పేడ రుద్దుకున్న కంటెస్టెంట్‌.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా! | Bigg Boss Agnipariksha Promo: Dammu Srija Counter to Anchor Sreemukhi | Sakshi
Sakshi News home page

అరిస్తే టీవీలు బంద్‌ చేస్తారన్న శ్రీముఖి.. అలాగైతే మూడో సీజన్‌లోనే టీవీలు ఆఫ్‌చేసేవారు!

Aug 22 2025 1:46 PM | Updated on Aug 22 2025 2:49 PM

Bigg Boss Agnipariksha Promo: Dammu Srija Counter to Anchor Sreemukhi

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టాలన్నది చాలామంది ఆశ. ఎలాగైనా సరే బిగ్‌బాస్‌ టీమ్‌ కంట్లో పడాలని చిత్రవిచిత్ర పనులు చేసిన జనాలున్నారు. అందులో మల్టీస్టార్‌ మన్మద రాజా ఒకరు. ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇతడు అగ్నిపరీక్ష షోకి సెలక్ట్‌ అవగా.. ఫస్ట్‌ ఎపిసోడ్‌లో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు.

పేడ రుద్దుకోమని టాస్క్‌
కానీ ఏడుపొక్కటే ఆయుధం అన్నట్లుగా కేవలం సింపతీ కోసమే ట్రై చేశాడు. ఇది చూసి జడ్జిలు ముగ్గురూ అతడిని రిజెక్ట్‌ చేశారు. బిగ్‌బాస్‌లో ఛాన్స్‌ కావాలంటూ సోషల్‌ మీడియాలో పిచ్చిపనులు చేసే వాళ్లందరికీ హౌస్‌లో ఎంట్రీ ఉండదని అతడి ఎలిమినేషన్‌తో క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే తాజాగా సెకండ్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్‌ చేశారు. ఇందులో పేడ రుద్దుకోమని చెప్పగానే ఓ లేడీ కంటెస్టెంట్‌ ఏమాత్రం ఆలోచించకుండా బుగ్గలపై పేడ పూసుకుంది. మరో లేడీ కంటెస్టెంట్‌ దమ్ము శ్రీజ స్టేజీపై కాస్త అతిగా ప్రవరిస్తూ జడ్జిలకు చిరాకు తెప్పించింది.

శ్రీముఖికి కౌంటర్‌
ఆమె అరుపులకు శ్రీముఖి స్పందిస్తూ.. ఇలా మొత్తుకుంటే పిల్ల ఏం అరుస్తుందని టీవీలు బంద్‌ చేస్తారని సరదాగా అంది. అలాగైతే సీజన్‌ 3లో నువ్వున్నప్పుడే టీవీలు ఆఫ్‌ చేసేవారని శ్రీజ కౌంటరిచ్చింది. ఆమెకు అభిజిత్‌ రెడ్‌ ఫ్లాగ్‌ ఇవ్వగానే.. ఓ, పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్లను హ్యాండిల్‌ చేయలేక రెడ్‌ ఇచ్చారా? అని నిలదీసింది. మరో ప్రోమోలో గొంగలి కప్పుకుని వచ్చిన తాత నర్సయ్య తన పాటతో అదరగొట్టాడు. ఈ ఎపిసోడ్‌లో మిరాయ్‌ ప్రమోషన్స్‌ కూడా జరిగాయి.

 

చదవండి: అగ్నిపరీక్ష: బిగ్‌బాస్‌ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement