నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్‌'కు చెప్పు చూపించిన డీజే | The Raja Saab Movie: Is Thaman Composed Nache Nache Song Copy from Hollywood | Sakshi
Sakshi News home page

నాచే నాచే సాంగ్‌.. అక్కడి నుంచి కాపీ కొట్టిన తమన్‌?

Jan 10 2026 1:02 PM | Updated on Jan 10 2026 1:38 PM

The Raja Saab Movie: Is Thaman Composed Nache Nache Song Copy from Hollywood

ట్యూన్స్‌ కాపీ కొడతాడని మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌పై ఓ అపవాదు ఉంది. కొన్ని పాటలైతే.. వాటిని ఎక్కడో విన్నట్లుందే అని ప్రేక్షకులే అనుమానపడతారు. కానీ ఈసారి ట్యూన్‌ కాపీ కొట్టి.. ఒరిజినల్‌ కంపోజర్‌కే దొరికిపోయాడు. తమన్‌ లేటెస్ట్‌గా ది రాజాసాబ్‌ సినిమాకు సంగీతం అందించాడు. ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుంది. అదే 'నాచే నాచే'. ఇందులో ప్రభాస్‌.. ముగ్గురు హీరోయిన్లయిన నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌, మాళవిక మోహనన్‌తో కలిసి స్టెప్పులేశాడు.

కాపీ కొట్టాడా?
అయితే ఈ పాట ఒరిజినల్‌ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్‌.. తన ఒరిజినల్‌ సాంగ్‌ అలమేయో పాటను ప్లే చేశాడు. ఆ వెంటనే రాజాసాబ్‌లోని నాచే నాచే పాటను ప్లే చేశాడు. అది మక్కీకి మక్కీ అలాగే ఉండటంతో అతడి కోపం నషాళానికి అంటింది. ఆవేశంతో చెప్పు చూపిస్తూ వీడియో పెట్టాడు. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

రాజాసాబ్‌ రిలీజ్‌
ఇది చూసిన అభిమానులు ఈ సాంగ్‌ కూడా కాపీ కొట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొద్దిమంది మాత్రం పోనీలే.. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్‌ విషయానికి వస్తే.. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ హారర్‌ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. తమన్‌ సంగీతం అందించాడు. జనవరి 9న విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంటోంది.

 

 

చదవండి: నావాడిని కలిసానోచ్‌.. రోహిణి

Advertisement
 
Advertisement
Advertisement