వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య | Dharma Mahesh Wife Gautami Allegations on Husband | Sakshi
Sakshi News home page

హీరో కుటుంబానికి డబ్బు పిచ్చి.. అర్ధరాత్రిదాకా అమ్మాయిలతో తిరిగి.. భార్య సంచలన ఆరోపణలు

Aug 22 2025 4:04 PM | Updated on Aug 22 2025 4:40 PM

Dharma Mahesh Wife Gautami Allegations on Husband

తెలుగు హీరో ధర్మ మహేశ్‌ (Dharma Mahesh) తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అతడి భార్య గౌతమి ఆరోపించింది. ఇన్నాళ్లూ మౌనంగా భరించానని, కానీ ఇకపై సహించేది లేదని చెప్తోంది. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

గర్భంతో ఉన్నప్పుడు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ.. ధర్మ మహేశ్‌ నటుడయ్యాకే విశ్వరూపం చూపించాడు. సినిమాల్లో హీరో, కానీ నిజ జీవితంలో విలన్‌. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను చంపేందుకు ప్లాన్‌ చేశాడు. పిల్లాడు పుట్టిన తర్వాత కొడుకుగా అంగీకరించలేదు. నా డబ్బు, నా హోటల్స్‌ మీద వచ్చే లాభాలు మాత్రం తీసుకుంటాడు. అతడి కుటుంబం మొత్తానికి డబ్బంటే పిచ్చి. 

చంపేస్తానని బెదిరింపులు
వాళ్లు వందల కోట్ల వరకట్నం కావాలని డిమాండ్‌ చేశారు. ఇవన్నీ భరించలేకే పోలీసులను ఆశ్రయించాను. అయినప్పటికీ పోలీసులంటే ధర్మ మహేశ్‌కు లెక్కలేదు. ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. పైగా నన్ను, నా కుటుంబాన్ని తుపాకీతో కాల్చేస్తానని బెదిరించాడు. ఇన్నాళ్లు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నా.. ఇక నావల్ల కాదు! విడాకులివ్వను, ఇలాగే వేధిస్తానంటే ఊరుకోను. సామరస్యంగా విడిపోదాం అని చెప్పుకొచ్చింది.

సినిమా
కాగా ధర్మ మహేశ్‌, గౌతమి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. గతంలో మహేశ్‌పై వరకట్న వేధింపుల ఆరోపణలు రాగా.. పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె మీడియా ముందుకు వచ్చింది. మహేశ్‌.. సిందూరం, డ్రింకర్‌ సాయి చిత్రాల్లో నటించాడు.

చదవండి: పేడ రుద్దుకున్న కంటెస్టెంట్‌.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement