడా ఎన్నో తప్పులు చేసిందన్నాడు. తన ఫోన్ నెంబర్ తెలీదుఅతడు ఇంకా మాట్లాడుతూ.. గౌతమి ఫోన్లోని సెకండ్ నెంబర్ ఏంటో కూడా నాకు తెలీదు. అడిగితే.. నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాది అంటుంది. మొగుడ్ని.. నాకే నెంబర్ చెప్పదు. రాత్రి వేరే ఎవడి కారులోనో బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తుంది. బాగా తాగి నా ఫోటోను కూడా కాల్చేసింది. ఇవన్నీ నేనెలా తట్టుకోవాలి. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు గుంటూరులో ఒకే గదిలో కలిసున్నాం. ఆ సమయంలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు నాకింకా 19 ఏళ్లే!పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీఅయినా సరే నేను నిలబడతాను, ప్రెగ్నెన్సీ ఉంచుకోమన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. పరువు పోతుందని అబార్షన్ చేయించుకుంది. వేలెత్తి నన్ను చూపించేముందు నిన్ను నువ్వు చూసుకో అంటున్నా.. నీకూ, నాకు పెద్ద తేడా ఏం లేదు. మే నెలవరకు కలిసుందామనే ప్రయత్నించాను. నేను గౌతమితో తప్ప ఎవరితోనూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవలేదు. నా కొడుకును చూపించమంటే లెక్కచేయడం లేదు. మే తర్వాత నుంచి నా కొడుకును ఇంతవరకు చూపించలేదు. నేను డబ్బు గురించి అడిగానంటే చెప్పుతో కొట్టండి. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. కావాలంటే రక్తపరీక్షలు చేయండి.ఈ ఇంటర్వ్యూలో నేను అబద్ధం చెప్తే కుక్కచావు చస్తాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ధర్మ మహేశ్.చదవండి: నా భార్య బ్రష్‌తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త -
రీతూతో రిలేషన్‌పై స్పందించిన ధర్మ మహేశ..!
-
ముచ్చుముఖం.. నా భర్తకు ఏదో అలవాటు చేసింది, ఎంతమంది దగ్గర..!
టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్‌పై నెలన్నర క్రితం పోలీసు కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది. సినిమా ఛాన్సులు రావడంతో భర్త జల్సాలకు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలోనే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని మహేశ్‌తో పాటు అతడి కుటుంబంపైనా ఫిర్యాదు చేసింది. అయితే భార్యాభర్తల గొడవలో అనూహ్యంగా రీతూ చౌదరి పేరు తెరపైకి వచ్చింది.ఫ్రెండ్ మాత్రమే..గర్భవతిగా ఉన్నప్పుడు తనను పట్టించుకోవడం మానేసి రీతూ (Rithu Chowdary) వెంట తిరిగాడని మీడియాతో వాపోయింది గౌతమి. ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడింది. తన అడ్డు తొలగిపోవడంతో అర్ధరాత్రి రీతూ ఇంటికి వచ్చేదంటూ సీసీటీవీ వీడియోలు సైతం రిలీజ్ చేసింది. అటు ధర్మ మహేశ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. రీతూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. అంతమాత్రానికే డ్రగ్స్ అని, రిలేషన్ అని ఏవేవో ఊహించడం సరికాదని చెప్పాడు. 2023 నుంచే ఎఫైర్అయితే గౌతమి మాత్రం ఈ విషయంలో అస్సలు వెనక్కు తగ్గడం లేదు. మహేశ్ (Dharma Mahesh), రీతూ బెడ్రూమ్లో ఉన్న సీసీటీవీ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటోంది. అలాగే రీతూతో ఉంటూనే తనను చీప్‌గా తీసిపడేసేవాడంది. ఇంకా ఏమందంటే? నా భర్త నన్ను ఫ్లాట్ నుంచి వెళ్లగొట్టాక అక్కడేం జరుగుతుందనేది ఎంక్వైరీ చేశాను. రోజూ అర్ధరాత్రి రీతూ కారులో వస్తుందన్నారు. ఆమె సెలబ్రిటీ, పైగా సార్‌కు పర్సనల్ అని తన సెక్యూరిటీ చెప్పారు. 2023 నుంచే వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న అనుమానం మొదలైంది.ముచ్చుముఖంతో నాకు ఎఫైరా?ఒకసారి అదే మాట నా భర్తను అడిగాను. అందుకాయన.. హీరోయిన్లతో ఎఫైర్ అంటగట్టు. అంతేకానీ ఇలాంటి ముచ్చుముఖాలు, సైడ్ ఆర్టిస్టులతో సంబంధం అంటగట్టకు అన్నాడు. అతడి సినిమాలో రీతూ సైడ్ ఆర్టిస్ట్‌గా చేసింది. నేను గర్భిణీగా ఉన్నప్పుడు రీతూకి ఫోన్ చేసి ఈ ఎఫైర్ గురించి అడిగాను. అందుకామె ఛీఛీ.. నువ్వు నాకు తెలిసినదానివి. నేనెందుకు అలా చేస్తాను? అని నన్ను నమ్మించింది. కానీ, ఎప్పుడైతే రీతూ సావాసం మొదలైందో అప్పుడే నా భర్తకు ఏదో అలవాటు చేసింది.ఎంతమంది ఇళ్లలో దూరిందో..నా భర్త రాత్రిళ్లు రాకపోవడం, ఏవో నమలడం, కొన్నింటిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించడం.. ఇవన్నీ చూస్తుంటే నాకు అనుమానమేసింది. రీతూకి మా ఫ్లాట్ నచ్చిందట! ఆమె కోసమే నన్ను బయటకు వెళ్లగొట్టాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం నాలుగు గంటల వరకే రీతూ అక్కడ ఉంటుంది. వాళ్ల బెడ్రూమ్ వీడియోలు నా దగ్గరున్నాయి. నా ఇంటికే ఆమె అలా ధైర్యంగా వచ్చిందంటే ఇంకా ఎంతమంది ఇళ్లలో దూరింది?అదేంటో.. రీతూపై జాలినా అనుమతి లేకుండా నా భర్త దగ్గర అర్ధరాత్రి ఉండేందుకు తనెవరు? అదేంటో కానీ.. చాలామంది రీతూపై జాలిపడుతున్నారు. ఈ అమ్మాయి కాల్‌డేటా, వాట్సాప్ చాట్ తీయండి.. ఎంతమంది అబ్బాయిల డబ్బు కొల్లగొడుతుంది? ఈ డేటా మొత్తం తీయండి. ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తున్నవాళ్లందరూ కాస్తయినా సిగ్గుపడండి అని గౌతమి చెప్పుకొచ్చింది.చదవండి: పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్ ఖాన్ -
అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్
బిగ్‌బాస్ హౌస్‌లో రీతూ చౌదరి (Rithu Chowdary) వేసే వేషాలు చూస్తుంటే జనాలకు చిరాకు పుడుతోంది. అయితే డిమాన్ పవన్, లేదంటే పవన్ కల్యాణ్‌తో కూర్చుని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ, ఏదో ప్రేమపక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్‌బాస్ హౌస్‌ను పార్క్‌లా మార్చేసింది. కెప్టెన్‌గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరున ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నవాడిలా కల్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, హత్తుకుని ఓదారుస్తున్నాడు.భార్యను వదిలి రీతూతో..చిన్నచిన్నవాటికే కన్నీళ్లుపెట్టుకుంటున్న రీతూ బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో! హీరో ధర్మ మహేశ్ (Dharma Mahesh) వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా! అయితే తను గర్భంతో ఉండగా మహేశ్.. రీతూతో క్లోజ్‌గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడంది.రీతూ, నేను ఫ్రెండ్స్తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేశ్ స్పందించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. నాకు, రీతూకు మధ్య ఏం లేదు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే! తనను ఫ్రెండ్‌లా చూస్తాను. మా బెడ్రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటోంది కదా.. కావాలంటే రిలీజ్ చేసుకోమనండి. తను నా కొడుకుని నాకు చూపించడం లేదు. నేను డిప్రెషన్లో ఉన్నాను. సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకును ఎందుకు లాగుతున్నారు?ఇల్లు ఖాళీ చేయించిందిఏడేళ్లు కష్టపడి ఇంతదాకా వస్తే నా పేరును నాశనం చేసింది. తను అన్నీ అబద్ధాలే చెప్తోంది. నేనున్న ఇల్లు కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తానని అబద్ధం చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే.. ఆమె విడాకులు కావాలంటోంది కదా.. ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. -
Gowthami Chowdary: నా భర్తతో రీతూ చౌదరి ఎఫైర్..
-
విడాకులపై క్లారిటీ ఇచ్చిన గౌతమీ.. టాలీవుడ్ హీరోపై భార్య సంచలన ఆరోపణలు..!
-
Gautami Chowdary: అతనితో 19 ఏళ్లకే ప్రేమలో పడ్డా..! అప్పుడు తెలీదు, కానీ ఇప్పుడు
-
వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్
-
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
తెలుగు హీరో ధర్మ మహేశ్ (Dharma Mahesh) తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అతడి భార్య గౌతమి ఆరోపించింది. ఇన్నాళ్లూ మౌనంగా భరించానని, కానీ ఇకపై సహించేది లేదని చెప్తోంది. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.గర్భంతో ఉన్నప్పుడు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ.. ధర్మ మహేశ్ నటుడయ్యాకే విశ్వరూపం చూపించాడు. సినిమాల్లో హీరో, కానీ నిజ జీవితంలో విలన్. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను చంపేందుకు ప్లాన్ చేశాడు. పిల్లాడు పుట్టిన తర్వాత కొడుకుగా అంగీకరించలేదు. నా డబ్బు, నా హోటల్స్ మీద వచ్చే లాభాలు మాత్రం తీసుకుంటాడు. అతడి కుటుంబం మొత్తానికి డబ్బంటే పిచ్చి. చంపేస్తానని బెదిరింపులువాళ్లు వందల కోట్ల వరకట్నం కావాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ భరించలేకే పోలీసులను ఆశ్రయించాను. అయినప్పటికీ పోలీసులంటే ధర్మ మహేశ్‌కు లెక్కలేదు. ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. పైగా నన్ను, నా కుటుంబాన్ని తుపాకీతో కాల్చేస్తానని బెదిరించాడు. ఇన్నాళ్లు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నా.. ఇక నావల్ల కాదు! విడాకులివ్వను, ఇలాగే వేధిస్తానంటే ఊరుకోను. సామరస్యంగా విడిపోదాం అని చెప్పుకొచ్చింది.సినిమాకాగా ధర్మ మహేశ్, గౌతమి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. గతంలో మహేశ్‌పై వరకట్న వేధింపుల ఆరోపణలు రాగా.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె మీడియా ముందుకు వచ్చింది. మహేశ్.. సిందూరం, డ్రింకర్ సాయి చిత్రాల్లో నటించాడు.చదవండి: పేడ రుద్దుకున్న కంటెస్టెంట్.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా!


